శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ కు వెళ్లారు.. వచ్చారు. ఎవరు ఏం సాధించారు.. అనే చర్చ సాధారణంగా జరుగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ కు వెళ్లారు.. వచ్చారు. ఎవరు ఏం సాధించారు.. అనే చర్చ సాధారణంగా జరుగుతుంది. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కలిసే దావోస్ వెళ్లారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ దావోస్ వెళ్లినా సరే.. సాధించినది ఏమీ లేదంటూ ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నది. వారి విమర్శలను రాజకీయ విమర్శలుగా ఎన్డీయే కూటమి పార్టీల అభిమానులు కొట్టి పారేయడం చాలా ఈజీ. కానీ.. ప్రజలకు కలిగే ఒక సందేహాన్ని మాత్రం నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనలను ప్రజలు పోల్చి చూసినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమైనట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే- దావోస్ వెళ్లేముందు రకరకాల ప్రకటనలు చేశారు. వెళ్లిన సమయంలో.. త్వరలోనే కాగ్నిజెంట్ అనే ప్రకటన తప్ప.. పెట్టుబడుల రాక గురించి ఆశ పుట్టించే ప్రకటన ఒక్కటి కూడా లేదు. అది కూడా గ్యారంటీ లేని ప్రకటన. తీరా వచ్చేసిన తర్వాత.. దావోస్ కు ఒప్పందాలకోసం వెళ్లం కదా.. మన రాష్ట్రంలో ఉండే సానుకూలతల గురించి ప్రజంటేషన్ ఇవ్వడానికి మాత్రమే వెళతాం.. కేవలం చర్చలే జరుగుతాయి.. ఒప్పందాలు వచ్చేయవు.. నిదానంగా వస్తాయి.. లాంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు చెబుతున్నారు గనుక.. అదంతా కూడా నిజమే అని అనుకుందాం. కానీ తెలంగాణకు మాత్రం ఒప్పందాలు ఎలా కుదిరాయి.

దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకుని వచ్చినట్టుగా.. అక్కడి ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఆయా ఒప్పందాల ద్వారా.. ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయో, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయో కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు, అవతలి సంస్థల యాజమాన్యాలు దావోస్ లో ఒప్పందాలు సంతకాలు చేస్తున్న వీడియోలను, ఫోటోలను వాళ్లు షేర్ చేసుకుంటున్నారు. అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు మాటలు నమ్మబుద్ధి కాదు.

దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణకు సాధ్యమైనప్పుడు.. ఏపీకి ఎందుకు సాధ్యం కాలేదు. ఏపీలో పరిశ్రమలకు ఉండగల అవకాశాలను వారికి విడమరచి చెప్పడంలో తండ్రీ కొడుకులు ఫెయిలయ్యారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. శిష్యుడు రేవంత్ రెడ్డికి చేతనైన విద్య, గురువు చంద్రబాబుకు చేతకాలేదా? అని పలువురు అనుకుంటున్నారు.

దావోస్ వైఫల్యాలను కూడా జగన్ మీద నెట్టేసే మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే మాత్రం అది మరీ అనైతికంగా ఉంటుంది. జగన్ గురించి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.. అనే మాట ఈ ప్రభుత్వం మరోసారి వాడిందంటే.. దాని అర్థం.. ఈ అయిదేళ్ల తర్వాత ప్రజలు తమను ఖచ్చితంగా ఓడిస్తారని వారు చాలా నమ్మకంతో ఉన్నట్లగాను, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆత్రుతతో ఉన్నట్టుగానూ అనుకోవాల్సి వస్తుంది.

16 Replies to “శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?”

    1. హ చాలదా .. ఇంకేం కావాలి.. మిగతా అందరూ స్వేటర్ వేసుకొని వెళ్తే… స్వేటర్ లేకుండా వెళ్లారు … బాబోరు… అంతే కాదు .. ముందు రోజు రాత్రి, రూమ్ లో ఉండే విండోస్ పగిలిపోతె కూడా తట్టుకొని కూడా ఆయన వెళ్లారు… ఇంకేం కావాలి.. చెప్పు.. ఓహ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించా.. వాటితో మాకేం పని.. మాకు డప్పు చాలు..కొంతమంది గొర్రెలు నమ్మితే చాలు..

      1. ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎందుకు స్వామి .. .. ముష్టి పధకాలు ..ఐదువేలు ఉద్యోగాలు ..గుంతల రోడ్లు .. చేపల మార్కెట్లు ..పచ్చళ్ళ కంపెనీలు ..ఇవే కదా అభివృద్ధి అంటే ..అందుకే కదా నలభై శాతం మంది గుద్దేసాడు ఓట్లు ..నువ్వు అన్న గొర్రెలు ఎవరు ఇప్పుడు ..

  1. Listen to Telangana minister Sridhar Babu comments on Davos achievement by AP. DO not write it off. Unless we have a full ledged working Capital city, investors do not show interest. Jagan killed 5 prime years, he has not fulfilled his promise of making Vizag capital, though he declared in Davos that Vizag is the capital. His tenure was curse to AP, deal with it.

  2. శిష్యుడికి హైదరాబాద్ ఉంది .. మనకి ఏముంది .. అయినా మనకి రాజధాని ఎందుకు .. ముష్టి పధకాలు ..ఐదువేలు ఉద్యోగాలు ..గుంతల రోడ్లు .. చేపల మార్కెట్లు ..పచ్చళ్ళ కంపెనీలు ..ఇవే కదా అభివృద్ధి అంటే ..

  3. ఒక విజనరీ ఒక హై టెక్ ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తముగా అభిమానగణం వున్న ఒక మహోన్నత రాజకీయ వ్యక్తిత్వం ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలను ఉన్నత కుటుంబాలుగా తీర్చి దిద్దిన ఒక సైబరాబాద్ శిల్పి గుర్తుకు వస్తాడు.. అర్ధం అయ్యిందా పే టీ ఎం కు*క్కా? అని ప్రజలు అనుకుంటున్నారు..

  4. correct, Ravanth overall outperforms compared to CBN, Revanth able to give tough fight to TRS(BRS), filed some cases and shwoed the tough path, Even though CBN & team could not do much on cases despite the Worst, Cruel, Corruption done by Jagan and YCP party rowdies.

Comments are closed.