43 కోట్ల‌కు అమెరికా పౌర‌స‌త్వం.. ఖ‌రీదా, చౌకా?

రెండో ద‌ఫా అమెరికా అధ్య‌క్షుడు అయ్యాకా డొనాల్డ్ ట్రంప్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు!

రెండో ద‌ఫా అమెరికా అధ్య‌క్షుడు అయ్యాకా డొనాల్డ్ ట్రంప్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు! గ‌త పాల‌కుల విధానాల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ, త‌మ‌ను నిండా ముంచేస్తున్నాడు అంటూ కొన్ని దేశాలు వాపోతున్నా ట్రంప్ త‌గ్గ‌డం లేదు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఉక్రెయిన్ కు వ్య‌తిరేక ఓటు ద్వారా ట్రంప్ అమెరికా ద్వంద్వ వైఖ‌రిని ప్ర‌పంచానికి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు! ఉక్రెయిన్ ను యుద్ధానికి పురికొల్పిందే అమెరికా అనే విమ‌ర్శ‌లు ఉన్నా, ఇన్నాళ్లూ ఉక్రెయిన్ కు అమెరికా ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా ఇచ్చిన స‌హ‌కారం ఎంత ఉన్నా.. ప్ర‌స్తుతానికి ట్రంప్ చేతులు దులిపేసుకున్నాడు! మ‌రీ దీని వ‌ల్ల అమెరికా ప‌లుచ‌న కాదా అంటే.. అయితే కానీ అన్న‌ట్టుగా దాని వ‌ల్ల పోయేదేం లేద‌న్న‌ట్టుగా అమెరికా అధ్య‌క్షుడు వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నాడు.

ఇదే ఊపులో మ‌రో బంప‌ర్ స్కీమ్ ను అనౌన్స్ చేశాడు ట్రంప్. అదే గోల్డ్ కార్డ్ వీసా. ఇది సింపుల్. మీ ద‌గ్గ‌ర ఓ ఐదు మిలియ‌న్ డాల‌ర్లు ఉన్నాయా? భార‌త ద్ర‌వ్య‌మానంలో చెప్పాలంటే నేటి డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ప్ర‌కారం జ‌స్ట్ ఓ 43 కోట్ల రూపాయ‌లు! ఆ డ‌బ్బులుంటే దాన్ని చెల్లించేసి అమెరికా పౌర‌స‌త్వాన్ని కొనేసుకోవ‌చ్చు! ఈ మేర‌కు అమెరికాలో నివ‌సించ‌డానికి అనుమ‌తిని జారీ చేస్తూ ట్రంప్ కొత్త చ‌ట్టం ప్ర‌కటించాడు. ఇది వ‌ర‌కూ ఈ త‌ర‌హాలో ఉండిన మ‌రో చ‌ట్టానికి స్వ‌స్తి ప‌లుకుతూ ట్రంప్ ప్ర‌భుత్వం కొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది.

1990లో అమెరిక‌న్ ప్ర‌భుత్వం చేసిన చ‌ట్టం ప్ర‌కారం.. ఎవ‌రైనా స‌రే ఒక మిలియ‌న్ డాల‌ర్ల మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్టి, క‌నీసం ప‌ది మందికి ఉద్యోగ క‌ల్ప‌న చేసి, ఏడు సంవ‌త్స‌రాల పాటు దాన్ని కొన‌సాగిస్తే.. వారికి అమెరికా పౌర‌స‌త్వం ల‌భించేలా అప్ప‌ట్లో పేర్కొన్నారు. అమెరికాకు విదేశీ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డానికి నాడు ఆ చ‌ట్టాన్ని చేశారు. అటు ఉద్యోగాల క‌ల్ప‌న‌, మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల ఆహ్వానానికి ఆ చ‌ట్టం చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ దాన్ని ర‌ద్దు చేస్తూ, కొత్త చ‌ట్టం ప్ర‌క‌టించారు.

