ఇది కరెక్టేనా? అందరికీ సాధ్యమేనా? పవన్!

ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలనే అనుకుంటారు. ప్రతి నియోజకవర్గ జనాలు తమ ఏరియా అభివృద్ది పథంలోకి వెళ్లాలనే అనుకుంటారు. కానీ అవకాశాలు అందరికీ రావు. ఆ సంగతి అలా వుంచితే…

ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలనే అనుకుంటారు. ప్రతి నియోజకవర్గ జనాలు తమ ఏరియా అభివృద్ది పథంలోకి వెళ్లాలనే అనుకుంటారు. కానీ అవకాశాలు అందరికీ రావు. ఆ సంగతి అలా వుంచితే ప్రతి వాటికీ కొన్ని రూల్స్ వుంటాయి, పద్దతులు వుంటాయి. కానీ వాటిన్నింటికన్నా అతీతంగా ఏదో జరిగితే బాగానే వుంటుంది. కానీ అలా జరగని వారికి బాధగా వుండదా?

పిఠాపురం నియోజకవర్గం మూడు శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ది. జనం అభిమానంతో గెలిపించుకున్నారు పవన్ ను. అందువల్ల ఆయన ఏదో ఒకటి చేయాల్సిందే. అదే చేస్తున్నారు కూడా. పవన్ అవసరం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి వుంది కనుక పవన్ ఎలా చెబితే అలా వింటారు. అందుకే పిఠాపురం అనే అతి చిన్న పట్టణానికి చుట్టూ వున్న మూడు పదులకు పైగా పల్లెలను కలిపి పిఠాపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటు చేసేసారు. సంతోషం. మంచిదే.

కానీ మిగిలిన ప్రాంతాల సంగతేమిటి? పిఠాపురం కన్నా పెద్దవైన పట్టణాలు చాలా అంటే చాలా వున్నాయి రాష్ట్రంలో. వాటన్నింటికీ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలు తీసుకువస్తారా? పిఠాపురం తో సహా దాదాపు ఓ జిల్లా అంత ప్రాంతం కలిపి కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీగా వుంది. ఇప్పుడు దాంట్లోంచి పిఠాపురం మినహాయించారు.

మరి మూడు జిల్లాల పరిథిలో విస్తరించి వుంది విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ. అలాగే మిగిలిన అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలు కూడా. వీటి పరిథిలో చాలా పెద్ద పట్టణాలు వున్నాయి. అవన్నీ పిఠాపురంతో పోల్చుకుంటే చాలా చాలా పెద్దవి. అలాగే నియోజక వర్గ కేంద్రాలు కూడా. మరి వాటి విషయంలో కూడా ఇలాగే చేస్తారా? విజయవాడ.. తెనాలి.. గుంటూరు మూడింటికి కలిపి ఒకటే అధారిటీ. గుంటూరు ఎంత పెద్ద పట్టణం. తెనాలి ఎంత పెద్ద పట్టణం.

మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా తమ తమ నియోజక వర్గాలను అభివృద్ది చేసాము అనే మాట తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తారా? పవన్ మాట చెల్లుతుంది కనుక ఓకె, అలా మిగిలిన వారి మాట చెల్లదు కదా? ఇప్పుడు పెద్ద పట్టణాల ఎమ్మెల్యేలు అంతా కలిసి చంద్రబాబు మీద వత్తిడి తేవాల్సి వుంటుంది. తమ పట్టణాలకు కూడా అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలు ఏర్పాటుచేయాలని. కానీ కూటమిలో మెజారిటీ ఎమ్మెల్యేలు అలా డిమాండ్ చేసే స్థితిలో లేరు.

అందువల్ల అందరూ పిఠాపురం కేసి చూసి నిట్టూర్చడం తప్ప చేసేది ఏమీ లేదు.

8 Replies to “ఇది కరెక్టేనా? అందరికీ సాధ్యమేనా? పవన్!”

  1. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక మేజర్ గ్రామ పంచాయితీ కి డబ్బులు తగలేసినప్పుడు ఏమైంది ఈ జ్ఞ్యానం.

  2. Swantha .paper mansuhuyalayina వలలకు అప్పనంగా డబ్బులు అప్యాప్జెప్తే ఏమయింది జ్ఞానం . రాష్ట్ర digital corpeation nimda కూడా మనోళ్లే ఉన్నారు .తేరగా ప్రభుత్వ డబ్బు లు అడ్డ దిద్ధంగా తిన్నారు

Comments are closed.