దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కూప్ప కూలింది. ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసం అవ్వడంతో పాటు ఒకరు మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని.. టెర్మినల్ రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని.. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రమాదం వల్ల మధ్యాహ్నం 2 వరకు టెర్మినల్-1 నుంచి డిపార్చర్‌కు బ్రేక్ ఇచ్చి.. పునరుద్ధరణ పనుల అనంతరం సర్వీసులను కొనసాగించనున్నారు. కాగా ఢిల్లీలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
verri pushpam akariki shekka 2.0 asalu lagane nee site kuda tayaru ayyindi
comments chudu epatti nundi vastunayooooo