బీజేపీకి నిఖార్సయిన ‘ప్రత్యేక హోదా’ సెగ షురూ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి 'మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌' చాలా ఎక్కువ. అలాంటి చంద్రబాబునే భారతీయ జనతాపార్టీ 'మేనేజ్‌' చేసేసింది ప్రత్యేకహోదా విషయంలో. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రత్యేకహోదా విషయమై వైఎస్సార్సీపీ అధినేత…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి 'మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌' చాలా ఎక్కువ. అలాంటి చంద్రబాబునే భారతీయ జనతాపార్టీ 'మేనేజ్‌' చేసేసింది ప్రత్యేకహోదా విషయంలో. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రత్యేకహోదా విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గత ఐదేళ్ళలో మేనేజ్‌ చేయలేకపోయిన బీజేపీ, ఇకపైనా అలాంటి ప్రయత్నాలు చేసి బొక్క బోర్లా పడక తప్పదు. ఎందుకంటే, గతంతో పోల్చితే ఇప్పుడ వైఎస్‌ జగన్‌ మరింత బలాన్ని పుంజుకున్నారు. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ప్రత్యేకహోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కుండబద్దలుగొట్టేశారు.

ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయమంటూ ఏపీ బీజేపీ నేతలు ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. ఇకపై, అంత సీన్‌ బీజేపీ నేతలకు వుండకపోవచ్చు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, అప్పుడే వైసీపీ మీద డైరెక్ట్‌ ఎటాక్‌ షురూ చేశారుగానీ, ఆ ఎటాక్‌ నవ్వులపాలైపోయింది. 'చంద్రబాబుని మీరు మేనేజ్‌ చేయగలిగారు.. ఆయనా అప్పట్లో రాజీపడిపోయారు. కానీ, వైఎస్‌ జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు లొంగేరకం కాదు.. మేనేజ్‌ చేసేస్తామంటే కుదరదు..' అని వైసీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.

'ప్రత్యేకహోదా విషయమై కేంద్రాన్ని అడుగుతూనే వుంటాం..' అని తొలిసారి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి హోదాలో కలిసిన అనంతరం 'లైటర్‌ టోన్‌'తో వైఎస్‌ జగన్‌ చెప్పినా, అప్పటికే పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసేసుకున్నారాయన. నీతి అయోగ్‌ సమావేశంలోనూ ప్రత్యేకహోదా గళం విన్పించారు వైఎస్‌ జగన్‌. అయితే, 'వైఎస్‌ జగన్‌ మమ్మల్ని అర్థం చేసుకుంటారు.. హోదా గురించి ఆయన ఇకపై మాట్లాడకపోవచ్చు..' అని నిన్న మొన్నటిదాకా కూడా ఏపీ బీజేపీ నేతలు కథలు చెబుతూ వచ్చారు.

కానీ, బీజేపీకి అసలు సిసలు 'స్పెషల్‌ స్టేటస్‌' సెగ ఇప్పుడే మొదలైంది. రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీ నిఖార్సుగా ఓ అంశంపై.. రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రాన్ని నిలదీస్తే ఎలా వుంటుందో, ఆ ఎఫెక్ట్‌ని రుచి చూడబోతున్నారు ఏపీ బీజేపీ నేతలు. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయమై అడ్డగోలుగా మాట్లాడుతున్న జీవీఎల్‌ నరసింహారావు, విష్ణువర్ధన్‌, రమేష్‌.. తదితర బీజేపీ నేతలకు ముందు ముందు ముసళ్ళ పండగే.!

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!