వాట్సాప్.. వాట్ హప్పెన్!

దిగ్గజ మెసేజింగ్ స‌ర్వీస్ వాట్సాప్ స‌ర్వీసుల‌కు భార‌త‌దేశంతో పాటు కొన్ని ఇత‌ర దేశాల్లో అంత‌రాయం క‌లిగింది. వాట్సాప్ సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో దేశ వ్యాప్తంగా యూజ‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. వాట్స‌ప్ నుండి మెసేజ్ చేసిన…

దిగ్గజ మెసేజింగ్ స‌ర్వీస్ వాట్సాప్ స‌ర్వీసుల‌కు భార‌త‌దేశంతో పాటు కొన్ని ఇత‌ర దేశాల్లో అంత‌రాయం క‌లిగింది. వాట్సాప్ సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో దేశ వ్యాప్తంగా యూజ‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. వాట్స‌ప్ నుండి మెసేజ్ చేసిన ఆ మెసేజ్ వెళ్లిందా లేదా అనేది యూజ‌ర్ల‌కు తెలియ‌డం లేదు.

ప్ర‌తి చిన్న దానికి సాంకేతిక‌పై అధార‌ప‌డిన జ‌నాలు వాట్స‌ప్ స‌ర్వీసుల అంత‌రాయం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ త‌లెత్తింద‌న్న దానిపై ఇంకా క్లారిటి రావ‌డం లేదు. ఇవాళ మధ్యాహ్నం 12.07 గంటలకు కొంత మంది యూజ‌ర్ల‌తో మొద‌లైన స‌మ‌స్య ఇప్పుడు 90 శాతం యూజ‌ర్లు స‌మ‌స్య ఎదుర్కొంటూన్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.

గ‌తంలో కూడా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్ లు కూడా సాంకేతిక స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నాయి. తొంద‌ర‌గానే మ‌ళ్లీ వాట్స‌ప్ లు యధావిధిగా ప‌ని చేస్తాయ‌ని అంటూన్నారు టెక్నికల్ వర్గాలు.