మార్పున‌కు సిద్ధ‌మా జ‌గ‌న్‌?

వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అనే భ‌యం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఒక ర‌కంగా అదృష్ట‌వంతుడు. జ‌గ‌న్ నుంచి ఏమీ కోరుకోకుండానే ఆయ‌న్ను అభిమానించే, ప్రాణ‌మిచ్చే ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతే త‌ల్లిడిల్లిన హృద‌యాలెన్నో ఉన్నాయి. ఐదేళ్ల పాల‌న‌లో త‌మ‌ను ప‌ట్టించుకోకుండా, రాజ‌కీయాల‌కు అతీతంగా ల‌బ్ధిదారులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించార‌ని, అలాగే అభివృద్ధి ప‌నులు చేశార‌ని, కానీ ప్ర‌చారం చేసుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతోనే ఓట‌మి కొని తెచ్చుకున్నార‌నే వాద‌న వుంది.

అలాగే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆచ‌ర‌ణ‌కు నోచుకోని, అలివికాని హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టార‌నే విమ‌ర్శ కూడా లేక‌పోలేదు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి వాస్త‌వాలు చెబుతూ, తాను ఇంత‌కంటే ఎక్కువ ఇవ్వ‌లేన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం, ప్ర‌జ‌ల‌కు మింగుడు ప‌డ‌లేద‌ని వైసీపీ శ్రేణుల వాద‌న‌. ఇవ‌న్నీ కూడా నిజ‌మే.

స్థానిక సంస్థల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధుల వీరోచిత పోరాటాలు… పార్టీకి ఊపిరిపోశాయి. ఇవాళ వాళ్ల‌తో జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. పార్టీకి భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పించేలా బ‌రిలో అధికార కూట‌మితో ఢీకున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స‌భ్యుల‌తో జ‌గ‌న్ భేటీ కావ‌డం అభినంద‌న‌లు అందుకుంటోంది.

అలాగే శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రామ‌గిరి మండ‌లం పాపిరెడ్డిప‌ల్లెలో హ‌త్య‌కు గురైన కురుబ లింగ‌మ‌య్య భార్య‌, కుమారుల‌తోనూ జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. భ‌య‌ప‌డొద్ద‌ని, తాను అండ‌గా వుంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. వారంలో తాను వ‌చ్చి క‌లుస్తాన‌ని జ‌గ‌న్ వాళ్ల‌కు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ప‌రిటాల సునీత బంధువుల చేతిలో హ‌త్య‌కు గుర‌య్యార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. జ‌గ‌న్ నుంచి ఇలాంటి స్పంద‌న‌నే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కోరుకుంటున్నారు.

జ‌గ‌న్ మాస్ లీడ‌ర్‌. జ‌గ‌న్ బ‌ల‌మే జ‌నం. అలాంటిది జ‌నానికి దూర‌మైతే, స‌హ‌జంగానే జ‌గ‌న్‌పై అసంతృప్తి, ఆగ్ర‌హం కలుగుతాయి. గ‌త ఎన్నిక‌ల్లో సొంత వాళ్ల‌లో కూడా చాలా మంది ఆయ‌న‌కు ఓటు వేయ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఇది ఒక‌టి. బ‌హుశా త‌న వైపు నుంచి త‌ప్పిదాల‌ను ఆయ‌న ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. పార్టీ కోసం ప‌నిచేసే వాళ్ల‌తో మాట్లాడ్డానికి ముందుకొస్తున్నారు. జ‌గ‌న్‌లో మార్పు రావాల‌ని కోరుకుంటున్న వాళ్లంతా, ఆయ‌న శ్రేయోభిలాషులే.

వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అనే భ‌యం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు. ఎందుకంటే, కూట‌మి అధ్వాన పాల‌న పుణ్యాన అధికారంపై అప్పుడే శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌లో చిన్న మార్పును వాళ్లు ఆశిస్తున్నారు. కోట‌రీని దూరం పెట్టి, నిజంగా పార్టీ కోసం ప‌ని చేస్తున్న వాళ్ల‌తో మాట్లాడాల‌ని ఆశిస్తున్నారు. ఈ ప‌ని చేస్తే చాలు, జ‌గ‌న్ కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని వాళ్లు అంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ప‌దేప‌దే సిద్ధ‌మా అని పార్టీ శ్రేణుల్ని ప్ర‌శ్నించే వాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లు మార్పున‌కు సిద్ధ‌మా? అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

37 Replies to “మార్పున‌కు సిద్ధ‌మా జ‌గ‌న్‌?”

    1. ఎలా…?

      నేషనల్ నుండి లోకల్ మీడియా వరకూ అందరిని పిలిచి.. మరి.. చేతులడ్డం పెట్టుకుని.. గుక్క పట్టి చిన్నపిల్లాడిలా.. ఏడ్చేశాడు.. మా ఆవిడను.. అవమానించారు అని! అలా గుక్క పట్టి ఏడవటమా ?

      1. లేదు ఏడుపు మొహం వేసుకుని ప్రెస్ మీట్ పెట్టాం చూడు ..ఏది జనాలు మనం డబ్బు పంచినా ఇంటికి పంపించేశారు చూడు .. .. ఆలా ..

