టీడీపీకి ప‌వ‌న్ గండం!

దేశ‌మంతా జెండా పాతాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో ప‌వ‌న్‌ను త‌మ పార్టీలోకి తీసుకుని స‌రికొత్త నాట‌కానికి తెర‌లేప‌నుంది.

టీడీపీకి ఎప్ప‌టికైనా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోనే గండం అనే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. ఇవాళ మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ పాల్గొన్నారు. అంత‌కు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప‌వ‌న్ చ‌ర్చించి వ‌చ్చారు.

మొత్తానికి ప‌వ‌న్ కేంద్రంగా బీజేపీ ఏదో ప్లాన్ చేస్తోంద‌న్న చ‌ర్చ రోజురోజుకూ విస్తృత‌మ‌వుతోంది. ఎప్ప‌టికైనా చంద్ర‌బాబునాయుడి పాలిట ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏకు మేకు అవుతాడ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌దేళ్లు చంద్ర‌బాబునాయుడే సీఎంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే వుంద‌నే అనుమానం టీడీపీ వ‌ర్గాల్లో వుంది.

ఇక్క‌డే రాజ‌కీయ కిటుకు వుంది. ఇలా చెప్ప‌డం వెనుక బీజేపీ వ్యూహం వుంద‌ని కొంత మంది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే, లోకేశ్‌ను సీఎం చేయాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ విష‌యం తెలిసే, ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అడ్డ‌పుల్ల‌ వేయ‌డానికే బాబు ప‌దేళ్ల సీఎం అన్న‌ట్టు చెబుతున్నారు. కానీ బాబు మాత్రం కొడుకుపై ప్రేమ‌తో లోకేశ్‌ను ముఖ్య‌మంత్రి చేయాల‌ని అనుకుంటున్నార‌నే స్వార్థాన్ని బ‌య‌ట పెట్టి, త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నేది ప‌వ‌న్‌, బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.

బాబు వ‌య‌సు పైబ‌డుతున్న కార‌ణంగా ఆ సీట్లో ప‌వ‌న్‌ను కూచోపెట్ట‌డం బీజేపీ బీజేపీ ప్లాన్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా, చివ‌రికి కాల గ‌ర్భంలో క‌లిసిపోవాల్సిందే.

మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్‌ను జాతీయ నాయ‌కుడిగా చూపే ప్ర‌య‌త్నం బీజేపీది. దీనికి కార‌ణం ఏనాటికైనా జ‌న‌సేన‌ను బీజేపీలో విలీనం చేసుకోవ‌చ్చ‌ని ఆ పార్టీ పెద్ద‌లు ధీమాగా ఉన్నారు. అందుకే ప‌వ‌న్‌ను త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. కేవ‌లం జ‌న‌సేనానిగా మాత్ర‌మే ప‌వ‌న్‌ను బీజేపీ చూడ‌డం లేదు.

దేశ‌మంతా జెండా పాతాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో ప‌వ‌న్‌ను త‌మ పార్టీలోకి తీసుకుని స‌రికొత్త నాట‌కానికి తెర‌లేప‌నుంది. రాజ‌కీయం అంటే రాత్రికి రాత్రే ఎన్నో మారుతుంటాయి. అందులోనూ ప‌వ‌న్ రాజ‌కీయం తెలిసిన వారెవ‌రైనా ఆయ‌న నిల‌క‌డ‌గా వుంటార‌ని న‌మ్మరు. ఇక చంద్ర‌బాబును సీఎంగా చూడాల‌నే మాటపై ప‌వ‌న్ వుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మే.

24 Replies to “టీడీపీకి ప‌వ‌న్ గండం!”

  1. వాళ్ళు గెలిచి అధికారం లో ఉన్నారు స్వామి .. వాళ్ళ గండాలు గురించి ఎందుకు లే .. వాళ్లకు ఇప్పటికి ఇప్పుడు వొచ్చిన కష్టం ఏమి లేదు ..

  2. టైటిల్ చూసి.. 2023 లో ఆర్టికల్ పొరపాటున ఓపెన్ చేశానేమో అనుకొన్నా..

    డేట్ చూస్తే.. ఈ రోజు డేట్..

    నువ్వింకా మారలేదన్నమాట.. నీకు ఇంకా బుద్ధి కలగలేదన్నమాట ..

    సీఎం గా ఉండాలనే “అవసరం” జగన్ రెడ్డి కి మాత్రమే ఉంది.. పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఆ అవసరం అర్జెంటు గా ఏమీ లేదు..

    రాష్ట్రం బాగు చేయాలంటే.. చంద్రబాబు సారధ్యం మాత్రమే ప్రస్తుతానికి మనకు అవకాశం..

    చంద్రబాబు కయినా, పవన్ కయినా, లోకేష్ కయినా ..ఆలోచన ఒక్కటే.. ప్రస్తుతానికి రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయట పడాలి.. ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి.. వేరే ఆలోచనలు లేవు.. ఉండవు..

    ..

    2014-19 తో పోల్చుకుంటే.. ఇప్పుడు కేంద్రం నుండి సహకారం ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఉంది..

    ఆ విషయం లో ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులే అనుకోవాలి..

    ..

    అన్ని సజావుగా నడుస్తున్నప్పుడు.. ఈ వంకర కాళ్ళ ముండాకొడుకులు అడ్డుపుల్లలు వేసే వంకర ఆలోచనలతో వస్తుంటారు.. జాగ్రత్త..

    1. జగన్ పవర్ లో ఉన్నప్పుడు డిల్లీ వెళ్తే చంద్ర బాబు కు వణుకు అని రాసేవాడు, ఇప్పుడు పవన్ వెళ్తే వణుకు అని రాస్తున్నాడు. ఇక్కడ చంద్ర బాబు కు వణుకు మాత్రం కామన్.

      1. అసెంబ్లీ కి వెళ్లకుండా చంద్రబాబు ని వణికిస్తున్న జగన్ రెడ్డి అని రాసుకున్న బతుకులు మావి.. అర్థం చేసుకోండి.. మేము న్యూట్రల్ జర్నలిస్టులం..

  3. ఇలాంటి కుహనా సలహాలు చదివి ఆచరించి ఒక పెద్దమనిషి ఇప్పుడు ఖాళీ గా ఉన్నారని పబ్లిక్ టాక్

  4. టీడీపీ కి పవన్ గండం 2034 వరకు ఉండదు…. 2029 కి మాత్రం చంద్ర బాబు, లోకేష్, పవన్, అమిత్ షా తో కూడిన నాలుగు గండాలు వైకాపాకి ఉంది….

  5. పవన్ గారు గోదావరి జిల్లాలకు అవసరమైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ రెండు జిల్లాల లో వున్నా పామ్ ఆయిల్ తోటలకు లిఫ్ట్ తో గోదావరి జలాలు ఇచ్చి రైతుల వద్దనుంచి ప్రభుత్వం డబ్బు వసూలు చేసుకోవచ్చు అయన ఆ రెండు పనులు చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఉపయోగం గ ఉంటుంది ఎటు పోలవరం పూర్తవుతుంది

Comments are closed.