ఘోర ప్రమాదం.. ఇదీ ట్రంప్ రియాక్షన్

విమాన ప్రమాదం తర్వాత ట్రంప్ రియాక్షన్ ఇది. సహాయ చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న ట్రంప్.. కమాండ్ కంట్రోల్ సిబ్బంది తప్పిదంగా దీన్ని చెబుతున్నారు.

అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, మిలట్రీ హెలికాప్టర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విమానం, హెలికాప్టర్ రెండూ నదిలో పడడం, ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలు ఉండడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయి.

జరిగిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేయడంతో పాటు, అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. నేరుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను తప్పుబట్టారు.

“విమానం రన్ వే వైపు కచ్చితమైన మార్గంలోనే ఉంది. సాధారణంగానే ప్రయాణిస్తోంది. హెలికాప్టర్ మాత్రం చాలా సేపు నేరుగా విమానం వైపు దూసుకొచ్చింది. చీకటి అయినప్పటికీ అంతా స్పష్టంగా ఉంది. విమానంలో లైట్లు వెలిగిపోతున్నాయి. మరి హెలికాప్టర్ ఎందుకు పైకి లేదా క్రిందికి లేదా పక్కకు వెళ్ళలేదు. కంట్రోల్ టవర్ సిబ్బంది, ‘విమానం చూసారా’ అని అడిగే బదులు హెలికాప్టర్‌కు ఏం చేయాలో నేరుగా ఆదేశం ఇస్తే సరిపోయేది కదా.. అలా ఎందుకు చెప్పలేదు.”

విమాన ప్రమాదం తర్వాత ట్రంప్ రియాక్షన్ ఇది. సహాయ చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న ట్రంప్.. కమాండ్ కంట్రోల్ సిబ్బంది తప్పిదంగా దీన్ని చెబుతున్నారు. అయితే వైట్ హౌజ్ మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. ఇక హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముంది.

2 Replies to “ఘోర ప్రమాదం.. ఇదీ ట్రంప్ రియాక్షన్”

Comments are closed.