రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్

ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుకునే అవకాశాలు వద్దనుకుంటే అసలు ప్రభుత్వ ఉద్యోగమే వద్దనుకుని ప్రైవేట్ ఉద్యోగం వైపో, వ్యాపారాల వైపో చూస్తే మంచిది.

“నువ్వు ఐదేళ్లే మంత్రివి. నేను చివరిదాకా ఐ.ఎ.ఎస్ నే”- ఒక మంత్రితో ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ అనే ఈ డైలాగ్ ఈ మధ్యన వచ్చిన ఒక సినిమాలోది. వినడానికి ఇలాంటివి బాగానే ఉంటాయి. కానీ వాస్తవమేంటి?

అసలు ఐఎఎస్ అవ్వాలనుకునే వాళ్లు ఏమి ఆశించి ముందడుగేయాలి?

తమని తాము ఉద్ధరించుకోవడానికా? లేక దేశాన్ని ఉద్ధరించాలనా?

రెండూనా?

అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి?

సివిల్ సర్వెంట్ లైఫ్ ఎలా ఉంటోంది? ఒక్క సారి చర్చించుకుందాం.

డిగ్రీ పాసయ్యాక సివిల్స్ కోసం ప్రిపేరయ్యే యువతని చూస్తుంటాం. హైదరాబాదులో చూస్తే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాల్లో కోచింగ్ సెంటర్స్ లో కనిపిస్తుంటారు. 700-1000 పోస్టుల కోసం దేశవ్యాప్తంగా 10-12 లక్షల మంది పోటీ పడుతుంటారు.

అయినా సరే..ఎవరి ఆశ వారిది, ఎవరి నమ్మకం వాళ్లది.

ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటూ ఎన్నో వలయాలు దాటి ఏ ఐ.ఎ.ఎస్సో, ఐ.పీ.ఎస్సో అయితే మరిచిపోలేని విజయంగా వేడుక జరుపుకుంటారు. కుటుంబసభ్యులు, మిత్రులు గొప్పగా చూస్తారు.

“మావాడు కలెక్టరవుతున్నాడండీ”, “మా అమ్మాయి ఐపీఎస్ ఆఫీసరండీ” అంటూ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతుంటారు.

కానీ ఆ సంతోషం ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? అదే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. ట్రైనింగ్ పూర్తయ్యి ఏ కలెక్టరుగానో నియామకం పొందాక..ప్రోటోకాల్, సిబ్బంది, సెల్యూట్లు కొట్టే పోలీసులు, అధికార నివాసం..అన్నీ బానే అనిపిస్తాయి. కొత్త పెళ్లి కూతురు అత్తారింట్లోకి రాగానే తొలి కొన్ని రోజులు బాగానే ఉంటాయి. తర్వాత అత్తమామల్ని బట్టి, భర్తని బట్టి ఆమె భవిష్యత్తు ఉంటుంది. బాగుంటే గొడవలేదు. లేకపోతే గృహహింసలో నలగాలి. గత కొంతకాలంగా చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ల పరిస్థితి అలానే ఉంటోంది. ఇంటి కోడలికి గృహహింస మాదిరిగా, సివిల్ సర్వెంట్స్ కి రాజకీయహింస.

ఒకప్పుడు సివిల్ సర్వెంట్స్ చెప్పినట్టు మంత్రులు నడుచుకునేవారు. వారిని గౌరవించేవారు. తమకన్నా చదువుకున్నవాళ్లన్న మర్యాద కొంత, ఆ కుర్చీకి ఇచ్చే గౌరవం ఇంకొంత! కానీ రానురాను సీను మారుతూ వచ్చింది.

కలెక్టర్లు, పోలీసులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పినట్టు నడవాల్సి వస్తోంది. తప్పని తెలిసినా తప్పు చేయాల్సి వస్తోంది. రాజకీయ నాయకులు తమ తప్పుల్ని ఈ ఐఏఎస్, ఐపీఎస్ ల ఖాతాలోకి వేసేస్తున్నారు చట్టబద్ధంగా.

ఫలానా ఫైలు మీద సంతకం పెట్టడం అవినీతి అని తెలిసినా, ఫలానా వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరచకుండా వదిలేయడం న్యాయసమ్మతం కాదని తెలిసినా రాజకీయ అధికారానికి తలొగ్గి ఆ తప్పులు చేయాల్సి వస్తోంది.