ఇది రెడీ మేడ్ ఆఫ‌ర్. క్యాష్ క‌ట్టు అమెరికా పౌర‌సత్వం ప‌ట్టు అన్న‌ట్టుగా 43 కోట్ల రూపాయ‌ల పైకం క‌డితే చాలు! ఇక మీరు ప్ర‌త్యేకంగా వ్యాపారం, పెట్టుబడి ఇలాంటివి అవ‌స‌రం లేకుండా, ఎవ‌రికీ ఉపాధి క‌ల్ప‌న చేయాల్సిన అవ‌స‌రం లేకుండా గ్రీన్ కార్డును పొందిన‌ట్టే! 1990చ‌ట్టం ప్ర‌కారం అయితే.. మీరు ఆ మిలియ‌న్ డాల‌ర్ల మొత్తాన్ని ఎక్క‌డ నుంచి అప్పు తెచ్చుకున్నా, అనేక మంది ద్వారా జ‌మ చేసి ఉన్నా ఫ‌ర్వాలేదు. అయితే ట్రంప్ చ‌ట్టం ప్ర‌కారం.. మొత్తం క్యాష్ చెల్లించాలి! అప్పు కానీ, మంది ద్వారా జ‌మ‌చేసిన డ‌బ్బు కాకూడ‌దు! క్యాష్ అండ్ క్యారీ!

దీని వ‌ల్ల లాభం ఏమిటి అంటే.. అలా డ‌బ్బున్న వాళ్లు అమెరికాకు వ‌స్తే వాళ్లు బాగా ఖ‌ర్చు పెడ‌తార‌ని, ప‌న్నులు ద‌క్కుతాయ‌ని.. దాని వ‌ల్ల దేశానికి లాభ‌మ‌ని ట్రంప్ సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు. మ‌రి ఈ ఆఫ‌ర్ కు ఎలాంటి స్పంద‌న ఉంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌కం. 43 కోట్ల రూపాయ‌ల స్థాయిలో చెల్లించ‌గ‌ల వారు అమెరికానే ఎంచుకుంటారా? ఇంత‌క‌న్నా త‌క్కువ పెట్టుబ‌డితో స్వాగ‌తం ప‌లికే దేశాలు కూడా ఉన్నాయి! అయితే ట్రంప్ ఆఫ‌ర్ కు కొన్ని దేశాల నుంచి అయినా స్పంద‌న ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి.

15 Replies to “43 కోట్ల‌కు అమెరికా పౌర‌స‌త్వం.. ఖ‌రీదా, చౌకా?”

  1. మల్లయ్య లను కొంటాం.. నీరవ్ లను కొంటాం.. దావూద్ లను కొంటాం

    అవినీతి తో పుచ్చి పోయిన పొలిటిషన్ లను కొంటాం

    రండి బాబు రండి

  2. అమెరికా ఇంతకు ముందులా లేదు.

    అందులో సగం ఇస్తే ఈరోజే నా గ్రీన్ కార్డు ఇచ్చేసి ఇండియా వచ్చేస్తా

  3. మీగతా దేశాల్లో నేరాలు, మోసాలు చేసి వేల కోట్లు సంపాదించిన ప్యాలెస్ పులకేశి లాంటి వాళ్ళుకి 50 కోట్లు అంటే చిల్లర కింద లెక్క. పైగా వాటికన్ లింక్ లు ద్వారా హవాలా ద్వారా ఇటలీ, మెక్సియో మాఫియా వాళ్ళ డబ్బు నీ చర్చ్ నీ పెట్టుకుని అప్పట్లో తెరెసా అనే ఆవిడ చేసినట్లు రోటేశన్ చెయ్యొచ్చు.

    1. ఇటలీ మాఫియా అతను అమెరికా లో చర్చ్ కి ఒక మిలియన్ డాలర్లు విరాళం కింద ఇస్తాడు.

      ఇలాటి వాటిని మత కారణం వలన యే ప్రభుత్వం అడ్డుకోడు.

      ఆ చర్చ్ వాళ్ళు ఇటలీ లో పేదలకు సేవ పేరుతో , ఆ మాఫియా వాళ్ళు పెట్టిన ngo కి తమ కమీషన్ మినహాయించుకుని మిగతా డబ్బు డొనేట్ చేసారు. దాంతో ఆ మాఫియా బాస్ కి తన బ్లాక్ మన్నీ వైట్ లో మారుతుంది. చర్చ్ వాళ్ళకి తమ కమేశన్ వస్తుంది . ఇలా అప్పట్లో ప్రపంచం లో నీ మాఫియా, నేరస్తుల అందరు తెరెసా ద్వారా ఇలాంటి డబ్బు రొటేషన్ చేశవల్లు. ఆ బాగోతం బయట పడకుండా మీడియా ద్వారా ఆమె ఏదో సేవ చేస్తుంది అని ప్రచారం చేశవల్లి.

Comments are closed.