కురసాలతో ఆయన కనిపించలేదేంటి?

బొత్సకు కురసాలకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని రానున్న రోజులలో ఇద్దరూ కలసి గ్రూప్ ఫోటోగా దర్శనం ఇస్తారని ఇందులో వేరే అర్ధాలు పెడార్ధాలకు తావు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు తొలిసారి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. విశాఖలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉత్తరాంధ్ర జిల్లాలలో బిగ్ షాట్ గా ఉన్న మాజీ మంత్రి ఏపీ కౌన్సిల్ విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ కనిపించలేదేంటి అన్నది అంతా తర్కించుకుంటున్నారు. బొత్స ఈ పదవికి ఆశించారు అన్న ప్రచారం సాగుతూ వచ్చింది.

ఆయన ఉత్తరాంధ్ర మూలవాసి. మూడు జిల్లాలలో ఆయనకు రాజకీయ బలం మెండుగా ఉంది. సొంత సామాజిక వర్గంలో పట్టుంది. అందుకే ఆయనకు ఈ కీలక స్థానం ఇస్తే బాగుంటుంది అన్న భావన కూడా పార్టీలో ఒక సెక్షన్ లో వ్యక్తం అయింది.

అయితే జగన్ ఇప్పటికే బొత్సకు అనేక బాధ్యతలు ఉన్నందువల్ల కొత్త వారికి చాన్స్ అని అదే సామాజిక వర్గానికి చెందిన కురసాలను సెలెక్ట్ చేశారు. ఈ నియామకం తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన కురసాలకు మూడు జిల్లాల నుంచి పార్టీ నేతల నుంచి స్వాగతం లభించింది. బొత్స అయితే కనిపించలేదని ప్రచారం సాగుతోంది.

అయితే బొత్సకు కురసాలకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని రానున్న రోజులలో ఇద్దరూ కలసి గ్రూప్ ఫోటోగా దర్శనం ఇస్తారని ఇందులో వేరే అర్ధాలు పెడార్ధాలకు తావు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మూడు జిల్లాలలో ఉద్ధండ పిండాలు గట్టి నేతలు వైసీపీలో ఉన్న నేపథ్యంలో కురసాల వారితో ఎలా నెగ్గుకుని వస్తారో అన్న తర్జన భర్జన పార్టీలో ఉందిట.

13 Replies to “కురసాలతో ఆయన కనిపించలేదేంటి?”

Comments are closed.