కాల‌యాప‌న‌కేనా లోకేశ్‌?

ఐదేళ్ల పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ్మ ఒడి ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక చేయూత‌నిచ్చింది. తమ‌కు అధికారం ఇస్తే, జ‌గ‌న్ కంటే రెట్టింపు ల‌బ్ధి క‌లిగిస్తామ‌ని త‌ల్లులకు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు…

ఐదేళ్ల పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ్మ ఒడి ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక చేయూత‌నిచ్చింది. తమ‌కు అధికారం ఇస్తే, జ‌గ‌న్ కంటే రెట్టింపు ల‌బ్ధి క‌లిగిస్తామ‌ని త‌ల్లులకు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చ‌దువుతుంటే అంద‌రికీ త‌ల్లికి వంద‌నం పేరుతో రూ.15 వేలు చొప్పున ప్ర‌తి ఏడాది ఇస్తామ‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు. మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన నాయ‌కుడు చెబితే, మాట‌పై నిల‌బ‌డకుండా ఉంటారా? అనే ఆలోచ‌న‌తో కూట‌మికి త‌ల్లులు అండ‌గా నిలిచారు.

కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డానికి సూప‌ర్ సిక్స్ హామీలు ప్ర‌ధాన కార‌ణం. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన స‌మ‌యానికే వేస‌వి సెల‌వులు ముగిసి, విద్యా సంవత్సరం కూడా ప్రారంభ‌మైంది. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద ఎంతెంత ల‌బ్ధి క‌లుగుతుందో అనే లెక్క‌లు త‌ల్లులు వేయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌తి కుటుంబంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌క్కువ లేరు. దీంతో రూ.30 వేల‌కు త‌క్కువ కాకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌మ ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేస్తుంద‌ని ఆశించారు.

త‌ల్లికి వంద‌నానికి సంబంధించి ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా? అని ఆశ‌గా ఎదురు చూస్తున్న త‌ల్లులు, పిల్ల‌ల‌కు లోకేశ్ షాక్ ఇచ్చారు. హామీకి క‌ట్టుబ‌డి వుంటామ‌ని చెబుతూనే, ప‌థ‌కం అమ‌లుకు అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని, మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. అంద‌రికీ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని చెబుతున్న‌ప్పుడు, కొత్త‌గా గైడ్‌లైన్స్ తీసుకురావ‌డం ఎందుక‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మార్గ‌ద‌ర్శ‌కాలు తీసుకొచ్చేందుకు ఏడాది స‌మ‌యం ఎందుక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇదంతా కాల‌యాప‌న కోస‌మే అనే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అయితే ప్ర‌తి విద్యార్థికి ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని లోకేశ్ చెప్ప‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని అంటున్నారు.

21 Replies to “కాల‌యాప‌న‌కేనా లోకేశ్‌?”

  1. మద్యపాన నిషేధం

    వారం లో సీపీఎస్ రద్దు..

    ఇవన్నీ కాలయాపన కాదా.. అప్పుడు పొగిడావు.. ఇప్పుడు ఏడుస్తున్నావు..

  2. మీకు ఆత్రం ఆగదా GA ? మీరు అధికారం లో ఉన్నప్పుడు 6 నెలల తర్వాత అమ్మ ఒడి ఇచ్చారు , ఇప్పుడు మాత్రం 2 నెలలు కూడా అవ్వలేదు ఇచ్చేయాలంటావ్ ఎలా నీతో?

  3. టీచర్ తో జంప్ అంట గా loki.

    మన విద్యా మంత్రి లోకేష్ బాబు కూడా . ఆంధ్ర తల్లిలకి వెన్నుపోటు 

    1. ఇలా గాసిప్స్ కాపీ పేస్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత పే చేస్తుంటారు..?

      శాలరీ కి పని చేస్తుంటావా..? లేక పిలిచి కూలి ముట్టచెపుతారా..?

      ఏదేమైనా నీ బతుకు మాత్రం 11 సీట్లు పరిమితం.. హి హి హి

  4. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో పిల్లలకు ఆస్తులు ఇస్తారు 

    మన బాబు గారు “వెన్నుపోటు ను” వారస్తం గా ఇచ్చారు లోకేష్ బాబు కి.

    ఆంధ్ర తల్లిలకి వెన్నుపోటు 

  5. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

    రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె 

    రెడ్ బుక్ రాజ్యాం గం లో బాధితులపైనే కేసులు

  6. జగన్ ప్రభుత్వం లో ధర్మారెడ్డి నియామకాన్ని తీవ్రణగా విమరచినా యెల్లో మీడియా. 

    ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వెంకయ్య చౌదరికి కేటాయించింది 

    మరి ఇప్పుడు యెల్లో మీడియా తెలు కుట్టిన పాములా ఉంది

  7. విధి విధానాలు అన్నారు గ అంటే తలరాత ఉంటె వస్తుంది అని అర్ధం

  8. Mahamhulu , ante CBN garu, Pavan Garu, Lokesh Garu, ++++ etc elections ki mundu kalasi kurchuni elya amalu cheyyalo anna aalochane lekundane eee padakalu announce chesaraaa.????!!!!!!. Siggu kadaa. ???

  9. వచ్చే 5 years ఇవ్వరు అనుకుందాం. కొంపలు మునిగిపోతాయా! ఇవ్వకపోయినా ఎవరూ పట్టించుకోరు. TDP మేనిఫెస్టో ను ప్రజలు పట్టించుకోలేదు. వారు TDP కూటమికి ఓటు వేసింది కేవలం అభివృద్ధి & ప్రజాస్వామ్య పాలన & రోడ్లు & అమరావతి & ఇరిగేషన్ ప్రాజెక్టులు & 5/- భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ల కోసమే.

    1. Mari abhivrudhi kosam 2004 lo 2009 lo 2019 lo enduku veyyaledu. Sollu cheppandraa ante mundu untaaru.

      Babu gaaru gelichindi 3 times padindi 3 times. Gelichina moodu saarlu evado okadi sankani ekkadam valla kudirindi.

      Adi vajpayee kavochu, modi kavochu, PKlu kaavochu

      1. 2004 kante mundu appatake 10 years nunche tdp rule chestundhi kabatti anti anedhi untundhi kothadhanam korukuntaaru .. ika 2009 lo chiranjeevi gaaru party petti BC la TDP otu share ni cheelachdam valane malli mahemetha gaadu gelichaadu … 2019 lo andhra parjalau bokka borlaa paddaru thappu thelusukoni tdp ki 136 seats kattabettaru .

  10. చెప్పింది “వచ్చే సంవత్సరం” అంతే కానీ “వచ్చే ఆర్ధిక సంవత్సరం” అని కాదు. y cp ప్రభుత్వ లో అమ్మఒడి కూడా నాలుగు సంవత్సరాలే గా వేసింది [15K + 14K + 13K + 13K] అది కూడా ఒక్కళ్ళకే

Comments are closed.