టీటీడీలో చౌద‌రి.. టీడీపీకి లాభ‌మా? న‌ష్ట‌మా?

టీటీడీలో ఉన్న‌తాధికారిగా ధ‌ర్మారెడ్డి పేరు విస్తృత చ‌ర్చ‌కు దారి తీసింది. అది ఎంత‌గా అంటే… ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి వెళ్లిపోయినా, ఇప్పుడొచ్చిన అధికారుల‌ను ఆయ‌న‌తో పోల్చుకుని ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడుకుంటున్నారు. Advertisement…

టీటీడీలో ఉన్న‌తాధికారిగా ధ‌ర్మారెడ్డి పేరు విస్తృత చ‌ర్చ‌కు దారి తీసింది. అది ఎంత‌గా అంటే… ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి వెళ్లిపోయినా, ఇప్పుడొచ్చిన అధికారుల‌ను ఆయ‌న‌తో పోల్చుకుని ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడుకుంటున్నారు.

టీటీడీ అడిష‌న‌ల్ ఈవోగా వెంక‌య్య చౌద‌రి శ‌నివారం బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య చౌద‌రి వ్య‌వ‌హార శైలిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ధ‌ర్మారెడ్డిలా చౌద‌రి న‌డుచుకుని కూట‌మి కొంప ముంచుతారా? లేక శ్రీ‌నివాస‌రాజు మాదిరిగా అంద‌రి వాడిలా న‌డుచుకుంటారా? అని ఏ ఇద్ద‌రు టీటీడీ ఉద్యోగులు క‌లిసినా చ‌ర్చించుకుంటున్నారు.

ధ‌ర్మారెడ్డిలో రెండు కోణాలున్నాయి. అడ్మినిస్ట్రేష‌న్ విష‌యంలో ధ‌ర్మారెడ్డికి మంచి పేరు వుంది. అలాగే ధ‌ర్మారెడ్డికి ఎక్క‌డా అవినీతి మ‌ర‌క‌లు అంటుకోలేదు. ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను దాదాపు అరిక‌ట్టార‌నే చెప్పాలి. కానీ ఆయ‌న‌తో వ‌చ్చిన స‌మ‌స్య‌ల్లా రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లోనే. ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు వైసీపీకి భారీ న‌ష్టం క‌లిగించింది.

అధికార పార్టీ నాయ‌కుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌డంలో ధ‌ర్మారెడ్డి నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించారు. సామాన్య భ‌క్తుల‌తో మంచిగానే మెలిగిన‌ప్ప‌టికీ, అధికార పార్టీ నాయ‌కుల సిఫార్సుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. నేనే రాజు…నేనే మంత్రి అనే లెక్క‌న ధ‌ర్మారెడ్డి దుర్మార్గంగా న‌డుచుకున్నారు.

నాడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ధ‌ర్మారెడ్డి సన్నిహితుడైన‌ట్టే, ఇప్పుడు వెంక‌య్య చౌద‌రి కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి కుటుంబ స‌భ్యుడిగా గుర్తింపు పొందారు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా డిప్యుటేష‌న్‌పై వెంక‌య్య చౌద‌రి ఏపీలో ప‌ని చేశారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య చౌద‌రి ధ‌ర్మారెడ్డి మాదిరిగానే రాజ‌కీయంగా ఏ ఒక్క‌ర్నీ లెక్క చేయ‌ర‌నే భ‌యం టీడీపీతో పాటు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల్ని వెంటాడుతోంది.

ధ‌ర్మారెడ్డి ప‌రిపాల‌న‌లో లోపాల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుంటే వెంక‌య్య చౌద‌రి అంద‌రి మ‌న్న‌న‌లు చూర‌గొంటారు. భ‌జ‌న‌ప‌రులైన టీటీడీ ఉద్యోగ నాయ‌కులు, అలాగే వివిధ పేర్ల‌తో బ్లాక్ మెయిల్ చేసే కార్మిక సంఘాల నాయ‌కుల్ని ధ‌ర్మారెడ్డి దాదాపు 90 శాతం దూరం పెట్టారు. చీర్ల కిర‌ణ్ అనే ఉద్యోగ సంఘ నాయ‌కుడు ఉద్యోగ సంఘ నాయ‌క‌త్వంతో పాటు కులాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఎవ‌రినైనా బుట్ట‌లో వేసుకుంటాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నాడు. తిరుప‌తిలో టీటీడీ ఉద్యోగులు, రాజ‌కీయ నాయ‌కుల్లో కిర‌ణ్‌, ప్ర‌కాశ్ అనే పేర్లు అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌నే వ్యంగ్య కామెంట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవ‌స‌రం వుంది.

టీటీడీ ఉద్యోగుల్ని ధ‌ర్మారెడ్డి ఏమీ అన‌క‌పోయినా, వారితో క‌ల‌వ‌క‌పోవ‌డం వ‌ల్ల అపార్థాల‌కు దారి తీసింది. దీంతో ఆయ‌న‌పై ఉద్యోగులు కోపం పెంచుకున్నారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం తీసుకొచ్చింది. వెంక‌య్య చౌద‌రి ఉద్యోగుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. రాజ‌కీయ ముసుగు వేసుకొచ్చే ద‌ళారుల‌ను ఆయ‌న దూరం పెట్టాలి.

16 Replies to “టీటీడీలో చౌద‌రి.. టీడీపీకి లాభ‌మా? న‌ష్ట‌మా?”

  1. అధికార పార్టీ నాయ‌కుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌డంలో ధ‌ర్మారెడ్డి నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించారు. సామాన్య భ‌క్తుల‌తో మంచిగానే మెలిగిన‌ప్ప‌టికీ, అధికార పార్టీ నాయ‌కుల సిఫార్సుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. నేనే రాజు…నేనే మంత్రి అనే లెక్క‌న ధ‌ర్మారెడ్డి దుర్మార్గంగా న‌డుచుకున్నారు.

    thu nee bathuku .. enduku buradha lo pandi nuvvu okkate ..

    lan.. roja enni trips vesindi ?? ante ధ‌ర్మారెడ్డి ki emi …..

    netizens questions ra lk g a

  2. శ్రీనివాస రాజు లా ఎవరూ చేయలేరు.. ఎటువంటి సమస్య వచ్చినా చిరునవ్వు తో, ఓపిక గా పరిష్కారం చూపించేవారు

  3. Ysrcp batch ..ఇంకా నువ్వు మానుకోవా..ఇట్ల రాయడం ..

    అంతమంది రెడ్డిలు రాయలేదు..

    1. రే B 0G@ M ….

      ఎవడ్రా నువ్వు ఇంత వల్గర్ గా ఉన్నవు .. ఇంట్లో నువ్వు ఒక్కడవేనా లేక నీ అ మ్మ /బాబు కూడా అంతేనా

  4. వెంకన్న స్వామి ని ప్రజలు మర్చిపోయేలా చెయ్యడానికి పచ్చగుల చాలా చేస్తారు….

    మురళిమోహం చెప్పినట్టు రేపు దేవదేవుడికి కూడా చౌదరి తోక పెడతారు.

  5. Nuvvu pedda boku nakodukuvi nuvvu salahalu evvadame darmareddy storylu enka chala cundhi kodaka mottam bayataki vaste jaggadu vadi modda vade kudusukovali chowdary ki lekkaleni tanam vunna avaneeti parudu kadu

Comments are closed.