అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!

ఆఖ‌రికి అభిమానుల మంద‌ను సినిమా హీరోలు, నిర్మాత‌లు కూడా అస‌హ్యించుకుంటున్నారు. మీరెక్క‌డి త‌ల‌నొప్పిరా మాకు అని వారు మొత్తుకుంటున్నారు.

సినిమా వాళ్లు త‌మ‌ను తాము తెర‌పై సూప‌ర్ హీరోలు అనుకోవాల్సిందే కానీ, అధికారం ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌ద‌ని మ‌రోసారి రుజువు అయ్యింది. త‌మ టికెట్ రేట్ల కోసం, ప్రీమియ‌ర్ షోల కోసం అధికారంలో ఎవ‌రు ఉంటే వారికి దండాలు పెట్ట‌క త‌ప్ప‌ద‌ని ఇంకోసారి రుజువు అయ్యింది. అయితే సినిమా వాళ్ల ప్ర‌త్యేకత ఏమిటంటే.. వంగినంత‌సేపూ వంగ‌డం, ఆ త‌ర్వాత మ‌మ్మ‌ల్ని వంగించారు అంటూ వాపోవ‌డం! మొన్న జ‌గ‌న్ విష‌యంలో అయినా, ఇప్పుడు రేవంత్ విష‌యంలో అయినా ఇదే జ‌రిగింది, జ‌రుగుతుంది!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం అయిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఒక్క సినిమా ప్ర‌ముఖుడు కూడా స్పెష‌ల్ షోల గురించినో, మ‌రో అంశం గురించినో మాట్లాడ‌లేదు! హైద‌రాబాద్ ను ఎంట‌ర్ టైన్ మెంట్ ఇండ‌స్ట్రీకి క్యాపిటల్ గా చేయ‌డ‌మే ల‌క్ష్య‌మంటూ మాట్లాడారు! మధ్య‌లో ఇదెక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎవ‌రికీ తెలియ‌దు. సీఎంతో స‌మావేశం ముందు అలాంటి నినాదం ఏదీ లేదు. అయినా రేవంత్ రెడ్డి ఏమీ కొత్త‌గా సీఎం కాలేదు. ఇప్ప‌టికే ఏడాది పూర్త‌య్యింది. ఏడాదిలో ఎప్పుడూ సినిమా వాళ్ల‌కు మూకుమ్మ‌డిగా ఇలా వెళ్లి క‌ల‌వాల‌నిపించ‌లేదు. పుష్ప 2 సినిమా వివాదం త‌ర్వాత ఇది జ‌రిగింది.

మూడే ముక్క‌ల్లో చెప్పాలంటే.. పుష్ప 2 ప్ర‌ద‌ర్శిస్తున్న సినిమా థియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న తెలంగాణ ప్ర‌భుత్వానికి అందివ‌చ్చింది. సినిమా ఇండ‌స్ట్రీని గ్రిప్ లోకి తీసుకోవ‌డానికి అవ‌కాశంగా ఇది కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అందివ‌చ్చింది. ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకోకుంటే ఇది ఇంత చ‌ర్చ జ‌రిగే అంశం కూడా కాదు! ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగిన ఘ‌ట‌న కింద ఇది రెండో రోజే మ‌రుగ‌య్యేది. మీడియాకు కూడా సినిమా వాళ్ల అవ‌స‌రం కాబ‌ట్టి.. ఇది ప‌త్రిక‌లో సింగిల్ కాల‌మ్ వార్త‌య్యేది! గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

బ్యాన‌ర్లు క‌ట్ట‌బోతూ, క‌టౌట్లు పెట్ట‌బోతూ క‌రెంట్ తీగ‌లు తాకి చ‌నిపోయిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. వారంద‌రి గురించి ఏ స్టార్ హీరో కూడా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. మ‌హా అంటే సంతాపం వ్య‌క్తం చేస్తే ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌! అదే వీరాభిమానానికి ద‌క్కే బ‌హుమానం! అయితే.. ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం అసెంబ్లీ వ‌ర‌కూ వెళ్లింది. అయితే ఇది అసెంబ్లీలో చ‌ర్చ‌గా మారినా, ఐక్య‌రాజ్య‌స‌మితో చ‌ర్చ‌గా మారినా.. సామాన్యుడి స్పంద‌న మాత్ర ఒక్క‌టే! ప‌సిపిల్లాడిని తీసుకుని.. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అలా అర్ధ‌రాత్రి షో ల కోసం ఎందుకు వెళ్లిన‌ట్టు అనే ప్ర‌శ్న వ్య‌క్తం అవుతుంది కామ‌న్ మ్యాన్ నుంచి.

