Advertisement

Advertisement


Home > Politics - Gossip

కొత్త లీక్.. ఎమ్మెల్సీలకు నో ఛాన్స్

కొత్త లీక్.. ఎమ్మెల్సీలకు నో ఛాన్స్

జగన్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిన్న మొన్నటివరకు దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు బాగా ఆశలు పెట్టుకున్నారు. విస్తరణలో భాగంగా మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ తాజా లీకుల ప్రకారం, మంత్రివర్గంలో ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఒక్క ఎమ్మెల్సీ కూడా లేరు, తాజాగా జరిగే విస్తరణలో కూడా వారు ఉండకపోవచ్చు. దీనికో కారణం ఉంది.

మండలి రద్దు చేసిన జగన్

మూడు రాజధానుల కోసం తీసుకొచ్చిన బిల్లుపై శాసన మండలిలో జరిగిన రచ్చ తర్వాత అసలు మండలిని రద్దు చేయాలని తీర్మానించారు సీఎం జగన్. ఆ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపించారు. అయితే అది పెండింగ్ లో ఉంది. 

ఇటు ఏపీ నుంచి కూడా దానిపై పెద్దగా ఒత్తిడి చేయలేదు. అదే సమయంలో కొత్తగా కొంతమందికి ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు జగన్. ఎమ్మెల్సీల నియామకం సందర్భంలో కూడా జగన్ పై విమర్శలు వచ్చాయి. మండలి వద్దంటున్న జగన్, ఎమ్మెల్సీను ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

తిరుపతి లోక్ సభ టికెట్ ఆశించిన బల్లి దుర్గా ప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీ సీటిచ్చి, ఆ టికెట్ ని డాక్టర్ గురుమూర్తికి ఇచ్చి గెలిపించుకున్నారు జగన్. ఆ సందర్భంలో కూడా జగన్ పై విమర్శలొచ్చాయి. అంతమాత్రాన జగన్ కి మండలిని కొనసాగించే ఉద్దేశం లేదు, అదే సమయంలో మండలిలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంలో ఆయన నిర్లక్ష్యం కూడా వహించలేదు. అందుకే కొత్త ఎమ్మెల్సీలకు మండలికి వెళ్లేందుకు అవకాశమిచ్చారు.

కానీ వారిని మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన మాత్రం జగన్ కి లేదు. ఎమ్మెల్సీలను నియమించినందుకే విమర్శలు ఎదుర్కొన్న జగన్.. వాళ్లకు మంత్రి పదవులిస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. పైగా గతంలో మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో మంత్రి పదవులకు రాజీనామా చేయించి వారికి రాజ్యసభ సీట్లు  ఇచ్చారు జగన్. సో.. ఇలాంటి టైమ్ లో జగన్ తన కేబినెట్ లోకి ఎమ్మెల్సీలను తీసుకునే అవకాశాలు చాలా తక్కువ.

కేబినెట్ భేటీలో కూడా క్లారిటీ

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చిన్న స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో కనీసం 60శాతం మందితో రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అంటే మంత్రివర్గంలో స్వల్పమార్పులే ఉంటాయని దీనిర్థం. 

అదే కనుక జరిగితే ఆల్రెడీ రేసులో ఉన్న ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం దక్కుతుంది తప్ప, ఎమ్మెల్సీలకు పదవులు దక్కకపోవచ్చు.

విస్తరణ వాయిదా..?

మరోవైపు జగన్ కేబినెట్ విస్తరణ కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ మార్పులు చేర్పులకు జగన్ రెడీగా ఉండి ఉంటే.. ఈ పాటికే లీకులు వచ్చి ఉండేవి. కానీ ఆ దిశగా జగన్ ఎప్పుడూ నోరు మెదపలేదు. కనీసం త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిన వారికి జగన్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. 

మరోవైపు జగన్ మంత్రి వర్గ విస్తరణ మరో 6 నెలలు వాయిదా పడినట్టు కూడా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న టీమ్ సామర్థ్యాన్ని మరింతగా మదింపు చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట. అందుకే మంత్రివర్గ విస్తరణ మరికొన్ని రోజులు వాయిదా పడుతుందని తెలుస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?