వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, సీఐడీ పోలీసుల దాడి వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ అయిన రఘురామ తనయుడు భరత్‌ను సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది.
సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు స్పందిస్తూ అది అంత ముఖ్యమైన విషయమా? అని నిలదీయడం గమనార్హం. రఘురామ అరెస్ట్, ఏపీ సీఐడీ పోలీసులు భౌతికంగా దాడికి పాల్పడ్డారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఇదంత ముఖ్యమైన విషయమా? అని ప్రశ్నించింది. ఒకవేళ ముఖ్యమైందని అనుకుంటే రాత్రి 8 గంటలకు కూడా విచారిస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ వ్యవహారం జరిగి 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ.. కేంద్రం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేసేందుకు భరత్‌కు అవకాశం ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.