మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్స్ తో కొత్త ఊపిరి

మనిషి బతకడానికి ప్రాణవాయువు అవసరం. కరోనా రెండవ దశలో వీరవిహారం చేస్తూ ఏకంగా ఊపిరిని నొక్కేస్తూ మనిషి కధను ముగించేస్తోంది. దీంతో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కి  ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడుతోంది. ఈ నేపధ్యంలో…

మనిషి బతకడానికి ప్రాణవాయువు అవసరం. కరోనా రెండవ దశలో వీరవిహారం చేస్తూ ఏకంగా ఊపిరిని నొక్కేస్తూ మనిషి కధను ముగించేస్తోంది. దీంతో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కి  ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడుతోంది. ఈ నేపధ్యంలో ఎంతగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నా ఇంకా కొరతగానే ఉంటోంది.

ఈ విషమ పరిస్థితులలో విశాఖ నేవల్ డాక్ యార్డ్ మేము సైతం అంటూ రంగంలోకి వచ్చింది. ఏకంగా మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్స్ తయారు చేసి విశాఖలో కరోనా రోగులకు ఊపిరిపోతోంది. 

ఎక్కడ ఆక్సిజన్ అవసరం అనుకుంటే క్షణాలలో అక్కడికి వెళ్ళగలిగే ఈ ప్లాంట్స్ నిజంగా ప్రాణవాయువునే మోసుకొస్తున్నాయని చెప్పకతప్పదు.

కరోనా రోగుల పాలిట సంజీవినిగా ఈ మొబైల్ ప్లాంట్స్ ఉన్నాయని నగరవాసులు అంటున్నారు. వీటిని ప్రారంభించిన నేవల్ డాక్ యార్డ్ వైఎస్ అడ్మిన్ వీవీ సింగ్ కరోనా వేళ తమ వంతు ప్రయత్నం ఇంకా చేస్తామని చెప్పడం విశేషం. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.