Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఉండవల్లి- జగన్ కే నీతులు

ఉండవల్లి- జగన్ కే నీతులు

ఎంత గొప్ప వక్తలైనా వెస్టెడ్ ఇంట్రస్ట్ తో మాట్లాడితే ఒకసారి అర్థం కాకపోవచ్చు. రెండోసారి అర్థం కాకపోవచ్చు. కానీ పదే పదే అదే యాంగిల్ లో మాట్లాడుతూ వుంటే జనాలకు అర్థం కాకుండా పోదు. గత కొంత కాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటూ మాట్లాడుతున్నారు. 

కేవలం వైఎస్ తనకు ఇచ్చిన ప్రాధాన్యత జగన్ ఇవ్వలేదనే కోపమో, కినుకో లోపల వుందో ఏమిటోతెలియదు కానీ, వీలయినపుడల్లా జగన్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే వస్తున్నారు. 

లేటెస్ట్ గా విశాఖలో ఉక్కు ఉద్యమం పై మాట్లాడుతూ, జగన్ కు జైలు అలవాటు అయిన సంగతే కాబట్టి మరోసారి ఉక్కు కోసం జైలుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఇది ఎంత హాస్యాస్పదంగా వుందో జనాలకు అర్థం అవుతోంది. ఒక్కసారిగా జైలు అలవాటు లేదు కదా అని చంద్రబాబుకు ఇదే సలహా ఎందుకు ఇవ్వకూడదు. 

జగన్ కు ఎంపీలు, ఎమ్మెల్యేలు వున్నారు నిజమే. ఇప్పుడు ఉండవల్లి సలహా విని అధికారం వదిలేసుకుని, జైలుకు వెళ్లి కూర్చోవాలన్నమాట. ఉక్కు సమస్య పై పోరాడాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ అందుకోసం అధికారం వదిలేసుకోవాలనేగా ఉండవల్లి అన్యాపదేశంగా చెబుతున్నది. 

అంటే అర్జంట్ గా జగన్ అధికారం వదిలేసుకుంటే బాగుండునని ఆశ పడుతున్నవారి జాబితాలో ఉండవల్లి కూడా చేరినట్లు కనిపిస్తోంది. నిజానికి ఉండవల్లి ఉక్కు ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని చంద్రబాబుకు ఎందుకు సలహా ఇవ్వకూడదు. ఆ విధంగా జనాలకు దగ్గర కావచ్చు. మళ్లీ అధికారం సంపాదించవచ్చు. 

2019లో మోడీ మీద పోరాటం ఎలాగూ అలవాటేగా మళ్లీ అలాగే చేయండి అని చంద్రబాబుకు ఎందుకు సలహా ఇవ్వకూడదు? లేదూ తను రెండు సార్లు స్వయంగా ఎంపీ కదా. తనే ఓ ఐక్క వేదిక ఏర్పటుచేసి ఎందుకు పోరాటం ప్రారంభించకూడదు. ఆయనకు అయితే అసలు ఏ భయమూ లేదు. జైలు కు వెళ్లే పరిస్థితి కూడా లేదు. 

పోనీ ఇవన్నీ వదిలేసి నేరుగా తిరుపతి వెళ్లిపోయి, అక్కడి ఓటర్లకు పిలుపు ఇవ్వవచ్చు కదా, ఆంధ్రకు భాజపా, మోడీ ఇంత అన్యాయం చేస్తున్నారు, ఆ పార్టీని ఓడించమని. ఆ విధంగా మోడీకి ఆంధ్రుల మనో భావాలని తెలియచేసే ప్రయత్నం ఉండవల్లి చేయవచ్చు కదా. 

ఇవేవీ చేయకుండా నెలకు ఓసారి బయటకు రావడం, పదే పదే ఆవువ్యాసం ప్రవచించినట్లు జగన్, జైలు, సీయం, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే రొటీన్ పదలతో స్పీచ్ ఇవ్వడం మళ్లీ లోపలకు వెళ్లిపోవడం. 

ఆ విధంగా ఉండవల్లి తనమీద చాలా మందికి వున్న మంచి అభిప్రాయాన్ని పాడు చేసుకుంటున్నారు. అది ఎందుకు అన్నది ఆయనకే తెలియాలి.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా