ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే రైతులు, మహిళల ఆదరణ తప్పనిసరి. అందుకే వాళ్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు భారీ హామీలు ఇస్తుంటాయి. 2024 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆకాశమే హద్దుగా హామీలిచ్చారు. సూపర్‌సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలు ఇచ్చి, అపరిమితమైన అధికారాన్ని కూటమి దక్కించుకుంది.
అయితే హామీలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని బీజేపీ ఎన్నికల ముందే తప్పించుకుంది. కావున బీజేపీని హామీల విషయమై ప్రశ్నించలేం. హామీల అమలుకు తామిద్దరం బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల ముందు చెప్పారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పింఛన్లు మినహాయిస్తే , మిగిలిన హామీల్లో చెప్పుకోదగ్గవి నెరవేర్చలేదు.
మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేలు, అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీల కోసం వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలకు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, రైతుల్లో కూటమి సర్కార్‌పై వ్యతిరేకత పెంచేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ప్రతి రోజూ వివిధ వేదికల మీదుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మొదలుకుని చిన్నాపెద్దా నాయకులంతా పదేపదే కూటమి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టడంపై విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ఇదే విషయమై చంద్రబాబునాయుడిని నిలదీస్తూ ఒక పోస్టు పెట్టడం గమనార్హం.
చంద్రబాబూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ ప్రశ్నిస్తూ… పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
ఇదే రోజు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆడబిడ్డలకు అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో పథకం గురించి వివరిస్తూ, ఆమె కూటమి సర్కార్‌ను ఏకిపారేశారు. అలాగే ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితర నాయకులు కూడా గట్టిగా కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతానికి మహిళలు, రైతుల్లో వ్యతిరేకత నింపడం ద్వారా, వాళ్లే కూటమి సర్కార్‌పై రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారనే వ్యూహంతో వైసీపీ ముందుకెళుతోంది.
thokkemi kaadhu… evaru pattinchukoru
శ్యామల ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం చెబుతుంది ఇచ్చిన హామీలను అమలు చేయాలని కదా (వారంలో సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్, మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్ కి పరిమితం చేస్తాన్న జగనన్న ను తిడుతున్నట్లు లేదు).
Voters know CBN will not fulfill guarantees but still voted him. They gave mandate for Jagan’s poor performance as a ruler.
When Jagan anna will come out of illusion?
jagan anavasaram ga unchadu liquor sudden ga ban chesam ani announce cheste super undedi oka 3 months,villaki okesari 1.5lakhs jobs kanapadav 6 months lo kani every yr job calender veyaledamta..🤣..ipudu baga vesaru jagan vesina 10k teacher jobs ki principals, lecturers kalipi 16k estam ani sign petti 7 months ayimdi inthavaraku notifications levu