వైసీపీ పెద్దాయన జంపింగ్ గ్యారంటీ?

గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన తమ్మినేనికి ఆ పార్టీలో చేరేందుకు పాత పరిచయాలు ఉపకరిస్తాయని అంటున్నారు

వైసీపీలో ఇప్పుడు ఒక్కొక్కరూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన శిబిరంలో వారు చేరిపోతున్నారు. వైసీపీలో ఉంటే ప్రతిపక్షంలో నాలుగున్నరేళ్ల పాటు మనుగడ సాగించలేమన్న భయం ఏదో వారిని వెంటాడుతోంది అంటున్నారు.

ఉత్తరాంధ్రలో ఇప్పటికే వైసీపీ నుంచి కీలక నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్తున్నారు. అదే వరసలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పెద్దాయన కూడా కుటుంబ సమేతంగా పార్టీ గేటు దాటి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు అని పుకార్లు అయితే పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి.

ఆ పెద్దాయన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆయన దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలలో కీలకంగా ఉన్నారు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచి మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014 నాటికి వైసీపీ గూటికి చేరారు.

ఆ పార్టీ నుంచి వరసగా మూడు ఎన్నికల్లో టికెట్ సాధించి పోటీకి దిగితే 2019లో మాత్రమే గెలిచారు. అందుకు గానూ ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. 2024 ఓటమి తరువాత తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులుగా పార్టీ నియమించింది.

ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇంచార్జిని పెట్టారు దాంతో అసంతృప్తితో ఉన్న తమ్మినేని కుటుంబం జనసేన వైపు చూస్తోంది అని అంటున్నారు. తమ్మినేని సీతారాం అయితే కొంత కాలం వేచి చూద్దామని అంటున్నా కుమారుడు సర్పంచ్ గా ఉన్న‌ సతీమణి జనసేన వైపే మొగ్గుతున్నారని అంటున్నారు. దాంతో తమ్మినేని కూడా ఆ వైపే వెళ్తారు అని అంటున్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చూస్తున్నారు. దాంతో తమ్మినేని కుటుంబం జనసేనలో చేరితే ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిస్తోందని అంటున్నారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన తమ్మినేనికి ఆ పార్టీలో చేరేందుకు పాత పరిచయాలు ఉపకరిస్తాయని అంటున్నారు. కొత్త ఏడాది తమ్మినేని ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అయితే ఆముదాలవలసలో ఇప్పటికే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసి ఉంచుకున్న వైసీపీ ఈ పరిణామాలను ఎలా చూస్తుందో అన్నది ఆసక్తికరంగా ఉంది.

12 Replies to “వైసీపీ పెద్దాయన జంపింగ్ గ్యారంటీ?”

  1. మరేం ఫరవాలేదు. మళ్ళీ మన అన్న రాష్ట్రమంతటా ఊరూరూ తిరిగి పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసి అధికారంలోకి వస్తే (?) పోయినోళ్ళందరూ తిరిగొచ్చేస్తారు.

    1. పాద యాత్రలు, జనాలు, డెవలప్మెంట్….ఇదంతా ఓల్డ్ స్కూల్. పొత్తులు, జనాలికి ఎలా చెప్పాలి, evms ఇది చాలు. పార్టీ వాళ్ళని తినిపించకుండ జనాలు జనాలు అంటే సంక నాకి పోవడమే ఈ కాలం లో. జగన్ పార్టీ ముసుకోవడం ఉత్తమ అని నా అభిప్రాయం. డబ్బులు కోసం కాకుండా ఇక దేనికి ఒళ్ళు హూనం చేసుకోవడం? తినాలి, తినిపించాలి. జనాలకి చెప్పే నైపుణ్యం, నెట్వర్క్ ఉండాలి ఏమి చేయక పోయిన. ఒకప్పటి లాగ జనాలకి మంచి చేస్తే గెలవడం అనేది పిచ్చి భ్రమ.

  2. ఆయన నాలుగు పార్టీలు మారి మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీకు అనిపించలేదా అయనకు మరోసారి మారడం కష్టం కాదని ? ఇప్పుడు సమయం వచ్చింది, మీకు తెలిసే చేర్చుకున్నారు, కనుక ఇప్పుడు బాధపడి లాభం లేదు.

  3. బాబోయ్ ఇలాంటి వాళ్ళని తీసుకుని ఏం ఉద్దరించుకుంటారు టీడీపీ ఐన జన సేన, బీజేపీ లు అయినా , పార్టీ అధికారం లో ఉన్నప్పుడు సొంత కొడుకుని సర్పంచ్ గ గెలిపించుకోలేని ఇలాంటి వాళ్ళని తీసుకునే కన్నా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవడం ఉత్తమం…..

Comments are closed.