      2. కాదు.. మేము గెలిస్తే evm మంచిది.. మేము ఓడిపోతే ఈvm hack అయింది అని ఏడ్చినట్టు..

        ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీ కి వస్తా.. లేకపోతే స్కూల్ కి రాను అని ఏడ్చినట్టు.. అర్థమైందా రాజా..

  1. గ్రేట్ ఆంధ్ర ఒక క్లాస్ టీచర్…జగన్ ఒక L k g స్టూడెంట్…. ప్రతి రోజూ ఒక పాఠం నేర్పుతుంది గ్రేట్ ఆంధ్ర….మెల్ల మెల్లగా జగన్ పాటాలు నేర్చుకుని 2029 exam లో pass అవ్వాలని మా కోరిక

  2. నాకు ఒకటీ అర్దం అయింది మీకు కొంచెం అన్న సిగ్గు లజ్జ ఇజ్జతి మనం లేదు

  3. వీడి రాతలు ఎలా ఉంటాయంటే..

    ఆంధ్ర జనాలకు జగన్ రెడ్డి తప్ప వేరే దిక్కు లేదు అన్నట్టు ఫీల్ అయిపోతుంటాడు..

    వాడు అప్పు చేసి డబ్బు పంచితే తప్ప బతకలేరు అనుకుని ఫీల్ అయిపోతుంటాడు..

    ..

    వైసీపీ కార్యకర్త 10 రోజుల క్రితం చనిపోతే.. ఇప్పుడు తీరిగ్గా ఫోన్ చేసి మాట్లాడాడు.. అది కూడా వారం తర్వాత వస్తాను అని మాటిచ్చాడంట ..

    జగన్ రెడ్డి కి కుదిరినప్పుడే కోడి కోయాలి.. సూర్యుడు ఉదయించాలి అనే కండిషన్స్ తో పరిపాలన చేసాడు..

    ..

    జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు.. అన్నమయ్య డామ్ గేట్లు కొట్టుకుపోతే.. రెండు వారాల తర్వాత పరామర్శ కి వెళ్ళాడు.. ఆరు నెలలలో ఇల్లు కట్టిచ్చేస్తాను అని మాటిచ్చాడు..

    పవన్ కళ్యాణ్ డీసీఎం గా వెళ్లి ఫండ్స్ రిలీజ్ చేసాడు..

    ..

    ఈ మాత్రం దానికి మళ్ళీ జగన్ రెడ్డి కి ఎందుకు అధికారం ఇవ్వాలి..?

    వెంకట్ రెడ్డి కి కూడా ఏదైనా పదవి వస్తుందనే ఆశ కాబోలు..

    1. jagan did well with schools health care and welfare schemes door delivery . Also corruption at grassroots was minimized .but roads were not good also 3 capitals was a bad strategy . Jagan was defeated only because of land grabbing scheme campaign .. Babu is not able to control corruption . What ever you say neutral ppl alreadY realized this fact and would vote again in 2029 to favor jagan

      1. మళ్ళీ గెలుస్తామనే నమ్మకం జగన్ రెడ్డి కి కూడా ఉండదేమో..

        మీరు జగన్ రెడ్డి అభిమానుల్లో టాప్ లో ఉంటారు.. ఆల్ ది బెస్ట్..

          1. 2024 లో జనాల అభిప్రాయం చూడండి.. జగన్ అభిమాని గారు..

            ఎవరో ఎదో అంటే.. ఇక్కడ ఆ డిస్కషన్ ఎందుకు..?

            జగన్ రెడ్డి కూడా వై నాట్ 175 అన్నాడు.. దాని గురించి డిస్కస్ చేద్దామా..?

    2. Nee comments like chesthunna ani naa account moderate చేశాడు bhaiya. Edi naa new account. Ee account kuda moderate చేస్తాడేమో

      1. వాడికి నీకున్నత తెలివి లేదనుకుంటా.. వైసీపీ జనాల కామెంట్స్ డిలీట్ చేసేస్తుంటాడు..

  4. కూటమి అడ్వానా పాలనా .. అవును అవును అసెంబ్లీ లో ర్యాంకు బాగోతాలు వినపడడం లేదు .. ప్రెస్మీట్లలో బూతులు వినపడడం లేదు, రోడ్స్ కొంచెం కొంచెం బాగుపడుతున్నాయి, రాజధాని పనులు మొదలు అయ్యాయి, పోలవరం పనులు మొదలు పెడుతున్నారు, , నిజమే ఇవ్వని అడ్వానా పాలనా నిదర్శనాలే ..

  5. Jagan made AP a backward state.no new industry. No job creation. Destroyed Amaravathi. No progress in polavaram. Lot of corruption and land grabbing.

    Rs 5000 volunteer jobs are not jobs. How will anybody support their families with that money.

    AP gave him a chance. He dropped it pretty badly. I doubt he will get another chance.

    lot of mega industries coming up now in AP.

    Amaravathi and polavaram back on track.

    Be happy for the state.

Comments are closed.