ప‌శ్చిమ‌బెంగాల్‌లో బాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం

చంద్ర‌బాబు, నితీశ్‌కుమార్ మ‌ద్ద‌తు వ‌ల్లే వ‌క్ఫ్ బిల్లు ఆమోదం పొందింద‌నే ఆగ్ర‌హం ముస్లింల‌లో తీవ్రంగా వుంది.

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లికిన ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ దిష్టిబొమ్మ‌ల‌ను ప‌శ్చిమ‌బెంగాల్‌లో ముస్లిం జేఏసీ నేతృత్వంలో ద‌హ‌నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ద్ద‌తుతోనే కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. ఏపీలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్ర‌భుత్వాలే ఉన్న సంగ‌తి తెలిసిందే.

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొంద‌డంపై ముస్లింల‌లో భ‌యాందోళ‌న నెల‌కుంది. ఈ బిల్లు ఆమోదంతో వ‌క్ఫ్‌న‌కు చెందిన ఆస్తుల్ని ప్ర‌భుత్వం లాక్కుంటుంద‌నే భ‌యం ముస్లింల‌ను వెంటాడుతోంది. ఈ బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని చంద్ర‌బాబునాయుడిని జాతీయ‌స్థాయిలో ముస్లిం నేత‌లు అభ్య‌ర్థించారు. అయితే ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామి అయిన చంద్ర‌బాబు ముస్లింల ఆందోళ‌న‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేరు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు, నితీశ్‌కుమార్ మ‌ద్ద‌తు వ‌ల్లే వ‌క్ఫ్ బిల్లు ఆమోదం పొందింద‌నే ఆగ్ర‌హం ముస్లింల‌లో తీవ్రంగా వుంది. అందుకే ప‌శ్చిమ‌బెంగాల్‌లో ముస్లింల జేఏసీ నేతృత్వంలో చంద్ర‌బాబు, నితీశ్‌కుమార్ దిష్టిబొమ్మ‌ల‌ను ఊరేగించి, అనంత‌రం ద‌గ్ధం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా జాతీయ స్థాయిలో చంద్ర‌బాబుపై ముస్లిం స‌మాజ అభిప్రాయం ఏంటో తెలిసొస్తోంది.

ఒక‌వైపు ముస్లింల వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకోవాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న చంద్ర‌బాబులో ఉన్న‌ప్ప‌టికీ, కూట‌మిలో భాగంగా వుండ‌డంతో అనివార్యంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి.

3 Replies to “ప‌శ్చిమ‌బెంగాల్‌లో బాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం”

Comments are closed.