Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఒక్కొక్కటిగా వదిలించుకుంటున్న జనసేన

ఒక్కొక్కటిగా వదిలించుకుంటున్న జనసేన

తను స్థాపించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపించిందో ఫలితాలకు ముందే పవన్ కల్యాణ్ కు అవగతమైంది. మరోవైపు పవన్ తో మొన్నటివరకు క్లోజ్ గా తిరిగిన నేతలకు కూడా అర్థమైంది. అందుకే ఒక్కొక్కరుగా జారుకోవడం మొదలుపెట్టారు. ఈ సంగతి అటుంచితే, అధికారంలోకి వచ్చేదిలేదు కాబట్టి ఖర్చులు తగ్గించే ప్రక్రియను ఆల్రెడీ మొదలుపెట్టిందట జనసేన.

కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇప్పటివరకు జనసేన పార్టీకి సేవలందించిన 99టీవీని వదిలించుకోవడానికి ఆ పార్టీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన తర్వాత 99టీవీ జనసేనకు అంతగా ఉపయోగపడదు. తమ పార్టీకి అది ఏమేరకు ప్రచారం చేస్తుందనే విషయాన్ని పక్కనపెడితే దాని నిర్వహణకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఛానెల్ ను అమ్మేయడం ద్వారా ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది జనసేన.

అమ్మకానికి సంబంధించి ఆ ఛానెల్ ఓనర్ తోట చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు పవన్ కు కొమ్ముకాసిన ఈ ఛానెల్ ను ఇప్పుడు ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే టీవీ ఛానెళ్ల వ్యాపారంతో దగ్గర సంబంధాలున్న ఓ బడా పారిశ్రామికవేత్త రంగంలోకి దిగారు.

కేవలం టీవీ మాత్రమేకాదు, జనసేన పార్టీకి ఆంధ్రప్రభ పత్రిక కూడా ఉంది. ఎన్నికల టైమ్ లో ఈ పత్రికలో వాటాను కూడా తనకు చెందిన వ్యక్తులతో కొనుగోలు చేయించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఆ వాటాను కూడా అమ్మేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి కూడా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెబుతున్నారు.

ఇక సోషల్ మీడియా సంగతి సరేసరి. జనసేనకు చెందిన వందలాది ఎకౌంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఓ సినీనిర్మాత ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఎకౌంట్లను దశలవారీగా మూసివేస్తూ వస్తున్నారు. మొన్నటివరకు తమనుతాము జనసైనికులుగా చెప్పుకున్న ఎంతోమంది సోషల్ మీడియా వ్యక్తులు ఇప్పుడు ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నారు.

మరోవైపు కేవలం పవన్ పై నమ్మకంతో ఎన్నికల టైమ్ లో హడావుడిగా ప్రారంభమైన మరో న్యూస్ ఛానెల్ పరిస్థితి కూడా అయోమయంలో పడింది. పవన్ కోసం ఆఖరి నిమిషంలో ఆగమేఘాల మీద దీన్ని స్టార్ట్ చేశారు. అయితే దీనిలో పవన్ ప్రమేయంలేదు. కేవలం పవన్ పై ఇష్టంతో ఓ ఎన్నారై పెట్టిన ఛానెల్ ఇది. ఇప్పుడు ఈ ఛానెల్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది.

ఫలితాలు వెల్లడి కాకముందే ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఇలా భారీ కుదుపులకు గురవుతోంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ మీడియాలో మరిన్ని పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?