కూట‌మి స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!

ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కి ముందస్తు బెయిల్ మంజూరైంది.

ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కి ముందస్తు బెయిల్ మంజూరైంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన సంద‌ర్భంలో సీఐడీకి సంజ‌య్ చీఫ్‌గా వుండేవారు. వైసీపీ హ‌యాంలో ప‌ని చేసిన కీల‌క అధికారుల‌ను కేసుల్లో ఇరికించి, ఎలాగైనా బుద్ధి చెప్పాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇందుకోసం నారా లోకేశ్ ప్ర‌త్యేకంగా రెడ్‌బుక్‌ను కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు సంజ‌య్‌కి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఏసీబీ ప్ర‌య‌త్నాల‌న్నీ నిష్ప్ర‌యోజ‌నం అయ్యాయి.

అస‌లు కేసు ఏంటో తెలుసుకుందాం. వైసీపీ హ‌యాంలో సంజ‌య్ సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాప‌క‌శాఖ డీజీగా ప‌ని చేశారు. ఇదే సంద‌ర్భంలో సంజ‌య్ అవినీతికి పాల్ప‌డ్డార‌నేది ఏసీబీ ఆరోప‌ణ‌. 150 ట్యాబ్‌ల సరఫరా, ‘అగ్ని’ ఎన్‌వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి కోసం సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణకు క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ అభియోగాలు న‌మోదు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఒప్ప‌దం చేసుకున్నార‌ని, బిల్లుల చెల్లింపుతో రూ.1.75 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సంజ‌య్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో సంజ‌య్‌కి అరెస్ట్ భ‌యం ప‌ట్టుకుంది.

ముందస్తు బెయిల్‌ మంజూరు కోరుతూ ఆయ‌న‌ హైకోర్టును ఆశ్రయించారు. ప‌లు ద‌ఫాలు విచార‌ణ అనంత‌రం ఇవాళ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. సంజ‌య్‌కి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు అనుకున్న‌ట్టుగా సంజ‌య్‌ని అరెస్ట్ చేయ‌లేని స్థితి.

2 Replies to “కూట‌మి స‌ర్కార్‌కు హైకోర్టులో షాక్‌!”

  1. వాడిని నిజం గా అర్రెస్ట్ చెయలి అనుకుంటె, ఇన్ని రొజులు అర్రెస్ట్ చెయకుండా ఉంటారా? కొర్ట్ కి వెళ్ళి బైలు తెచ్చుకునె దాకా ఎదురు చూస్తారా?

Comments are closed.