కొలిక‌పూడిలో పౌరుషం ఏమైంది?

గౌర‌వం, ఆత్మాభిమానం లేని చోట కొలిక‌పూడి ఇంకా ఎందుకు ఉన్నారో అనే చ‌ర్చ ఆయ‌న అభిమానుల్లో జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు అంటే పౌరుషానికి, విజ్ఞానానికి ప్ర‌తీక అని ఇంత‌కాలం అంతా అనుకున్నారు. సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగాల కోసం పోటీ ప‌డే విద్యార్థుల‌కు ఆయ‌న శిక్ష‌ణ ఇచ్చారు. వైసీపీ పాల‌న‌పై టీడీపీ అనుకూల చానెల్స్‌లో కూచుని, తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలా టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టిలో ప‌డి, తిరువూరు టికెట్ ద‌క్కించుకున్నారు. కూట‌మి సునామీలో ఆయ‌న సులువుగా గెలుపొందారు.

ఆ త‌ర్వాత కొలిక‌పూడి కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చామ‌న్న ఉత్సాహంలో టీడీపీకి చెందిన‌, అది కూడా అధికారం త‌మ‌ద‌ని భావించే సామాజిక వ‌ర్గానికి చెందిన ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కులు సంపాద‌న కోసం దారులు వెతికారు. మ‌ద్యం, ఇసుక‌, గ్రావెల్‌, జూదం త‌దిత‌ర వాటిని ఆస‌రాగా చేసుకుని, దీపం వుండ‌గానే ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల‌ని అనుకున్నారు. అలాంటివి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కుద‌ర‌వ‌ని కొలిక‌పూడి వార్నింగ్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో హెచ్చ‌రిస్తూ పోస్టులు కూడా పెట్టారు.

దీంతో కొలిక‌పూడితో సొంత పార్టీకి చెందిన నాయ‌కుల‌తో గొడ‌వ మొద‌లైన‌ట్టు… ఎమ్మెల్యే అనుచ‌రులు చెబుతున్నారు. అలా మొద‌లైన ర‌చ్చ‌… ఇంతింతై అన్న‌ట్టు చివ‌రికి సీఎం చంద్ర‌బాబు ప‌ల‌క‌రింపున‌కు కూడా నోచుకోని ప‌రిస్థితికి దారి తీసింది. అంద‌రితో ఆప్యాయంగా గ‌డిపిన చంద్ర‌బాబు, తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి వైపు క‌నీసం క‌న్నెత్తి చూడ‌డానికి కూడా ఇష్ట‌ప‌డలేదంటే ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. బ‌హుశా ఇలాంటి అవ‌మానం గ‌తంలో ఎవ‌రికీ జ‌రిగి వుండ‌దు.

కొలిక‌పూడి ఓవ‌రాక్ష‌న్ చేస్తార‌న‌డంలో రెండో మాట‌కు చోటులేదు. సామాజిక కోణంలో చూస్తే రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికై ఉండొచ్చు. కానీ ఆత్మాభిమానం కాస్త ఎక్కువే త‌ప్ప‌, గుండెల నిండా వుంద‌ని ఇంత‌కాలం ఆయ‌న అభిమానులు చెబుతూ వ‌చ్చారు. కానీ కొలిక‌పూడిని విస్మ‌రించ‌డం ద్వారా, సీఎం చంద్ర‌బాబు ఛీ కొట్టినంత ప‌ని చేశార‌ని లోకం కోడై కూస్తోంది. గౌర‌వం, ఆత్మాభిమానం లేని చోట కొలిక‌పూడి ఇంకా ఎందుకు ఉన్నారో అనే చ‌ర్చ ఆయ‌న అభిమానుల్లో జ‌రుగుతోంది.

మా కొలిక‌పూడిలో పౌరుషం ఏమైంది? అని ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు ఆవేద‌న‌తో నిల‌దీస్తున్నారు. త‌న‌కు జ‌రిగిన అవ‌మానం… కేవ‌లం వ్య‌క్తిగ‌తం కాద‌ని, సామాజికం అని స‌ర్వోన్న‌త ఉద్యోగాల‌కు పోటీ ప‌డే విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన కొలిక‌పూడికి ఎవ‌రు చెప్పాలి? అయినా ఒక‌రు చెబితే త‌ప్ప‌, త‌న‌కు ఆత్మాభిమానం వుంద‌ని గ్ర‌హించ‌లేని వాళ్ల‌కు …అణ‌గారిన వ‌ర్గాల ఆత్మ‌ఘోష ఎలా అర్థ‌మ‌వుతుందిలే? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆత్మాభిమాన‌మా? టీడీపీనా?… ఏది ముఖ్యమో తేల్చుకునే స‌మ‌యం ఇదే అని ఆయ‌న్ను అభిమానించే వాళ్లు హిత‌వు చెబుతుండ‌డం విశేషం.

20 Replies to “కొలిక‌పూడిలో పౌరుషం ఏమైంది?”

  1. అరె third grade జర్నలిస్ట్, కులం కుంపట్లు, ఫేక్ news లు రాస్తున్న నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదో ఒక ఆర్టికల్ రాయి!! ఇదే common man నీకు ఇస్తున్న 41 నోటీస్!! దమ్ము ఉంటే proove that you are a unbiased journalist!!

  2. అరె third grade జర్నలిస్ట్, కులం కుంపట్లు, ఫేక్ news లు రాస్తున్న నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదో ఒక ఆర్టికల్ రాయి!! ఇదే common man నీకు ఇస్తున్న 41 నోటీస్!! దమ్ము ఉంటే proove that you are a unbiased journalist!!

  3. ఎవ్వరూ పార్టీ కంటే గొప్ప కాదు. నందమూరి తారక రామమా రావు గారి లాంటి వారినే ప్రక్కన పెట్టారు టీడీపీ కార్యకర్తలు. అదే టీడీపీ గొప్పతనం.

  4. kootami gelinchedi 50% vella valana – kolikapudi, RRR, nelluru nalla balu, pattabi, gvr, eenadu, andhrajyothi. veetillo eenadu tappa vere evariki ippudu dikku divanam ledakkada. andaru edchukuntaa batikestunnaru. that is kootami.

  5. పోబే ఎప్పుడూ కాసుక్కున్చుటావ్. నువ్వో పెద్ద పౌరుషం వున్నోడివి మరి.నీ టైటిల్ మార్చి ఇంకోటి పెట్టు.

    సంవత్సరాలు పూర్తి గా రోడ్ మీద వెళ్ళడానికి భయం. ఎప్పుడు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో నీకు నచ్చింది పక్కోడిగా ఏదో ఒకటి గెలుకుదాని ఏదేదో వస్తుంటాయి నువ్వు కూడా బతకాలి కదా రాయి టైంపాస్ చదువు తాను

  6. CBN ignored kolikapudi for right reasons. How come he still didn’t resign.

    CBN ignored him because he is acting foolishly.

    CBN didn’t ignore the community.

    hey whoever is the writer of this article don’t try to make it as CBN has ignored whole community. Don’t play politics and create differences.

    Mr author whoever you are please include your name.

  7. వారికి నువ్వు ఎక్సపెక్ట్ చేసే చేంజ్ వచ్చే వరకు తొడ కొట్టుకుంటూ ఉండు

Comments are closed.