జ‌గ‌న్‌కు ప‌వ‌న్ నీతి పాఠాలు

ఓట్ల శాతాన్ని అనుస‌రించి ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటే జ‌ర్మ‌నీకి వెళ్లొచ్చ‌ని వైసీపీకి ప‌వ‌న్ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం విశేషం.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ నీతి పాఠాలు చెప్ప‌డం విశేషం. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు అడ్డుకున్నారు. అనంత‌రం వైసీపీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

వైసీపీ తీరుపై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. మీడియాతో ప‌వ‌న్ మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రైంది కాద‌ని కోప్ప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్‌కు ఆరోగ్యం స‌రిగా లేక‌పోయినా, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి చెప్పార‌న్నారు. ఆరోగ్యం బాగా లేక‌పోయినా అసెంబ్లీకి వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తుంటే, వైసీపీ అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం హేయ‌మైంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష హోదా డిమాండ్ చేస్తే వ‌చ్చేది కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ప్రజలు ఇస్తేనే ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌, వైసీపీ స‌భ్యుల‌కు ప‌వ‌న్ నీతి పాఠాలు చెప్పారు. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జ‌న‌సేన అని ఆయ‌న అన్నారు. త‌మ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వ‌చ్చినా ప్ర‌తిప‌క్ష హోదా వ‌చ్చేది వైసీపీకి హిత‌వు చెప్పారు. అస‌లు 11 సీట్లే ఉన్న వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కుతుంద‌ని ఎలా ఊహిస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ ఐదేళ్ల‌లో వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా రాదు అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేయ‌డం విశేషం. ఈ విష‌య‌మై వైసీపీ మాన‌సికంగా ఫిక్స్ అయితే మంచిద‌ని ప‌వ‌న్ అన్నారు.

స‌భ‌లో వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీకి ఉన్న బలాన్ని అనుస‌రించి చ‌ట్ట‌స‌భ నిబంధ‌న‌ల మేర‌కు ఎంత స‌మ‌యం కేటాయించాలో అంతే ఇస్తార‌న్నారు. ఓట్ల శాతాన్ని అనుస‌రించి ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటే జ‌ర్మ‌నీకి వెళ్లొచ్చ‌ని వైసీపీకి ప‌వ‌న్ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం విశేషం. మ‌న దేశ నిబంధ‌న‌ల ప్ర‌కారం వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా సాధ్యం కాద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

28 Replies to “జ‌గ‌న్‌కు ప‌వ‌న్ నీతి పాఠాలు”

  1. పే డ అం టి న చె ప్పు తో జ గ్ల క్ గా డిని కొ ట్టా రు స ర్.. మీ రు సూ ప ర్ ప వ న్ గారు

  2. అప్పట్లో నేను రెండు సార్లు రెండు మార్కుల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేదు సర్.. నేను కూడా ఇలానే వాదించాను, రెండు మార్కులే కదా ఎందుకు క్వాలిఫై చెయ్యరు అని.. అందరూ నవ్వారు సార్.. సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోవాలి కానీ అలా మూర్ఖంగా వాదించకూడదు అని పెద్దలు చెప్పారు.. అప్పటి నుండి సైలెంట్ అయిపోయాను.. అప్పటినుండి అందరూ *మూర్ఖుడా* అని పిలవడం మానేసారు.. ఏంటో ఈ సిస్టమ్ .. జగనన్న రావాలి ఇలాంటివన్నీ మార్చాలి

  3. పవన్ పాఠాలు సంగతి పక్కన పెట్టండి.. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీ కి హాజరైనట్టు కాదంట .. మీడియా కోడై కూస్తోంది .. కొంచెం దానివైపు చూడండి

  4. గతం లో.. జస్ట్ రెండు మార్కుల్లో రెండుసార్లు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అర్హత కోల్పోయాను.. రెండు మార్కులే కదా ఎందుకు క్వాలిఫై చెయ్యరు అని తెగ వాదించాను.. అందరూ నన్ను తిట్టారు.. మూర్ఖంగా వాదించకు సిస్టమ్ ప్రకారం మసలుకోవాలి అన్నారు.. తప్పు తెలుసుకున్నాను సైలెంట్ అయిపోయాను.. అందరూ నన్ను మూర్ఖుడా అని అనడం మానేసారు

  5. 2024 ఎన్నికలలో చంద్రిక తోడు లేకుంటే ఇప్పుడు రష్యా లో మాడా వేషాలు వేసుకుంటూ ఉండేది

Comments are closed.