శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెనక్కు తీసుకొచ్చే అంశంలో ఆశలు సన్నగిల్లాయి. 3 రోజులైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. దీంతో కార్మికుల విషయంలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని స్వయంగా మంత్రి జూపల్లి ప్రకటించారు.
ఈ టన్నెల్ మొత్తం పొడవు 44 కిలోమీటర్లు కాదా.. 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. సీలింగ్ నుంచి మట్టిపెళ్లలు, బురద ఒకేసారి కిందకు పడ్డాయి. ఆ టైమ్ లో అక్కడ 50 మంది పనిచేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ -టీబీఎం కు ఇటువైపు ఉన్న 42 మంది పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
వీళ్లంతా దాదాపు 2 కిలోమీటర్ల వరకు పరుగెత్తుకుంటూ వచ్చి, అక్కడ్నుంచి లోకో ట్రైన్ ఎక్కి బయటపడ్డారు. అయితే టీపీఎం దగ్గరగా, సరిగ్గా మట్టిపెళ్లలు విరిగిపడిన చోట ఉన్న 8 మంది మాత్రం చిక్కుకున్నారు. 40 మీటర్ల పరిధిలో ఈ 8 మంది చిక్కుకున్నట్టు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు.
ఇక సహాయక చర్యలకు ప్రతికూలంగా మారిన అంశాలేంటో చూద్దాం.. ఎక్కడైతే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయో, అక్కడ్నుంచి 100 మీటర్ల మేరకు బురద కూరుకుపోయింది. ఆ బురద తర్వాత దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాక్ పై నీరు చేరింది. ముందుగా ట్రాక్ పై ఉన్న నీరు తొలిగించే పనులు చేపడుతున్నారు. ఆ తర్వాత బురదను తొలిగించాల్సి ఉంటుంది. 14 కిలోమీటర్లు వద్ద ప్రమాదం జరగ్గా.. 11 కిలోమీటర్లు దాటి లోపలికెళ్లడం కష్టంగా మారింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. టన్నెల్ లోకి ఆక్సిజన్ అందించే పైప్ ను పునరుద్ధరించడంతో పాటు, విద్యుత్ ను కూడా తిరిగి తీసుకురాగలిగారు.
ఎస్ఎల్బీసీ ప్రస్థానం ఇది..
నల్గొండ, భువనగిరి, యాదాద్రి ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు.. హైదరాబాద్ కు తాగునీరు అందించే లక్ష్యంతో 40 ఏళ్ల కిందట చేసిన ఆలోచన ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. అదంతా అటవీ ప్రాంతం కావడంతో, సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించడమే ఏకైక మార్గమని1978లో అప్పటి ముఖ్యమంత్రి వేసిన నిపుణుల కమిటీ సూచించింది. అప్పట్నుంచి ఈ ప్రాజెక్టు పనులు నడుస్తూనే ఉన్నాయి. వైఎస్ఆర్ హయాంలో పనులు మరింత ఊపందుకున్నాయి.
అలా రాష్ట్ర విభజనకు ముందు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు 52 శాతం పూర్తవ్వగా, విభజన తర్వాత మరో 23 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మరోసారి ఈ పనుల్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఈశ్వరా కాపాడు .
Amen
God should save them
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి అనుమతులు లేవు , అక్రమంగా ఆంధ్ర జలాలు తరిలించటమే తెలంగాణ దురుద్దేశం అందుకే ఈ వైపరీత్యాలు , అసలు ఆ 8 మంది కార్మికులలో ఒక్కడు తెలంగాణ వాడు లేడు, మా నియామకాలు మాకు కావాలె అని తెలంగాణ నకిలీ ఉద్యమం