పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్తం విదివిధానాల్ని విడుదల చేసింది. ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.15 వేలు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చంద్రబాబు సర్కార్ కొలువుదీరి నెల అవుతున్న సందర్భంగా సంక్షేమ పథకాల గురించి విస్తృత చర్చకు తెరలేచింది.
ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ బడులు తెరిచారని, విద్యార్థులకు అమ్మ ఒడి, అలాగే రైతులకు భరోసా కింద లబ్ధి కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు చొప్పున వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. వైట్ రేషన్‌కార్డు లబ్ధిదారులకే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆధార్‌తో అనుసంధానం చేయించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం కింద త్వరలో లబ్ధి కలుగుతుందని స్పష్టమైంది.
ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఇవీ నిబంధనలు. రానున్న రోజుల్లో ఎలా వుంటుందో చూడాలి.