జగన్ కు తప్ప అందరికీ నమస్కారాలు

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పార్టీ వార్షిక సమావేశ ప్రసంగం ప్రారంభమైంది. పార్టీ నాయకులకు, బాధ్యులకు నమస్కారాలు పెడుతూ, కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం ఇలా ప్రతి పార్టీ నాయకులకు పేరు పేరునా నమస్కారాలు చెప్పారు. …

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పార్టీ వార్షిక సమావేశ ప్రసంగం ప్రారంభమైంది. పార్టీ నాయకులకు, బాధ్యులకు నమస్కారాలు పెడుతూ, కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం ఇలా ప్రతి పార్టీ నాయకులకు పేరు పేరునా నమస్కారాలు చెప్పారు. 

చంద్రబాబు నాయుడు, సీపీఎం, సిపిఐ నాయకులకు కూడా పేరు పేరునా నమస్కారాలు చెప్పారు. 

వైకాపా నాయకులకు కూడా నమస్కారాలు చెప్పమని తన సంస్కారం చెబుతోందని ఆయన అన్నారు. అంటే మిగిలిన పార్టీ లకు నమస్కారించాలంటే సంస్కారం అవసరం లేదా? 

రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అన్యాయం చేసిన కాంగ్రెస్ కు దండాలు పెట్టొచ్చుకోవచ్చు ఏ అభ్యంతరం లేకుండా, విభజనకు మద్దతు ఇచ్చి, తన వంతు సాయం చేసిన భాజపాకు దండం పెట్టేయచ్చు ఏ తటపటాయింపు లేకుండా. 

కానీ వైకాపా కు దండం పెట్టాలంటే సంస్కారం ప్రోత్సహించాలి. అప్పుడు కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి అభ్యంతరం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మాత్రం చెబుతాం. దీన్ని బట్టే తెలుస్తోంది, పవన్ సంస్కారం ఏ మేరకు అన్నది.