మోడీ సర్కార్ నిర్ణయాలకు ఇది లిట్మస్ టెస్ట్!

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ స్థానిక పార్టీలు ఈ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నాయి. 370 వ అధికరణం రద్దు చేసిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను…

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ స్థానిక పార్టీలు ఈ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నాయి. 370 వ అధికరణం రద్దు చేసిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేసి.. అక్కడి వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న వ్యతిరేకతలు బాహ్యప్రపంచానికి తెలియనివ్వని నియంత్రణల మధ్య ఉంచి చాన్నాళ్లపాటు మోడీ సర్కార్ కేంద్ర పాలన సాగించింది.

జమ్మూ కాశ్మీర్లో ఇదివరకటి కంటే పూర్తి ప్రశాంతమైన వాతావరణం ఉన్నదని కేంద్ర పెద్దలు చెబుతూ వచ్చారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని పూనుకుంటూ ఉండటంతో.. మోడీ సర్కార్ నిర్ణయం పట్ల ప్రజల తీర్పు ఏమిటో తేలుతుంది.

ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ తో జట్టుకట్టి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా మెహబూబా ముఫ్తీ సారధ్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పిడిపి కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. భాజపా వ్యతిరేక పార్టీలు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను సాధించడం, స్వయం ప్రతిపత్తిని తిరిగి తీసుకురావడం అనే హామీలతో ఎన్నికలకు వెళుతుండడం విశేషం. నిజానికి వారు మేనిఫెస్టోలో చెబుతున్న అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి అయినప్పటికీ వారు అసెంబ్లీ ఎన్నికలకు ఆ హామీలతో ముందుకు వెళుతున్నారు.

పిడిపి తమ మేనిఫెస్టోలో పాకిస్తాన్ తో ప్రాంతీయ సహకారానికి ప్రయత్నిస్తామని కూడా ప్రకటిస్తోంది. వారితో చర్చలు జరుపుతామని అంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శారదా పీఠానికి మార్గం తెరవాలని కోరుకుంటున్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టడం అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం గా కనిపిస్తుంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ ఎన్సీ కూటమితో సీట్లు పంచుకునే ఆలోచన మాత్రం తమకు లేదని మెహబూబా ముఫ్తీ అంటున్నారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ ఆ కూటమి నెరవేరుస్తామని హామీ ఇస్తే గనుక అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండానే తప్పుకుంటానని ఆమె సవాలు చేస్తున్నారు. విపక్షాల మధ్య అనైక్యతకు ఇదొక రుజువుగా నిలుస్తుంది.

భారతీయ జనతా పార్టీ తనదైన వ్యూహంతో ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆలోచిస్తుంది. విజయం దక్కితే వారి నిర్ణయానికి జమ్ము కాశ్మీర్ ప్రజలు నీరాజనం పట్టినట్లే అవుతుంది. విజయం దక్కకపోయినా వారు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. చెప్పుకోదగినన్ని సీట్లు సాధిస్తే చాలు.. బిజెపి కాశ్మీర్ ప్రాంతంలో పాతుకు పోతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

11 Replies to “మోడీ సర్కార్ నిర్ణయాలకు ఇది లిట్మస్ టెస్ట్!”

  1. అక్కడ ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు, జమ్మూ ప్రాంతం లో గెలవొచ్చు, లడక్ లో కూడా కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం వల్ల ఏవో ప్రయోజనాలు పోయాయి అని స్థానిక ఎన్నికల్లో బీజేపీ ని ఓడించారు.

    1. లాడాఖ్ లోకసభ సీట్ ఎవరో ముస్లిం ఇండిపెండెంట్ గా గెలిచాడు, కాంగ్రెస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానం, మొత్తం రెండు లక్షల ఓట్లు కూడా లేవు.

        1. బీజేపీ చేసేవి దీర్ఘ కాలం లో మంచి ప్రభావం చూపిస్తాయి, కాని ప్రజలు ఇన్స్టంట్ స్వప్రయోజనాలు లేకపోవడం చూసి ఓడిస్తున్నారు, బీజేపీ సపోర్టర్ ని అయితే వాస్తవం రాయడానికేం!

  2. రోగి శరీరం లో వ్రణం వుంటే తీసి పడేసి ఆపరేషన్ చేసి రోగిని బతికిస్తాడు డాక్టర్.

    రోగి ఆ డాక్టర్ నీ గౌరవిస్తాడా లేదా అనేది రోగి యొక్క తెలివి నీ బట్టి వునుంది.

    ము*స్లిం అనేవాళ్ళు సహజంగా 98 శాతం తో*టి ఎ*డారి వా*ళ్ళకే మొగ్గ్గు చూపుతారు, మన దేశం ఉ*ప్పు తిన్న*టున్న సరే.

    ఇప్పటికీ కష్మర్ లో ఇండియా ఆ*ర్మీ కి వ్యతిరే*ఖంగా పాకి*స్తాన్ పం*దు లకి సహా*యం చేసే ఇండి*యా ము*స్లిమ్ పందు*లు ఎక్కువ.

  3. సబ్ కా సాత్ అన్నపడినుండి జనాలు హాత్ ఇచ్చేరు.. ఆ మాత్రం దానికి వీరేందుకు.. అందరూ చేసేది చెప్పేది అదే సోది కదా…

Comments are closed.