కోటి మందితో టీడీపీ సభ్యత్వం చేయించడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నాయకులు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికి 96 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇన్స్యూరెన్స్ కూడా ఇవ్వనున్నట్టు లోకేశ్ తెలిపారు. ఇంత వరకూ బాగానే వుంది.
అయితే టీడీపీ భారీ సభ్యత్వం వెనుక మతలబు ఏంటో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశ్చర్యకర విషయాలు చెప్పారు. భూపట్టాలు ఇప్పిస్తాం, ఆధార్‌కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని, టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా భీమిలి నియోజక వర్గం ముచ్చర్ల గ్రామంలో వందశాతం టీడీపీ సభ్యత్వం నమోదైనట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
ముచ్చర్లలో 1400 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే ఆ గ్రామంలో వైసీపీ బలంగా వుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో 1350 ఓట్లు నమోదు కాగా, టీడీపీ-వైసీపీ మధ్య తేడా కేవలం 150 ఓట్లు మాత్రమే అని ఆయన అన్నారు. ముచ్చర్లలో జనసేన, బీజేపీ లేవా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ సభ్యత్వంపై ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
గత ఏడు నెలలుగా ప్రవచనాలు చెబుతున్న హోంమంత్రి వంగలపూడి అనిత గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చిందన్నారు. టీటీడీ సిఫార్సు లేఖలు అమ్ముకునే స్థితికి అనిత పేషీ చేరుకుందని విమర్శించారు. ఈ విషయమై సనాతన ధర్మం గురించి మాట్లాడే నేతలు ఏం చెబుతారని మాజీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
నెను బట్టన్లు నొక్కుతూ, కాలక్షెపం చెసి.. అదె పాలన అన్నట్టు భ్రమించి ఓడిపొయాను. కాబట్టి నువు కూడా అలెనె చెయాలి! తొండి!!
బాగానే ట్రై చేస్తున్నాగానీ, పొయ్యి ఈ కామెంట్ డబ్బులు తీసుకో . నీ కుటుంబం మల్లి ఆకలితో చస్తుంది
బాగానే ట్రై చేస్తున్నాగానీ, పొయ్యి ఈ కామెంట్ డబ్బులు తీసుకో . నీ కుటుంబం ఆకలితో అల్లాడిపోతుంది
కనీసం ఆ బటన్ లు నొక్కడం కూడా చేత కావడం లేదు.. లక్షా పాతికవేల కోట్లు అప్పు ఎం చేశారో ఇంత వరుకూ లెక్క పాత్రా లేదు.. పోనీ ఏమైనా డెవలప్ చేశారా అంటే, దోచుకోవడం తప్ప ఇంకోటి ఇంతవరకూ లేదు..
ఆ బటన్లు నొక్కడం వల్లే కదా.. మీ మొఖాన ముష్టి 11 కొట్టారు ..
అదేదో దేశ సేవ అన్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నావు ..
🤣🤣🤣
దీనికి సమాధానం వంగలపూడి అనిత చెప్పక్కర్లేదు కోడిని గాని గుడ్డునుగాను అడగమను చెబుతుంది
ఒరేయ్ గుడ్డు మంత్రి నీ మొహానికి గుండు సున్నాలు పెట్టిన ఇంకా బుద్ధి రావడం లేదు రా వెధవన్నర వెధవ. సరే ఆమె అబద్ధమే చెబుతుంది అనుకున్నాం మరి నువ్వు ఎందుకు గెలవలేదు రా గుడ్డు మంత్రి . నువ్వు చెప్పడానికి ఈ గ్యాస్ ఆంధ్ర గాడు రాయడానికి సరిపోయింది. రెండు దొందు దొందే
మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నేను, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా నేను బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చు చేసాం. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేసాం. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసాం. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నాం.
– శ్రీ నారా లోకేష్ గారు