సినిమా ఎవ‌రిదైనా, త‌ప్పు ఎవ‌రిదైనా.. ప‌సి పిల్ల‌ల‌ను అలాంటి చోట‌కు తీసుకెళ్ల‌డంలో త‌ల్లిదండ్రుల తీరును త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌ని లేదా? త‌ల్లి ప్ర‌మాదంలో ప్రాణాల‌ను కోల్పోయింది. అయితే.. పిల్ల‌ల‌ను తీసుకెళ్ల‌డం మాత్రం ఎంత వ‌ర‌కూ క‌రెక్టు? పిల్ల‌ల‌పై ప్రేమ అంటే, ఇలాంటి షోల‌కు తీసుకెళ్ల‌డమా?

కోటి రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం, రెండు కోట్ల న‌ష్ట ప‌రిహారం, ఉద్యోగం ఇవే కాదు చ‌ర్చ జ‌ర‌గాల్సింది, ఇలాంటి చోట్ల‌కు పిల్ల‌ల‌ను తీసుకెళ్లే మిగ‌తా త‌ల్లిదండ్రులకు హెచ్చ‌రిక‌లా కూడా ఈ చ‌ర్చ జ‌ర‌గాలి. పిల్ల‌లు సినిమాల‌ను ఇష్ట‌ప‌డొచ్చు, ఇంట్లో సినిమా పోస్ట‌ర్ల‌ను త‌గిలించ‌వ‌చ్చు! అయితే.. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా పిల్ల‌ల‌ను ఉంచాల్సిన బాధ్య‌త అయితే త‌ల్లిదండ్రుల‌దే! అయితే ఈ ఇంగితం రోజురోజుకూ పోతోందేమో! తెలుగునాట సినిమా జాడ్యం తీవ్ర‌వాద‌పు స్థాయిల‌ను తాకి చాలా కాలం అవుతోంది. దాదాపు ద‌శాబ్దంన్న‌ర నుంచి ఆడ‌, మ‌గ తేడాలేకుండా అర్ధ‌రాత్రి షోల‌కు హాజ‌ర‌వ్వ‌డం హైద‌రాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో అల‌వాటుగా మారింది.

సినిమా అభిమానానికి కుల‌, రాజ‌కీయ అభిమానాలు తీవ్ర స్థాయికి వెళ్ల‌డంతో ముదిరిన జాడ్యం ఇది నిస్సందేహంగా! త‌మ కుల‌పు హీరో సినిమాకు ఎంత అర్ధ‌రాత్రి వెళితే అంత గొప్ప‌. ఎంత రేటు ఎక్కువ పెట్టి టికెట్ కొంటే అంత గొప్ప‌.

ఇలాంటి వ‌న్నీ జ‌న‌ర‌లైజ్ కావ‌డంతో.. ఇప్పుడు ప‌స‌పిల్ల‌ల‌ను కూడా ఇలాంటి మంద‌లోకి తీసుకెళ్లే రోజులు వ‌చ్చాయి. యుక్త‌వ‌య‌సులో ఉన్న అమ్మాయిలు కూడా దాదాపు దశాబ్దంన్న‌ర కింద‌టే అర్ధ‌రాత్రి షోల వ‌ద్ద అల్ల‌రిచిల్ల‌రి గా క‌నిపించ‌డం మొద‌లైతే, ఇలా అన్నెంపున్నెం ఎర‌గ‌ని పిల్ల‌ల‌ను కూడా సినీతీవ్ర‌వాదంలోకి త‌ల్లిదండ్రులే లాగుతున్నారు. ఫ‌లితంగానే ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌నేది నిస్సందేహం.

