చంద్రబాబు ఏజెంటుగా, తిరిగి ఆయనను సీఎం పీఠంపై చూడడమే జీవితాశయం అన్నట్లుగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ తాను ఇవ్వగలిగిన క్లారిటీ ఇచ్చేశారు. ‘తెలుగుదేశంతో కలిసి మాత్రమే పోటీచేస్తాను’ అనే వాక్యం చెప్పడం ఒక్కటే తక్కువ. ఆల్మోస్ట్ అంత పనీ చేసేశారు.
నా క్లారిటీ నేను ఇచ్చాను.. చంద్రబాబుకు జై కొట్టడం గురించి మీ ఉద్దేశమేంటో తేల్చుకోండి అని కూడా కాషాయదళానికి సంకేతం ఇచ్చారు. ఆయన పార్ట్ పూర్తయింది. మరి బీజేపీతో పొత్తుకోసం తాను సిద్ధమేనని చంద్రబాబు కూడా సంకేతం ఇవ్వాలి కదా.
గత ఎన్నికల్లో పరాజయం పాలైన సమయానికి బీజేపీ నేతలంటేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మెత్తబడ్డారనే సంగతిని వారికి చేరవేయాలి కదా. అందుకే, ఒక చిన్న ప్రజాసమస్యను సాకుగా పెట్టుకుని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడం ద్వారా కమలనేతలను చంద్రబాబునాయుడు దువ్వుతున్నారు.
చంద్రబాబు ఇటీవల- హనుమాన్ జంక్షన్ వద్ద ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడకు వెళ్తుండగా వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ కావాలని స్థానికులు చంద్రబాబును కోరారు. అధికారంలో లేని చంద్రబాబును ప్రజలు కోరడమే పెద్ద కామెడీ. దాంతో చంద్రబాబు మంచి ఛాన్సే వచ్చిందనుకున్నారు. ఇదే మూడేళ్ల ముందు అయితే.. వెంటనే.. ఆయన రోడ్డు మీద బైఠాయించేసి.. కేంద్రప్రభుత్వం దిగిరావాలని, అండర్ పాస్ ప్రజల అవసరం అని, మోడీని నిలదీయాల్సిందేనని ఒక ధర్మపోరాట దీక్ష చేసి ఉండేవారు.
ఇప్పుడు సీన్ ఇంకో రకంగా ఉంది. బిజెపిని ప్రసన్నం చేసుకోవడం చంద్రబాబుకు అత్యావశ్యకం. బాబుతో కలిసి వెళ్లాల్సిందే అని పవన్ కల్యాణ్ సూచనలు ఇచ్చేసిన తర్వాత.. బిజెపి వాళ్లే ఏమీ స్పందించడం లేదు. ఎందుకైనా మంచిదని సోము వీర్రాజు లాంటివాళ్లు ఆచితూచి మాట్లాడుతున్నారు.
రాష్ట్ర బిజెపి నాయకులంతా చంద్రబాబు తమతో వ్యవహరించిన గత అనుభవాల వల్ల ఆయనను ఛీత్కరించుకుంటున్న వారే. అందుకే వారిని చంద్రబాబు ఆశ్రయించలేరు. కేంద్రంలో మోడీ దగ్గరకు వెళ్లడానికి మొహం చెల్లదు. యాక్సెస్ కూడా లేదు. ఏదో వేలేరు ప్రజల రూపంలో కనీసం నితిన్ గడ్కరీతో మాట కలపడానికి ఒక అవకాశం వచ్చింది.
వారు అడిగిందే తడవుగా.. అండర్ పాస్ కావాలంటూ గడ్కరీకి లేఖ రాశారు. ఆ లేఖ దాదాపుగా ‘మీ దయ మా ప్రాప్తం’ అన్న చందంగానే సాగి ఉంటుందనే అనుకోవచ్చు. కాకపోతే సదరు దయ అనేది కేవలం ప్రజలు అడిగిన అండర్ పాస్ కోసం మాత్రమే కాకుండా, తన రాజకీయ జీవితం సమాధి అయిపోకుండా ఉండడానికి కూడా వర్తిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
ఒక్క పిచ్చి నాకో డుకు కళ్యాణ్ తప్ప బొల్లిగన్ని ఎవ్వరూ దరిదాపుల్లోకి రానేరు. ఇది పచ్చి నిజం..