అన్న‌ను అభినందించే మ‌న‌సేది ష‌ర్మిల‌?

వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికే త‌ప్ప‌, మంచి చేస్తే ప్ర‌శంసించ‌డానికి మనసు రావడం లేదా ష‌ర్మిల‌

రాజ‌కీయంగా వైసీపీని, త‌న అన్న వైఎస్ జ‌గ‌న‌ను విమ‌ర్శించ‌డానికి ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల కాచుకుని వుంటారు. వైసీపీ మంచి నిర్ణ‌యం తీసుకుంటే, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను అభినందించ‌డానికి మాత్రం ష‌ర్మిల‌కు మ‌న‌సు రాదు. తాజాగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై దేశ వ్యాప్తంగా ముస్లింల‌లో అల‌జ‌డి చెల‌రేగింది.

ఈ బిల్లును ఇవాళ లోక్‌స‌భ ముందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా, వైసీపీ వ్య‌తిరేకిస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీలు అధికారికంగానే ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. బిల్లును వైసీపీ వ్య‌తిరేకిస్తుండ‌డంతో, ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడ‌కుండా, టీడీపీ, జ‌న‌సేన‌పై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల పోస్టులో ఏముందో తెలుసుకుందాం.

“ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు. ఇది మైనారిటీలను అణ‌చివేసే కుట్ర. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా.. వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య.

మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం. ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగింది. చంద్రబాబు మోసం బయటపడింది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి, మరోపక్క పార్లమెంట్ లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీచేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి” అని ఆమె విరుచుకుప‌డ్డారు.

నిత్యం వైసీపీని విమ‌ర్శించ‌డానికే ప్రాధాన్యం ఇచ్చే ష‌ర్మిల‌, తాజాగా వ‌క్ఫ్ బిల్లును వ్య‌తిరేకిస్తే మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికే త‌ప్ప‌, మంచి చేస్తే ప్ర‌శంసించ‌డానికి త‌న‌కు మ‌న‌సు రాద‌ని ష‌ర్మిల‌…తాజా పోస్టుతో నిరూపించుకున్నార‌ని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

18 Replies to “అన్న‌ను అభినందించే మ‌న‌సేది ష‌ర్మిల‌?”

  1. yemantha podichesaadu ani JAGAN REDDY ni abhinandhinchaali. baryaki yedhuru cheppa leka chelli, thalliki aasthula vishyamlo mosam chesinandhukaa, andhrapradesh ni gatha 5 yellalo andhkaaramloki netti, rajadhaani lenirastramgaa marchinandhukaa….neeku bhuddhi jnaanam vundhaa reddodaa.

  2. వక్ఫ్ బిల్ ని వ్యతిరేకించిన పార్టీలని జెగ్గు అభినందించాడా? ఏ ఒక్కరిని అన్నా….అన్నయ్యకి మాత్రం ఎవ్వరిని అభినందించే మనస్సు ఉండదు, చెల్లెలు మాత్రం అభినందించాలి, అదేమిటో… ఇచ్చి పుచ్చుకోవాలి కదా అభినందనలు, బాలకృష్ణ డైలాగు లాగ వన్ వే ట్రాఫిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుంది….

  3. Gorrelu andaru jaglak ki support cheyali ChiM cheyali ,Gorrela govt ravali – YS vimala gorre.

    yeme musali munja intlo vivek chanipothe bayataku raani munjavi ippudu jaglak gaaru ChiM kavalaa ?

  4. EE GA gadi assets ni waqf board maa lands ani claim cheyyali appudu telustundi ee paytm gaadiki waqf board entha dangarous anedi..lands ammudamanna amma ledu appudu..

  5. నాలుగు సీట్లు ఉన్న అన్న వ్యతిరేకిస్తే బిల్ ఆగిపోతుందా .. ఇందులో మంచి ఏముంది వెంకట్రావు ..

  6. పై పైన మాటల్లో చెప్పడం కాదు, బిల్లు కి వ్యతిరేకముగా వైసీపీ వోటేసినప్పుడు చెప్పు.

  7. చెల్లి, తల్లి మీద ప్రేమ నశించింది గొడ్డలి రెడీ అని కోర్ట్ లో అఫిడవిట్ వేసి ఇప్పుడు ఈ నాటకాలు ఏంట్రా జగన్ రెడ్డి

  8. చెల్లి తల్లి మీద ప్రేమ నశించింది గొడ్డలి రెడీ అని కోర్ట్ లో అఫిడవిట్ వేసి ఇప్పుడు ఈ నాటకాలు ఏం!ట్రా జగన్ రెడ్డి

Comments are closed.