పేర్ని నానిపై కేసు నీరుగారిపోతున్నదా?

పేర్నినానికి చెందిన గోడౌన్లనుంచి వేల టన్నుల బియ్యం మాయమైనట్టుగా రాద్ధాంతం చేశారు. తీరా ఇప్పుడు 386 టన్నులుగా తేలుతోంది.

తన గోడౌన్లలో ప్రభుత్వం నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మొత్తంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేసేస్తున్నట్టుగా, తద్వారా వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించేస్తున్నట్టుగా పచ్చమీడియా గగ్గోలు పెట్టింది.

తనంత తానుగా పేర్ని నాని తన గోడౌనులోని బియ్యం నిల్వల్లో తేడా వచ్చిందని ప్రభుత్వానికి తెలియజేసి.. నిబంధనల ప్రకారం.. వారు ఎంత డబ్బు పెట్టి బియ్యం కొంటారో అంతకు రెట్టింపు మొత్తం జరిమానాలుగా కట్టేసిన తర్వాత కూడా.. పేర్ని నాని.. బీభత్సమైన అవినీతికి పాల్పడినట్టుగా.. ఆయనను అరెస్టు చేసి విచారించాలన్నట్టుగా పచ్చమీడియా ఎంతటి అత్యుత్సాహం ప్రదర్శించిందో అందరికీ తెలుసు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే విచారణ సాగుతున్న కొద్దీ.. వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ.. పేర్ని నాని మీద కేసు నీరుగారిపోతున్నట్టుగా అర్థమవుతోంది.

పోలీసుల విచారణలో పేర్ని నాని గోడౌన్లలో మాయమైన బియ్యాన్ని వివిధ అవసరాలకు వాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. చేపలకు ఆహారంగా కొంత, మండల లెవెల్ గోడౌన్లలో నిల్వల్లో తేడాను పూరించడానికి కొంత, రైస్ మిల్లుల్లో కల్తీకి కొంత వాడినట్టుగా తెలుస్తోంది. ఇంతా కలిపి పోలీసులు ఇప్పటిదాకా నిగ్గు తేల్చింది 386 టన్నుల బియ్యాన్ని మినీ ట్రక్కుల్లో బయటకు తరలించారని మాత్రమే. అయితే ఈ బియ్యం తరలింపు అంతా కూడా పేర్ని నాని సూచనలు, ఆయన ఇచ్చిన భరోసా మేరకే జరిగినట్టుగా రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు.

వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. పేర్నినానికి చెందిన గోడౌన్లనుంచి వేల టన్నుల బియ్యం మాయమైనట్టుగా రాద్ధాంతం చేశారు. తీరా ఇప్పుడు 386 టన్నులుగా తేలుతోంది. ఇందులో కూడా రైస్ మిల్లర్లు కల్తీ చేయడానికి ఎంత? చేపలకోసం ఎంత? ఇతర గోడౌన్లలో సర్దుబాటుకు ఎంత అనేది లెక్కతేలితే.. ఈ కేసు మరింతగా నీరుగారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన చందంగా వ్యవహారం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే.. ఇప్పటిదాకా జరిగిన విచారణలో బియ్యం స్మగ్లింగు జరుగుతున్న కేంద్రంగా పచ్చమీడియా ప్రచారం చేస్తున్న కాకినాడకు ఒక్క టన్ను కూడా పంపినట్టు తేలలేదు. పైగా పేర్ని నాని ఆల్రెడీ సుమారు రెండు కోట్లు జరిమానా కూడా కట్టగా.. గోడౌన్ మేనేజరు మానస్ తేజ్ ఖాతా నుంచి 27 లక్షల లావాదేవీలు జరిగాయని. 1.76 లక్షలు ఆయన నుంచి పేర్ని నాని ఖాతాకు వెళ్లాయని తేల్చారు.

ఇంత చిన్న అమౌంట్ గురించి చేస్తున్న రాద్ధాంతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పేర్ని నాని మీద నిందలు మోపగల దారులన్నీ మూసుకుపోయిన తరువాత.. పోలీసులను దొరికిన నిందితులను ప్రభావితం చేయడానికి పేర్ని నాని ప్రయత్నిస్తున్నారంటూ కొత్త పాట అందుకున్నారు. డబ్బు కాజేయడానికి ఇది వారి లెవెల్లో జరిగిన తప్పే అని పోలీసుల విచారణలో చెప్పినప్పటికీ.. పేర్ని నాని వారితో అలా చెప్పిస్తున్నారని రంగు పులిమేలా వ్యవహారం కనిపిస్తున్నదని ప్రజలు అంటున్నారు.

5 Replies to “పేర్ని నానిపై కేసు నీరుగారిపోతున్నదా?”

  1. అయనకు అయనే చెప్పరా? బొచ్చెమి కాదు!

    Seize the ship అయ్యకె కలుగులొని ఎలుకలు అన్ని బయటకి వచ్చాయి!

  2. అక్కడ మాయం అయ్యింది పదో, ఇరవయ్యో కేజీ లు కాదు! 386 టన్నులు బియ్యం. పేర్నికి, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా మాయం అయిపోయాయి అంటే ఆయన ఎంత ప్రజా సేవలో మునిగి పోయాడో అర్ధం అవుతుంది.

  3. ప్లే బాయ్ వర్క్ :-తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.