మ‌రి ప్ర‌భుత్వం సినిమా వాళ్ల‌కు సానుకూలంగా ఉండి ఉంటే, ఇది ఎవ‌రికీ లెక్క కాదు! ఇప్ప‌డు ప‌సిపిల్లాడి ప్రాణం అంటూ మాట్లాడుతున్న చాలా మంది కూడా దీన్ని ప‌ట్టించుకునే వారు కాదు. అలాగే అల్లు అర్జున్ ల‌క్ష్యంగా చేసుకున్నారు కాబ‌ట్టి కూడా కొంత‌మందికి ఈ ఘ‌ట‌న ప్రాధాన్య‌త పెరిగింది. లేక‌పోతే ఇది ఎవ‌రికీ ప‌ట్ట‌ని ఘ‌ట‌నే! జ‌రిగిన ఘ‌ట‌న విషాద‌క‌రం. అయితే దీన్ని ఎవ‌రి స్వార్థానికి త‌గ్గ‌ట్టుగా వారు వాడుకోవ‌డం మ‌రెంత విషాద‌క‌రమో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో.. తెలుగునాట సినీ వీరాభిమాన పైత్యం ఎంత బాధ్య‌తాయుత‌మైన స్థాయికి చేరింద‌నే చ‌ర్చ‌ను కూడా మ‌రోసారి తెర‌పైకి తెచ్చింది.

ఆఖ‌రికి ఆ నిర్మాత‌లు, హీరోలు కూడా ఈ అభిమానుల ఆగ‌డాల‌ను త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. సినిమా వీరాభిమానుల ర‌చ్చ‌పై నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ.. ఎవ‌రి ఇంట్లో వారు ఎగ‌రండి కానీ, ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి కాదంటూ వ్యాఖ్యానించాడు. వంద సినిమాల‌ను పైగా తీసిన సినీ నిర్మాణ కుటుంబం నుంచి వ‌చ్చి, స్వ‌యంగా కూడా నిర్మాత అయిన వ్య‌క్తి మాట‌లు సినిమా అభిమానుల‌ను చెప్పుతో కొట్ట‌డంతో స‌మానం! సురేష్ బాబు మాట‌లు నిస్సందేహంగా స‌మ‌ర్థ‌నీయం.

ఎవ‌డి ఇంట్లో వాళ్లు ఎగిరితే ఎవ‌రికీ న‌ష్టం లేదు. అయితే సినీ తీవ్ర‌వాదానికి హ‌ద్దూప‌ద్దూ లేకుండా పోతోంది. వీరు ఇంత‌లా ఆరాధించే హీరోలు కూడా వీరిని త‌మ సినిమాకు తెగే టికెట్లుగా చూస్తారు త‌ప్ప వీరికి పూచిక పుల్ల విలువ ఉండ‌దు. వీరు అభిమానంతో విర్ర‌వీగాల్సిందే కానీ, ఏ హీరో కూడా త‌మ అభిమానుల‌ను ప‌ట్టించుకోడు. వీరు త‌మ ఆస్తుల‌ను అమ్ముకుని హీరో పేరిట అన్న‌దానాలు చేయాల్సిందే కానీ, ఏ హీరో కూడా వీరిని పిలిచి ఒక పూట అన్నం పెట్ట‌డు. ఇవన్నీ ఎవ‌రికీ తెలియ‌న‌వి కావు. అయితే.. అన్నీ తెలిసినా, అమెరికాలో కూడా సిని హీరో బొమ్మ‌ల‌తో ర్యాలీలు తీసే దౌర్భాగ్య‌పు ప‌రిస్థితుల్లో ఉన్నారు తెలుగు జ‌నం!

ఇందుకు కుల‌మూ కీల‌క‌మే. సినీ అభిమానంలో యాభై శాతం కులం ప్రభావం అయితే, మిగిలినది ఐడెంటిటీ క్రైసిస్. నేను ఇదీ అని చెప్పుకోవ‌డం మ‌నిషికి ఇష్టం. చిన్న వ‌య‌సులోనే సినిమా ప్ర‌భావం మొద‌ల‌య్యే ప‌రిస్థితిలో ఉంది సొసైటీ. దీంతో ముందుగా సినిమా హీరోయిజంతో మ‌నిషి త‌న‌ను తాను పోల్చుకుంటాడు. ఆ ప్ర‌భావం నుంచి కొంద‌రు టీనేజ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికే బ‌య‌ట‌ప‌డ‌తారు. మ‌రి కొంద‌రు ఆ కూపంలోనే మిగిలిపోయి, తాము ఎప్ప‌టికీ హీరోలం కాలేమ‌ని గ్ర‌హించి, ఆ హీరోల‌కు అభిమానులం అని చెప్పుకోవ‌డంతో తృప్తి ప‌డ‌తారు.

