ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇండియాలో ఈ ఏడాది ఇప్పటివరకు బిగ్గెస్ట్ గ్రాసర్ ఇదే.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఏపీ-నైజాంలో ఈ సినిమా హోల్డ్ కొనసాగుతోంది. ఆదివారం కూడా మంచి వసూళ్లు రావడంతో 3 రోజుల్లో దాదాపు 48 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది రాధేశ్యామ్. నైజాంలో ఈ సినిమాకు 22 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.
మిగతా భాషల్లో మాత్రం ప్రభాస్ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తమిళ్, మలయాళంలో రాధేశ్యామ్ ఫెయిలైంది. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకు నెగెటివ్ టాక్ గట్టిగా వినిపించింది. కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఓవరాల్ వసూళ్లు తగ్గడానికి ఇదొక ప్రధాన కారణం.
ఈ సినిమాకు ఇంకొక్క వీకెండ్ మాత్రమే టైమ్ ఉంది. రాబోయే శుక్ర-శని-ఆది వారాల్లో రాధేశ్యామ్ గట్టిగా ఆడాలి. ఇంకా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ కొట్టాలి. లేదంటే, అవతలి వారానికి (25వ తేదీ) ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అప్పుడిక రాధేశ్యామ్ కు స్కోప్ ఉండదు. మొదటి వారంతం రాధేశ్యామ్ కు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 22 కోట్లు, సీడెడ్ – 6.65 కోట్లు, ఉత్తరాంధ్ర – 4.15 కోట్లు, ఈస్ట్ – 3.87 కోట్లు, వెస్ట్ – 2.98 కోట్లు, గుంటూరు – 4.06 కోట్లు, కృష్ణా – 2.34 కోట్లు, నెల్లూరు – 1.88 కోట్లు