అంతా ఊహించినట్టే! ఇప్పుడేం చేయబోతున్నారు!

సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు ఏ ఒక్కటీ కూడా అనూహ్యం కానే కాదు! ఇవన్నీ ఎలా జరుగుతాయని ప్రజలు అనుకుంటూ వచ్చారో.. అలాగే…

సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు ఏ ఒక్కటీ కూడా అనూహ్యం కానే కాదు! ఇవన్నీ ఎలా జరుగుతాయని ప్రజలు అనుకుంటూ వచ్చారో.. అలాగే జరిగాయి. కాకపోతే, ఇక ముందు ఏం జరగబోతున్నది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను అరెస్టు చేయకుండా రక్షణ పొందడం వరకు మాత్రమే న్యాయస్థానం నిర్ణయాన్ని వాడుకోబోతున్నారా? లేదా, విచారణ పర్వంలో పోలీసులు అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక (వారుచెబుతున్నట్టుగా) తీరును కూడా న్యాయస్థానం ద్వారా ప్రశ్నించబోతున్నారా? అనే చర్చ ఇప్పుడు కీలకంగా మారుతోంది.

2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసును ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరగతోడుతోంది. ఇది ఏమాత్రం ఆశ్చర్యకరమైన విషయం కానేకాదు. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అన్నీ.. చివరకు సజ్జల రామక్రిష్ణారెడ్డిని విచారణకు పిలవడం వరకు ఏ ఒక్కటి కూడా అనూహ్యం కాదు!

తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అప్పట్లో అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ దే గనుక.. విచారణ గురించి వారు సహజంగానే పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం విచారణ ప్రారంభించిన తరువాత.. అప్పటి ఫిర్యాదులోని పేర్లున్న వారిని తొలుత విచారించారు. వారు ఎవరెవ్వరి పేర్లనైతే చెప్పారో ఆ పేర్లన్నీ కేసుకు జోడించుకుంటూ వెళ్లారు.

ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ లతో సహా సజ్జల రామక్రిష్ణారెడ్డి వరకు అందరూ కూడా ఎవరో ఒక నిందితుడు చెప్పాడనే మాటను బట్టి ఆ కేసులోకి చొరబెట్టబడ్డ వాళ్లే. ఇలా ఈ జాబితా పెరుగుతూ పోతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియదు. వైసీపీలో తమకు కిట్టని, తమకు లొంగని నాయకులు అందరినీ ఈ ఒక్క కేసులోనే ఇరికించేయాలనేంత ఆత్రంగా టీడీపీ సర్కారు ప్రవర్తిస్తున్నదా అనిపించేలా వ్యవహారాలు సాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఊహించినట్టుగానే సాగుతున్నాయి.

అయితే ఈ తీరుకు విరుగుడుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయబోతున్నారు అనేదే కీలకం. సజ్జలను విచారణకు పిలవడం అనేది అనూహ్యం కాదు. ఆయన వెంట మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు బయటకు వెళ్లగొట్టడం కూడా అనూహ్యం కాదు. ‘మెడపట్టి బయటకు గెంటించుకోలేదంతే’ అంటూ పొన్నవోలు బయట మీడియాతో మాట్లాడుతూ అనడం గమనార్హం. మరి ఇలాంటి నేపథ్యంలో పోలీసుల వైఖరిని ఎండగట్టడానికి, కనీసం న్యాయవాదిని అనుమతించకుండా ఉన్న వారి చట్టవ్యతిరేక పోకడల్ని నిలదీయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఏం చేయబోతోంది అనేది కీలకం.

గురువారం నాటి పోలీసుల ప్రవర్తనపై పార్టీ తరఫున కోర్టులో పిటిషన్ వేస్తే.. పోలీసుల తీరు మరింతగా చర్చకు వస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారాలను లీగల్ గా మరింత జాగ్రత్తగా ఎదుర్కుంటే తప్ప.. ఇదే తరహా వేధింపులు రాష్ట్రమంతా రాబోయే అయిదేళ్లపాటూ మరింత విస్తృతంగా జరుగుతూ ఉంటాయనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

12 Replies to “అంతా ఊహించినట్టే! ఇప్పుడేం చేయబోతున్నారు!”

  1. సాక్షాత్తు “జెగ్గుల మంచం mate’ సజ్జల” ని ఇంత దారుణంగా బొక్క లో వేసి తంతారా?? విచారణ లో జెగ్గుల రహస్యాలు మొత్తం కక్కేసాడా??

  2. ఫాపం సజ్జల గాడు జగన్ గాడి శృంగార స్నేహితుడు… వాడిని తంతే వీడి మచ్చలు మొత్తం బయటకు వస్తాయి… అలాగే భారతి అవినాష్ ల రంకు రహస్యాలు కూడా వచ్చేస్తాయేమో ga… ఓ తూరి పొట్టోనితో మాట్లాడి ఎట్లా చెయ్యాలో సలహా ఇవ్వు..

  3. “ అంత ఘోరంగా మాట్లాడితే మేమెందుకు మౌనం వహించాలి?”

    “ పట్టాభి మాటలు, ఆయన జుగుప్సయాకరమైన భాష విన్న మా నాయకులు, కార్యకర్తలకే కాదు నాకూ రక్తం మరిగింది. నాకు పట్టాభిని తన్నాలనిపించింది.”

    Doctor సుధాకర్ విషంయంలో ఏమి చేయాలనిపించిందో?

  4. Tdp office మీద. దారుణం గా దాడి చేసారు రాలు వేశారు టీవీ9 కూడా అందులో ఉంది . అవినాష్ మనసుల్ని సప్లి చేశాడు అన్నిటికీ వీడియో లు ఉన్నాయి ఇప్పుడు ఎటు వెళ్ళలేరు . అందులో ఎవడో సజ్జల ఆదేశాల మీద విసిరాం అని చెప్తే దానికి తగిన ఆధారాలు ఉంటే అప్పుడు ఎలా తప్పు9ంచుకుంటారు సజ్జల. ఆ రోజు D G p కనీసం కేసు కూడా పెట్టనే లేదు . రోజులు మారుతాయి.

  5. Ye party charitra chusina yemunnadi garva kaaranam.. ninna ycp… daanni minchi eeroju kutami… andaru andare… no ruling.. no news about development, no protection for people, particularly women…liquor..sand itregularities…arrests..

Comments are closed.