ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారని చెబుతున్నారు.
ఈ పర్యటనలో ఆయన అల్లూరి జిల్లా పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు, అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. నాలుగు నెలల క్రితం డిసెంబర్ లో వచ్చిన పవన్ అపుడు కూడా అల్లూరి జిల్లాలో రహదారుల నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు.
అయితే వాటి పనులు నేటికీ మొదలు కాలేదని గిరిజనులు తాజాగా ఆందోళన చేశారు. పదిహేను రోజుల వ్యవధిలోగా పనులు మొదలెట్టకపోతే భారీ నిరసనలు ఉంటాయని డెడ్ లైన్ పెట్టి మరీ హెచ్చరించారు. పవన్ శంకుస్థాపనలు చేస్తున్నా రహదారుల నిర్మాణానికి అవసరమైన భూముల కోసం అటవీ శాఖ అనుమతులు అవసరం అవుతున్నాయి. వాటిని సాధించకపోవడం వల్లనే కేవలం పునాది రాళ్ళుగానే ఇవి నెలల తరబడి మిగిలిపోతున్నాయని అంటున్నారు.
మరోసారి ఏజెన్సీ పర్యటనకు వస్తున్న పవన్ కి ఈ విషయం గిరిజన నాయకులు చెబుతారని అంటున్నారు. సత్వరమే తమ ప్రాంతాలకు రోడ్లు ఇతర వసతులు సమకూరితే మేలు అని వారు అంటున్నారు. పవన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. విశాఖ జిల్లాలో కూడా పవన్ టూర్ ఉంది.
జీవీఎంసీ మేయర్ మీద కూటమి నేతలు అవిశ్వాసం ఇచ్చిన నేపధ్యంలో పవన్ విశాఖ వస్తున్నారు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి జనసేన బలం 11కి చేరింది. వీరందరికీ జనసేన అధినేత ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తిగా ఉంది. పవన్ రెండు రోజుల పర్యటనలో రాజకీయ పరిణామాలు కూడా ఏమైనా ఉంటాయా అని జనసేనలో తర్కించుకుంటున్నారు.
ఓపెన్ ప్రొఫైల్
జాయిన్ అవ్వాలి అంటే