మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!

నాలుగో తేదీ నుంచి మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ స‌మీపంలో ఏర్పాటు చేస్తున్న వేదిక పై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు.

మంత్రి నారా లోకేశ్ ప‌ట్టు ప‌ట్టారంటే, దాని అంతు తేల్చాల్సిందే. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయ‌న వ్య‌వ‌హారాలు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ టీడీపీ శ్రేణుల మ‌న‌సు దోచుకునేలా ఆయ‌న న‌డుచుకుంటున్నారు. ముఖ్యంగా త‌న‌ను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించిన మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల రుణం తీర్చుకోడానికి లోకేశ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోడానికి లోకేశ్ ముంద‌డుగు వేస్తున్నారు.

మంగ‌ళ‌గిరి నుంచి 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని లోకేశ్ పంతం ప‌ట్టారు. మంగ‌ళ‌గిరి కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత వైసీపీకి కంచుకోట అని తెలిసి కూడా, అక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని లోకేశ్ ధైర్యంగా ముందుకెళ్లారు. మంగ‌ళ‌గిరిలో 2024 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అత్య‌ధిక మెజార్టీతో త‌న‌ను గెలిపిస్తే ప్ర‌భుత్వ భూముల్లో నివ‌సిస్తున్న వాళ్ల‌కు శాశ్వ‌త హ‌క్కు క‌ల్పిస్తూ ప‌ట్టాలు అంద‌జేసి, ద‌శాబ్దాల క‌ల నెర‌వేరుస్తాన‌ని లోకేశ్ హామీ ఇచ్చారు.

లోకేశ్‌ను 91,413 ఓట్ల అత్య‌ధిక మెజార్టీతో గెలిపించి మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు త‌మ బాధ్య‌త‌ను నెర‌వేర్చుకున్నారు. గెలుపుతో లోకేశ్‌పై భారీ బాధ్య‌త‌ను మంగ‌ళ‌గిరి వాసులు పెట్టారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మంగ‌ళ‌గిరిపై లోకేశ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ వ‌స్తున్నారు. ప్ర‌భుత్వ భూముల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల వివ‌రాల్ని గ‌త ప‌ది నెల‌లుగా అధికారులు నేరుగా పేద‌ల ఇళ్ల‌కే వెళ్లి సేక‌రిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాల్ని లోకేశ్‌, ఆయ‌న టీమ్ స‌భ్యులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

సంక్లిష్టమైన అటవీ, రైల్వే భూముల సమస్యను కూడా స‌వాల్‌గా తీసుకుని, ప‌రిష్క‌రించేందుకు ఉన్న‌తాధికారుల‌తో లోకేశ్ ప‌లు ద‌ఫాలు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో మొదటి దశలో 3 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి లోకేశ్ అన్ని ర‌కాలుగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇంటిని క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు ఏప్రిల్ 3 న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో లోకేశ్ అందజేయనున్నారు.

స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి లోకేశ్ వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు- మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నాలుగో తేదీ నుంచి మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ స‌మీపంలో ఏర్పాటు చేస్తున్న వేదిక పై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు. యర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు నారా లోకేశ్ పట్టాలు అందజేసి…హామీ అమ‌ల్లో మొద‌టి అడుగు వేయ‌నున్నారు.

ఏప్రిల్ 7 న పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనుకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు, 8 న రత్నాల చెరువు, మహానాడు-2 లబ్దిదారులకు, 11న సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్స్ కాలనీకు చెందిన లబ్దిదారులకు, 12 న మహానాడు-1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు లోకేశ్‌ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా మూడువేలకు పైగా పట్టాల పంపిణీ చేప‌ట్ట‌నుండ‌డం విశేషం. శాశ్వ‌త హ‌క్కుల్ని క‌ల్పిస్తూ ప‌ట్టాలు అంద‌జేస్తుండ‌డంతో ల‌బ్ధిదారుల్లో ఆనందం వెల్లువిరిస్తోంది.

11 Replies to “మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!”

  1. మా జగన్ రెడ్డి పులివెందుల వెళితే.. చిన్న కాంట్రాక్టర్స్ తమ బకాయిలు కోసం క్యూ కడుతారు..

    ప్రజలు సమస్యలు చెప్పుకోడానికి ఎగబడుతుంటారు.. అంతా జగన్ రెడ్డి పైన అభిమానం అని మనం సాక్షి లో రాసుకొంటాం..

    ..

    50 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబం చేతిలోనే సచ్చిపోతున్న పులివెందుల జనాలకు.. ఇంకా సమస్యలేమిటో మాత్రం అర్థం కాదు..

  2. ఒకప్పటి ” పప్పు” …ఇప్పుడు ” నిప్పు” లా తయారయ్యాడేమిటి సామీ????

Comments are closed.