జీవితంలో ఉన్న ఎంతో నైరాశ్యం వీరిని సినీ ఉన్మాదులుగా మార్చ‌వ‌చ్చు. ఇంట్లో తాము ప‌రిష్క‌రించలేని స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నా, త‌మ అవ‌స‌రం ఎంత ఉన్నా.. వాటిన్నింటినీ మ‌రిపించేందుకు సినీ అభిమాన‌మే ప‌రిష్కారం అవుతుంది. ఈ ర‌క‌మైన ఎస్కేపిజంతో బ‌తికేయ‌డానికి ఈ సినీ అభిమాన ముసుగును ధ‌రించ‌డం జ‌రుగుతూ ఉండ‌వ‌చ్చు. ఇది ఇండియాలో అంత‌టా ఉండే స్థితే, అయితే తెలుగునాట కులం కూడా తోడ‌య్యింది చాలా కాలం నుంచి. దీంతో ఈ రుద్దుడు మ‌రింత ఎక్కువ అయ్యి, ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఆఖ‌రికి అభిమానుల మంద‌ను సినిమా హీరోలు, నిర్మాత‌లు కూడా అస‌హ్యించుకుంటున్నారు. మీరెక్క‌డి త‌ల‌నొప్పిరా మాకు అని వారు మొత్తుకుంటున్నారు.

సినీవీరాభిమానంతో ఊగిపోయే యువ‌త ప‌రిస్థితి ఏమిటో .. వారు థియేట‌ర్ల‌పై రాళ్లేసినా, ఆస్తులు అమ్ముకుని టికెట్ల‌ను కొన్నా వారి బ‌తుకు చెడినా, పోలిసుల‌తో త‌న్నులు తిన్నా.. వారిని ర‌క్షించేందుకు ఎవ్వ‌రూ రార‌ని సినిమాల్లోనే చూపించారు! అయితే తెలుగునాట ఈ ప‌రిస్థితి ఇప్పుడ‌ప్పుడే స‌ద్దుమ‌ణిగే ప‌రిస్థితి లేదు! రీరిలీజ్ ల‌కు వెళ్లి స్క్రీన్ ల‌కు అగ్గి పెట్ట‌డం, సీట్ల‌ను కోసేయ‌డం, థియేట‌ర్లో మంట‌లు వేయ‌డం ద‌గ్గ‌ర ఉంది ప‌రిస్థితి. ఈ ఉన్మాదం ఇంత‌కింత‌కూ వెళ్ల‌డ‌మే కానీ, అదుపులోకి వ‌చ్చే ప‌రిస్థితి మాత్రం కనుచూపుమేర‌లో లేదు.

పిల్ల‌ల‌ను కూడా ప్రీ రిలీజ్ తొక్కిస‌లాట‌ల్లోకి తీసుకెళ్లే వారు, అర్ధ‌రాత్రి షోల‌కు తీసుకెళ్లే వాళ్లు, పిల్ల‌ల‌తో త‌మ అభిమాన హీరో డైలాగుల‌ను వ‌ల్లె వేయించి మురిసిపోయే వారు .. ఎటు చూసినా క‌నిపిస్తున్నారు! కాబ‌ట్టి.. రాబోయే త‌రాల‌కు త‌గిన అభిమానం వ‌ర్ధిల్లేలా ఉంది! స‌ర్వేజ‌నా సుఖినో భంతు!

30 Replies to “అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!”

  1. వీరు ఇంత‌లా ఆరాధించే హీరోలు కూడా వీరిని త‌మ సినిమాకు తెగే టికెట్లుగా చూస్తారు త‌ప్ప వీరికి పూచిక పుల్ల విలువ ఉండ‌దు.

        1. Babu nandu. Em chaduvuknnav. ? Theatre lo lekunda only OTT lo release cheyyali ante months budget antha OTT valle ivvali. Appudu Rate penchara ? Ippude correct. Dabbulunnode theatre ki velli chustadu lenodu OTT lo chusthadu.

