ఆలూ లేదు.. చూలూ లేదు.. పెట్టే కంపెనీ పేరు టెస్లా!

భారత్ కు టెస్లా వాహనాలు పంపబోతున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇక్కడ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం రానేలేదు.

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాట్ట వెనకటికి ఒక మహా మేధావి. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో ముందుకు తీసుకువెళ్లిపోతున్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా తాపత్రయపడుతోంది.

దావోస్ కు సీఎం, మంత్రి వెళ్లారు వచ్చారు. తత్ఫలితంగా ఇంకా సంస్థలు మాత్రం రాలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రకరకాల పరిశ్రమల పేర్లు చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుండగా.. వాటన్నింటిలోకీ కలిపి టీసీఎస్ కార్యకలాపాలు విశాఖలో ప్రారంభం కావడం ఒక్కటీ ఖరారుగా కనిపిస్తోంది.

గూగుల్ తో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఒప్పందం కుదిరింది గానీ.. నిజానికి అది గూగుల్ కు కాంట్రాక్టు ఇచ్చి ప్రభుత్వమే డబ్బు ఖర్చు పెట్టడం లాంటి ప్రాజెక్టే తప్ప.. పరిశ్రమల తరహాలో రాష్ట్రశ్రేయస్సుకు ఉపయోగపడేది కాదు. కానీ ఈ ప్రభుత్వం ఏదేదో చేస్తున్నదని, ఏవేవో పరిశ్రమలు రాబోతున్నాయని ప్రజలు నిత్యం అనుకుంటూ ఉండేలా వ్యూహాత్మక మార్కెటింగ్ పక్కాగా జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తే.. టెస్లా కూడా అలాంటి వ్యూహ ప్రచారాల్లో భాగమేనా అనిపిస్తోంది.

ఎందుకంటే.. ఇప్పటిదాకా టెస్లా అసలు భారత్ లో తమ తయారీ యూనిట్ ను ప్రారంభించడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కాకపోతే.. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధుల్ని కలిసి.. ఏపీలో ప్రాజెక్టు పెట్టాలని ప్రపోజల్ మాత్రం ఇచ్చారు. అవతలి వైపునుంచి ఎలాంటి స్పందన ఇప్పటిదాకా తెలియలేదు. అయితే.. ఇప్పుడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని మూడు పారిశ్రామికవాడల పరిధిలో టెస్లాకోసం ప్రభుత్వం స్థలాలు ఎంపిక చేస్తున్నట్టుగా.. ఆ మూడింటిని వారికి ఆప్షన్స్‌గా చూపించి.. అందులో ఒకటి ఎంచుకోడానికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు అసలు టెస్లా ఇండియాకు వస్తుందా లేదా అనేదే సందేహంగా ఉంది. టెస్లా యూనిట్ భారత్ లో ఏర్పాటుచేస్తే అది అమెరికాకు ద్రోహం చేసినట్టే అని ట్రంప్ గతంలో బహిరంగంగా ప్రకటించడమూ, ఆ సందర్భంలో అలాంటి ఆలోచనే లేదన్నట్టుగా ఎలన్ మస్క్ ఆయనకు హామీ ఇవ్వడమూ కూడా జరిగింది. జర్మనీలోని యూనిట్ నుంచి మాత్రమే.. భారత్ కు టెస్లా వాహనాలు పంపబోతున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇక్కడ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం రానేలేదు.

టెస్లా లాంటి పెద్ద సంస్థ తమ రాష్ట్రానికి వస్తే బాగుంటుందనే ఆశ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కూడా ఇలాంటి ఆశావహ దృక్పథం ఉండడం మంచిదే. కానీ.. అయితే సంస్థ వచ్చే సంకేతాలేమీ లేకుండానే.. మేనకూరు సెజ్, శ్రీసిటీ, క్రిష్ణపట్నం పోర్టు వద్ద అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ లలో స్థలాలు ఎంపిక చేస్తున్నట్టుగా.. వార్తలు పుట్టించడం.. కేవలం ఒక వ్యూహమే అని అనుకోవాల్సి వస్తోంది.

గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు అనేకం జరగడం.. చివరికి ఆ సంస్థలు ఏపీకి రాకపోవడమూ తెలుగుదేశం పాలన కాలంలో జరిగింది. టెస్లా విషయంలో కూడా అలా అభాసుపాలు కాకుండా ఉండాలంటే.. కాస్త ఆచితూచి మాట్లాడాలని ప్రజలు అనుకుంటున్నారు.

14 Replies to “ఆలూ లేదు.. చూలూ లేదు.. పెట్టే కంపెనీ పేరు టెస్లా!”

  1. అది సరే గ్యాస్, మన అన్న ఘనం గా ప్రారంభించిన పులివెందుల ఫిష్ మార్కెట్ గురించి, మన పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ అట్టహాసంగా ఓపెనింగ్ చేసిన పంపు సెట్ గురించి ఒక్క కథనం అయినా రాయొచ్చు కదా? గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఇలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులను మీరు గుర్తు చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి కష్టం.

  2. అభివృద్ధి అంటే బ్రాహ్మణి స్టీల్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, వాన్ పిక్, సరస్వతి సిమెంట్స్ లాంటి పరిశ్రమలకు శంకుస్థాపన చేయటం అంటున్న జీఏ

  3. ఏం పర్లేదు నిజంగా టెస్లా కంపేనీ వచ్చిన మన ఖాతాలో వేసుకోవచ్చు మన బుగ్గన గారు ఉన్నారు కదా ఏం ఇబ్బంది లేదు..

  4. మనం టీ అమ్ముకునే వాళ్లకి సూట్లు వేసి సంతకాలు చేసిన ఫేక్ MOU ల లోంచి ఎన్ని కంపెనీలు పని మొదలు పెట్టాయి?

Comments are closed.