మ‌రోసారి వ‌ర్మ విచార‌ణ‌కు డుమ్మా

మ‌రోసారి పోలీసుల విచార‌ణ‌కు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ డుమ్మా కొట్టారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సోష‌ల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టార‌నే కార‌ణంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో…

మ‌రోసారి పోలీసుల విచార‌ణ‌కు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ డుమ్మా కొట్టారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సోష‌ల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టార‌నే కార‌ణంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

ఈ నెల 19న విచార‌ణ‌కు రావాల‌ని మొద‌ట పోలీసులు వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించి, కేసు కొట్టేయాల‌ని అభ్య‌ర్థించారు. కానీ కేసు కొట్టేయ‌డానికి కోర్టు అంగీక‌రించ‌లేదు. అరెస్ట్ భ‌యం వుంటే బెయిల్ పిటిష‌న్ వేయాల‌ని కోర్టు సూచించింది. అలాగే విచార‌ణ‌కు మ‌రికొంత కాలం స‌మ‌యం ఇవ్వాల‌ని వ‌ర్మ కోర‌గా, దానికి కూడా కోర్టు అంగీక‌రించ‌లేదు.

అదేదో పోలీసుల్నే అభ్య‌ర్థించాల‌ని న్యాయ‌స్థానం సూచించింది. వారం రోజుల గడువు పోలీసులు ఇచ్చారు. ఇవాళ ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వుండింది. అయితే తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేనంటూ త‌న న్యాయ‌వాది ద్వారా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ నేప‌థ్యంలో వర్మపై పోలీసులు త‌దుప‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

19 Replies to “మ‌రోసారి వ‌ర్మ విచార‌ణ‌కు డుమ్మా”

  1. ట్విట్టర్ పులి..

    ఫలితాలు వచ్చిన రోజు మధ్యాహ్నానికే చేతులెత్తేశాడు.. ఇకపై పొలిటికల్ సెటైర్ సినిమాలు తీయమని స్టేట్మెంట్ వదిలేసాడు..

    ఈ నాకొడుకులకు తెలుసు.. వాళ్ళు చేసిన పనులు తప్పు అని.. అయినా తప్పుడు పనులు చేశారు..

    దానికి కారణం ఎవరు..?

    కారణం ఎవరైనా.. శిక్ష అనుభవించాల్సిందే..

    1. మంచితనాన్ని చేతగానితనం అనుకున్నారు వెధవలు. అందరూ చంద్రబాబు , చిరంజీవి లాగా వుండరు. అప్పుడప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్ లాగా కూడా వుంటారు.

    1. ఎలా.. బొల్లిగాడిని నంద్యాల నుండి లాక్కొచ్చి .. తోసుకుంటూ ప్రతి ఉరు తిప్పి.. తిప్పి 55 రోజులు.. రాజమండ్రిలో.. లోపలేసి కూర్చోబెట్టినట్టా?

      1. బాబు గారికి ఈ బూతు వర్మ కి పోలికేరా ? దరిద్రుడా మీ paytm gallaki comparison కూడా raadu tuu mee bratuku..

  2. డైపర్ లు కొనుక్కోవడానికి వెళ్లినట్టున్నాడు ఈ భయం ఎదుటి వ్యక్తులను కులాలను కించపర్చే టప్పుడు ఉండాల్సింది

Comments are closed.