          1. Naku chaduvu radu ley kani…niku matram kanisam comment chadivi reply ivvadam kuda radu..ippudu kuda movies ki budget OTT vale istunaru, please go through producer Nagavamsi recent interview.. and one more there is lot of collection directly avaliable in OTT without theater release.. india lo janalu offer untene order pette type..dont expect 5k/10k..

          2. Naku chaduvu radu rey kani..niku matram comment ni artham chesukovadam kuda radu…do you think all OTT collection first release in theater and do you think now OTTs are not funding movies..india lo janalu offer untene order chestaru… subscription fee 5k/10k ante shutter musu kovala sinde india lo..

  2. This is a superb article. Contributory negligence reflected in both cine people and their followers. It is true to expose one question: Is it necessary to give excess importance to a person who is an actor and rush to see him. Appreciation of action of the actor is commendable but not actor’s worship who is a human like us. Treat them in a normal way. Further, New movie can be seen at any time with no loss except the ticket cost. Why to rush to see a benefit or first show.

  3. చాలా మంచి వ్యాసం.. కానీ ఇదే వ్యాసానికి కొనసాగింపుగా ఇంకో వాక్యంగా సిద్ధం సభలకు లక్షలుగా రాష్ట్ర నాలుమూలాలు నుంచి వచ్చిన అభిమానుల గురించి వ్రాయి.

    ఇక్కడ రెండు విషయాలు

    లక్షలాది ప్రజలు స్వచంగా వస్తే ఆ అభిమానులు నీ లెక్కలొ పిచ్చివాళ్ళు.

    లేదా అభిమానం తో రాలేదు పిచ్చివాళ్ళు కాదు అంటే నువ్వు పంచె బిరియాని మరియు మందు కోసం వచ్చినట్టు.

    నా వరకు నాకు సినిమాలు ఇష్టమే కానీ మొదటి రోజు చూడాలనే పిచ్చిలేదు . అలాగే సభలు కూడా టీవీ లోనే చూస్తాను.

  4. ఈ అభిమాన జనాలు వెర్రినాబిడ్డలు కాకపోతే, సినిమా జనాలు తెరమీద ఒకలా – వాస్తవంలో ఒకలా ఉంటారా?

  5. ఈ వెబ్ సైట్ వాడి కులం హీరో లకి స్టార్ స్టేటస్ లేదు కాబట్టే.. ఇంత మంచి వ్యాసం వచ్చింది..

    ఇలాంటి వ్యాసమే రాజకీయ నాయకుల గురించి కూడా రాస్తే బాగుంటుంది

  6. the tv shows highlighting and poses of these pseudo movie actors and actress inspiring the kids and supported by this brainless parents as if they landed on moon no end for this craziness in the near future

  7. ఒకప్పుడు సినిమాకు వెళ్ళాము అని తెలిస్తే ఇంట్లో నాన్న స్కూల్ లో మాస్టారు తోలు వలిచేస్తారేమో అని భయం ఉండేది .. ఇపుడేమో తండ్రులే బెనిఫిట్ షోలకు తీసుకెళ్తున్నారు , మాస్టార్లు మాకు ఒక టికెట్ పట్టుకు రాందిరా అంటున్నారు … కాల్ మహిమ .. మెగా గిగా స్టార్లు సమాజన్ని కలుషితం చేయ

    మహిమ

  8. Some Politicians are in the opinion that bhaskar and his family has come to dilsuknagar to rtc x roads in the night at 10 pm to fight with pakisthan on behalf of india by purchasing 4 cinema tickets even though they are very poor.

  9. All agreed.

    See other angle now, one woman died and boy went into coma in stampede, how many people would’ve have pressed them without any humanity? If first 2-3 who saw that lady and boy fallen on ground and shown some courtesy, both lives would’ve survived safely today

  10. Very good analysis, finally making the parents responsible for the event.

    But my question to so called analysts is, why did the theatre people sell the tickets to a common man?

    Did he ask whether the person is coming with kids or elders?

    If the management knows that Allu Arjun is coming for the show, why did he sell tickets? Why can’t he keep the theater empty?

    When I buy a ticket, the management should take the responsibility of my safety, right?

    Where is that?

    When a person knows the impact of movie world wide, how can he come with somany bouncers?

    No doubt that the management, hero and the bouncers created a havoc and led to this.

    It’s a soul which departed due to others overaction.

    Respect that.

Comments are closed.