వైద్య క‌ళాశాల‌ల్ని మీరు చేసిందేంటి స‌త్య‌కుమార్‌?

విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తే, ప్ర‌జ‌ల‌పై స‌గం ఆర్థిక భారం త‌గ్గుతుంది. అయితే పాల‌కులకు అలాంటివేవీ ప‌ట్ట‌డం లేదు.

విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తే, ప్ర‌జ‌ల‌పై స‌గం ఆర్థిక భారం త‌గ్గుతుంది. అయితే పాల‌కులకు అలాంటివేవీ ప‌ట్ట‌డం లేదు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌స్తే, మేలు జ‌రుగుతుంద‌ని ఆశించిన వాళ్లకు నిరాశ త‌ప్ప‌డం లేదు. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏకంగా 17 వైద్య క‌ళాశాల‌ల్ని ప్ర‌భుత్వ‌మే నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. ఇందులో కొన్నింటిని ప్రారంభించింది కూడా.

మ‌రికొన్నింటిని అద్భుతంగా నిర్మించింది. ఉదాహ‌ర‌ణ‌కు పులివెందుల‌లో వైద్య‌క‌ళాశాల, దానికి అనుబంధంగా ఆస్ప‌త్రి నిర్మాణాల్ని చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంది. ఆ క‌ళాశాల‌లో అడ్మిష‌న్లు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తులు కూడా మంజూర‌య్యాయి. కానీ కూట‌మి స‌ర్కార్ త‌మ‌కు ఆ సీట్లు వ‌ద్ద‌ని తిర‌స్క‌రించ‌డంతో కొంత మంది విద్యార్థులు ఉచిత వైద్య విద్య‌ను పొందే అవ‌కాశాన్ని కోల్పోయారు. ఇదంతా వైద్య క‌ళాశాల‌ల్ని ప్రైవేట్‌ప‌రం చేయ‌డానికే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ నేప‌థ్యంలో వైద్యారోగ్య‌శాఖ మంత్రి వైద్యం, వైద్యుల గురించి నీతిసూక్తులు చెప్ప‌డం వింత‌గా వుంది. గ‌తంతో పోలిస్తే వైద్యం వ్యాపారంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోగుల్ని వైద్యులు మాన‌వ‌తా దృక్ప‌థంతో చూడాల‌న్నారు. ఇవ‌న్నీ చెప్ప‌డానికి బాగానే వుంది. వైద్య విద్య చ‌ద‌వాలంటే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యే ప‌రిస్థితిని తీసుకొస్తున్న‌ది ప్ర‌భుత్వాలే క‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. వైద్య విద్య‌ను ఉచితంగా చ‌దివేలా క‌ళాశాలల్ని ప్ర‌భుత్వ‌మే అందుబాటులోకి తెస్తే, వాళ్లు కూడా రోగుల‌కు సేవ‌లందించ‌డంలో మాన‌వ‌తా దృక్ప‌థం చూపుతార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పాల‌కులే మాన‌వ‌తా దృక్ప‌థం లేకుండా, వ‌చ్చిన సీట్ల‌ను కూడా వెన‌క్కి పంపి, పైగా బుకాయిస్తున్నార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తు చేస్తున్నారు. ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌లు ఏరికోరి ఎన్నుకున్న‌ది. అలాంటి ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తే, వైద్యుల‌కు సుద్ధులు చెప్ప‌డం బాగాలేద‌ని ప‌లువురు అంటున్నారు.

8 Replies to “వైద్య క‌ళాశాల‌ల్ని మీరు చేసిందేంటి స‌త్య‌కుమార్‌?”

  1. ఎం రాస్తున్నావ్ రా GA, వైద్య విద్య ప్రభుత్వం ఉచితం గా ఇస్తే అది చదివిన డాక్టర్ లు ఉచిత వైద్యం ఏమైనా ఇస్తారా ప్రజలకు, ప్రభుత్వ హాస్పిటల్ లకు, ప్రభుత్వం శాలరీ లు ఇచ్చి పెట్టుకున్న కూడా, ప్రైవేటు ప్రాక్టీస్ లు పెట్టుకోని కోట్లు కు పడగలు ఎత్తారు.. దాని గురుంచి ప్రజల టాక్స్ డబ్బును వాళ్లకు ఎందుకు ఖర్చు పెట్టాలి… ఎలాగూ వైస్సార్ ఆరోగ్య శ్రీ అని ప్రైవేటు వైద్యాన్ని ప్రజలకు అలవాటు చేసాడు అదో అద్భుతమైన పథకం అని డబ్బా కొట్టి మళ్ళీ ఇదేందీ కొత్తగా మళ్ళీ ఉచిత వైద్య విద్య, ఆసుపత్రులు, ప్రభుత్వ డాక్టర్ లు అని సొల్లు చెపుతున్నావ్ మొన్న కోర్టులు 55 మంది ప్రభుత్వ డాక్టర్ లను తొలగించమని చెప్పింది, ఏపీ ప్రభుత్వం తొలగించింది గుర్తులేదా..

      1. మా ఇష్టం రా నీ అ*మ్మ పూ*కు లో నా మో*డ్డ, మహా మేత, జగ్గూ గాడి ప్రభుత్వం ఇంతకు7 అమ్మారో దాని కంటే తక్కువే లే రా పు*కా

Comments are closed.