దావోస్ పర్యటన ముసుగులో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. దావోస్ అనే పేరు చెప్పి గతంలో ఏయే ప్రకటనలు చేశారో.. తమ అనుకూల మీడియాలో పతాక శీర్షికలలో ప్రకటింప చేసుకున్నారో.. ఆ పార్టీ వారు పేపర్ క్లిప్పింగులతో సహా లెక్కలు తీస్తున్నారు.
అప్పట్లో ప్రకటించిన సంస్థలేవీ సంవత్సరాలు గడిచినాసరే, ఇప్పటిదాకా రాష్ట్రానికి రానేలేదు అనే వాస్తవాలను పేపర్ క్లిప్పింగులతో సహా ప్రదర్శించి తెలుగుదేశం బూటకపు ప్రచారాలను వైసీపీ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గతంలో చంద్రబాబు చేసిన ఒక్కొక్క దావోస్ ప్రకటనని నిశితంగా ఎత్తిచూపుతూ, ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదని తేల్చి చెప్పారు.
ఆలీబాబా సహా పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చయబోతున్నాయని గత తెలుగుదేశం హాయంలో చంద్రబాబునాయుడు దావోస్ కు వెళ్లి చేసిన ప్రకటనలను శ్రీకాంత్ రెడ్డి చూపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వారికి దీనికి కౌంటర్ ఇవ్వడం కూడా సాధ్యం అవుతున్నట్లు లేదు. ప్రభుత్వం తరఫున కౌంటర్ ఇవ్వడానికి పూనుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాటల్లో ప్రభుత్వపు డొల్లతనం బయటపడిపోతోంది.
ఎలాగంటే- దావోస్2కు వెళ్లారు వచ్చారు తప్ప సాధించింది ఏమీ లేదు.. అని ప్రతిపక్షం విమర్శిస్తూ ఉండగా.. మీరు దావోస్ కి వెళ్ళిన సంగతులు మాట్లాడుతున్నారు.. గూగుల్, టిసిఎస్ సంస్థలను తీసుకొచ్చిన ఘనత మాది అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు.
విపక్షం దావోస్ గురించి ప్రస్తావిస్తే దానితో నిమిత్తం లేకుండా జవాబు చెప్పడం చాలా చిత్రంగాను, ప్రభుత్వానికి అవమానకరంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా పెట్టుబడులను ఆకర్షించడానికి అనే ఉద్దేశంతో తండ్రి కొడుకులు దావోస్ వరకు వెళ్లారు. అక్కడ అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. దాని ఫలితం ఏమిటి? వీరు ఇంత కష్టపడి ఏం సాధించినట్లు? అనే అనుమానాలు ప్రజలకు రావడం అత్యంత సహజం. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే బూతులు మాట్లాడినట్లుగా అధికార పార్టీ నాయకులు ఆగ్రహంగా స్పందించడం చిత్రమైన పరిణామం.
రాంప్రసాద్ రెడ్డి ప్రస్తావిస్తున్న టిసిఎస్ తో ఒప్పందం ఎప్పుడో కుదిరింది. దాని గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాగే విశాఖలో గూగుల్ ఏర్పాటు కావడం అనేది రాష్ట్రం సాధించిన విజయం కింద పరిగణించడానికి లేదు. అది- పెట్టుబడులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టి గూగుల్ తో నడిపిస్తున్న ఒక వ్యవహారం మాత్రమే! అలాంటప్పుడు గూగుల్ రాక గురించి మరీ అతిగా ప్రచారం చేసుకుంటే బెడిసికొట్టే అవకాశం ఉంది.
అయినా.. సింపుల్ గా గమనించినప్పుడు.. దావోస్ కు వెళ్లి ఏం సాధించారు అని ప్రశ్నిస్తోంటే.. ఇతర విషయాల గురించి మాట్లాడడం అనేది రాంప్రసాద్ రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలను తామే బయటపెట్టుకుంటున్నట్టుగా ఉంది.
అవును మన అన్న 13 లక్షల కోట్ల mou సంగతి అడగ్గాలి
అప్పుడొచ్చిన MOU ల వల్లే .. ఇప్పుడు కొన్ని కంపెనీస్ రిలీజ్ అయుతున్నాయ్…. ఆ లెక్కన కూడా… బాబోరు జగన్కి రుణపడి ఉంటారు..
ఏది ఒక కంపెనీ పెరు చెప్పు…
Greenko
అయిదు ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు రుణపడి ఉండాలి
మన A1 ఐతే దావోస్కే పోకుండా ప్యాలెస్ లో పడుకునే investors మెడలు 11 ఇంచులు వొంచి, 13 లక్షల కోట్ల గుడ్లు పెట్టుబడి తెచ్చి ఇక్కడ ఒక్కొక్కడికి 11 ఉద్యోగాలు తెచ్చేవాడు తెలుసా??
అంతకుముందో సారి దావోస్లో చలినే వణికించి, lengthy ఇన్వెస్ట్మెంట్ తెచ్చి చెడుగుడు ఆడేసాడు గుర్తుందా??
Brand building for the state among industrialists is a continuous process. Several times failures do happen, while a few successful attempts will also be there. But pinpointing a failure here and there is meaningless. YCP people don’t understand the fact that brand building is a continuous process, they proved themselves that YCP is not capable of ruling a state.
దావోస్ మాటేత్తితే “its ఆ lengthy question you know?? అనాలే.. గూగుల్ కాదు