పోలవరంపై సీఎం ఫోకస్.. టీడీపీ నేతల్లో గుబులు

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై ఓసారి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ తర్వాత ప్రాజెక్టు తీరుతెన్నులు, గడిచిన ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ మేరకు జగన్…

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై ఓసారి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ తర్వాత ప్రాజెక్టు తీరుతెన్నులు, గడిచిన ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ మేరకు జగన్ పోలవరం సందర్శన తేదీ ఖరారైంది.

ఎల్లుండి (20న) పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు సీఎం జగన్. సమీక్షలో అధికారులు చెప్పిన అంచనాలకు తగ్గట్టు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో లేదో పరిశీలించనున్నారు. కుడి-ఎడమ కాలువల నిర్మాణంలో పురోగతితో పాటు.. జలాశయం నిర్మాణం తీరుతెన్నులను పూర్తిస్థాయిలో పరిశీలించబోతున్నారు. అక్కడికక్కడే భూసేకరణ, పునరావాసంపై కూడా అధికారులతో సమీక్షించబోతున్నారు.

పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జగన్ ఇప్పటికే కూపీలాగారు. ఎక్కడ, ఏ స్థాయిలో అవినీతి జరిగిందనే విషయాన్ని అధికారులు ఇప్పటికే జగన్ కు లెక్కలతో సహా సమర్పించినట్టు తెలుస్తోంది. తామే ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రకటించుకున్న గత టీడీపీ ప్రభుత్వం, కేంద్రానికి దొంగ బిల్లులు సమర్పించి కోట్లు దండుకుందనే విషయాన్ని అధికారులు పూసగుచ్చినట్టు జగన్ కు వివరించారు.

ప్రాజెక్టులో కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను పునఃసమీక్షించాలని జగన్ ఇదివరకే నిర్ణయించారు. అంచనా వ్యయాన్ని కాస్త తగ్గించడంతో పాటు.. పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్రానికే అప్పగించే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. 90శాతం నిధుల్ని కేంద్రమే భరిస్తుంది. కాబట్టి దీన్ని కేంద్రానికే అప్పగిస్తే మరింత నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి అవినీతి మరకలు అంటవని కూడా జగన్ భావిస్తున్నారు. అయితే అంతకంటే ముందు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల్ని వెలికితీయాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే అందిన అంతర్గత నివేదికలతో పాటు మరిన్ని రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలు ప్రారంభిస్తారు.

పోలవరం పేరెత్తిన ప్రతిసారి టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద కుంభకోణం పోలవరం ప్రాజెక్టులోనే జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరంపై జగన్ ఫోకస్ పెట్టడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!