ప్రైవేట్ స్టీల్ కి ఆ మంత్రి సూత్రధారి

విశాఖ స్టీల్ ప్లాంట్ గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్న మంత్రి భరత్‌ను పదవి నుంచి తప్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖలో ప్రభుత్వ రంగంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారం ఉంది. అయితే, ఇప్పుడు దానిని కాపాడాల్సి ఉంది. ప్రైవేట్ వధ్య శిల మీద అది తల పెట్టి ఉంది. ఆ ప్రైవేటును ఆపకుండా పరిరక్షించాల్సిన పరిస్థితుల్లో విశాఖలో అనూహ్యంగా మరో స్టీల్ ప్లాంట్ వస్తోంది.

అది పూర్తిగా ప్రైవేటు రంగంలో ఉంది. విశాఖలో ఒకటి ప్రభుత్వ రంగంలో ఉంటే, మరొకటి ప్రైవేటు రంగంలో ఉండడం సాధ్యమా అన్నది ఉక్కు కార్మికులు ఆలోచిస్తున్నారు. ఒక గీత కంటే రెండో గీతను పెద్దగా చూపించి మొదటి దానిని చిన్నగా చేయడమే దీని వెనక ఉద్దేశమా అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టడం ద్వారా అసలు స్టీల్ ప్లాంట్‌కి ఎసరు పెట్టాలన్నది బడా వ్యూహంగా ఉంది అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఈ విధంగా ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీ రావడానికి కారణమవుతున్నారు అని అంటున్నారు.

ఆయన మిట్టల్ కోసమే ఇలా మారిపోయారని, అందుకే ఇలా చేస్తున్నారని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు వచ్చిన ప్రధాని ఎదుట ప్రభుత్వ రంగంలోని స్టీల్ ప్లాంట్‌ను రక్షించమని చంద్రబాబు, పవన్ కోరకపోవడం వెనుక కూడా మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందని అంటున్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఎన్నో త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే ప్రైవేటు రంగంలోకి రాబోతున్న మిట్టల్ ఫ్యాక్టరీ ముద్దు అయిపోతోందా అని ఫైర్ అవుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్న మంత్రి భరత్‌ను పదవి నుంచి తప్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

4 Replies to “ప్రైవేట్ స్టీల్ కి ఆ మంత్రి సూత్రధారి”

  1. First priority to Vizag plant. After this problem settled, they can think Mittal plant. VSP is with advanced technology and with very less manpower when compared to other PSU steel plants. Why cannot govt concentrate to uplift this until unless it has other special interests…

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్ వస్తే మనకు నష్టం ఏమిటి.. ఎవరి ఉత్పత్తి వారిది ఎవరు మార్కెట్ వారు, ఎవరు వ్యాపారం వారిది…. విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే, గాజువాక కూర్మన్నపాలెం, విశాఖపట్నం ఏరియా అభివృద్ధి చెందా లేదా? రాష్ట్రంలో భారీ పరిశ్రమలు రావడం ద్వారా, చదువుకున్న యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు,, మరియు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడదా…? మిట్టల్ గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మలేదు కదా? ఈ వైజాగ్ స్టీల్ మిట్టల గారికి

    అమ్మితే తప్పు.. వారి ప్లాంట్ వారే కట్టుకుని నడుపుకుంటే తప్పేమిటి?

    ఇక vsp స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే,

    గత నాలుగు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం

    ప్లాంట్ అమ్ముకున్న పర్వాలేదు, అని చాప కింద నీళ్లు లాగా , ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుపుకున్న ప్రయత్నాలు జరుపుకున్న, మాకెందుకులే ఈ ప్లాంట్ కోసం, కేంద్ర ప్రభుత్వం వారి ఇష్టం ఇది, అని చూస్తూ

    ఊరుకోండి పోయి, వారి సీబీఐ ,Ed, కేసులు ముందుకెళ్లకుండా వాయిదాలు పడేలాగా,, తప్పించుకునేలాగా, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీపడి, ఒక నాలుగు ఐదు వేల ఎకరాలు , స్టీల్ ప్లాంట్ భూమి వారికి ఇస్తే, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవాలని చూసిన వైసిపి ప్రభుత్వం ….. వారి హయాంలో వారిని అడగలేని ఎర్రజెండాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై స్పందించడం… గమనించగలరు….

    2004 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం , ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, టిడిపి మరియు కూటమి ప్రభుత్వం, అనేక దఫాలుగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని

    ఆర్థిక శాఖ మంత్రి గారిని, కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరక్కుండా చూడాలని, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా , దీనిని కాపాడాలని, అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది.. దీనిలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది…. త్వరలోనే పునరుద్ధరణ ప్యాకేజ్ తో

    దీనికి పరిష్కారం రాబోతుంది అని ఆశిద్దాం…

    అంతవరకు పుకార్లు నమ్మనవసరం లేదు….

    ప్రధాన మంత్రి గారిని అడగలేదు ఇక్కడ అంటున్నారు

    కొంత మంది…

    Delhi lo andharini అడుగుతున్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు .త్వరలోనే పునరుద్ధరణ మార్గాలు

    మార్గదర్శకాలు వస్తాయని ఆశిద్దాం…..

    మంత్రి T.g bharat Enduku రాజీనామా చేయాల ?

    అర్థంలేని డిమాండ్….

  4. జగన్అన్న 2019-24 మధ్యలో కేంద్రం మేడలు వంచి, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపాడు. ఇప్పుడు ఎవరు ఆపుతారు?

Comments are closed.