“చేయను” అంటే ఊరుకోరు. హరాస్మెంట్ మొదలవుతుంది. మారుమూల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడమో, లేక అవినీతి అరోపణ చేసి బురద చల్లడమో చేస్తారు. కనుక కెరీర్ కోసం చచ్చినట్టు రాజకీయాన్ని భరిస్తున్న బ్యూరోక్రాట్స్ ఉన్నారు.

పోనీ వాళ్లు చెప్పినట్టు చేసేద్దామని చేసేసినా, ప్రభుత్వం మారగానే ఈ సివిల్ సర్వెంట్స్ ఇరుక్కుంటున్నారు. కొత్త ప్రభుత్వం వీళ్ల తప్పుల్ని బయటికి తీసి అప్రతిష్టపాలు చేస్తుంది. జైలు పాలు కూడా చేస్తుంది.

ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు..ఏ ప్రభుత్వమైనా సరే…ఇదే తంతు.

పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ..స్త్రీ పురుష బేధం లేకుండా బ్యూరోక్రాట్స్ చాలామంది అధికారానికి తలొగ్గి ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. ఎన్నో చూసాం, చూస్తున్నాం.

అలాగని ఈ ఇబ్బంది కేవలం ఐఎఎస్, ఐపీఎస్ లకి మాత్రమే అనుకోనక్కర్లేదు. ప్రభుత్వంలో ఏ విభాగంలో ఏ కేటగరీలో పనిచేస్తున్నా, ఏదో ఒక రోజు రాజకీయబలం తప్పు చేయమని కోరుతుంది. నేరమని తెలిసినా చేయాల్సి వస్తోంది. పాపమని తెలిసినా మోయాల్సి వస్తోంది. అదే ఇక్కడ పాయింటు.

చట్ట రిత్యా తప్పైతే నేరం..దొరికితే శిక్ష పడుతుంది.

పాపభీతి ఉన్నవాళ్లకి ఇంకా కష్టం. చేసిన చర్య, పెట్టిన సంతకం ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించినది కావొచ్చు, బాధితులకి వ్యతిరేకమైన నిర్ణయం కావొచ్చు…ఇంకేదైనా కావొచ్చు…గిల్టీ ఫీలింగుతో జీవితాంతం గడపాలి.

ఒకప్పుడు ప్రభుత్వోద్యోగం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చేది అన్నట్టుండేది.కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే నేరం, పాపం చేయడానికేనా అన్నట్టుగా మారుతోంది.

ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ ని, రెవెన్యూ శాఖని, ఇతర శాఖల్ని కరప్ట్ చేస్తున్నది రాజకీయశక్తులు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరికీ వాటాలు వెళ్లిపోతాయి. ఎందుకంటే అందర్నీ కరప్ట్ చేసేస్తే ఎవ్వడూ మాట్లాడడు..లేకపోతే విషయాలు బయటికి పొక్కుతాయి..అదే లాజిక్. అది అక్రమమైన డబ్బని తెలిసినా తీసుకోవాలి. వద్దని సిన్సియారిటీ చూపిస్తే ఆ సిన్సియారిటీ మీద బురద చల్లి “అవినీతిపరుడు” ముద్ర వేసినా వేయొచ్చు, లేదా పనిష్మెంట్ గా అవసరం లేకపోయినా ఏ మారుమూల ప్రాంతానికో ట్రాన్స్ఫర్ కావొచ్చు. మొదట భయంతో ఇబ్బంది పడినా, తర్వాత “నలుగురితో పాటు నారాయణ” అనుకుని డబ్బు యావలో పడిపోయిన వాళ్లే అంతా. అందరినీ కాకపోయినా కొందరినైనా పాపభీతి పీడిస్తూ ఉంటుంది.

కనుక ఇక్కడ చెప్పేది ఒక్కటే…నేరాలు, పాపాలు తెలిసి చేయడానికి.. కేసులు, జైళ్లు, అవమానాలు ఎదుర్కోవడానికి..పర్యవసానాలు ఎంత దయనీయంగా మారినా భరించడానికి సిద్ధంగా ఉంటేనే బాగా కాష్టపడి సివిల్ సర్వెంట్స్ అయ్యే ప్రయత్నాలు చేయొచ్చు.

ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుకునే అవకాశాలు వద్దనుకుంటే అసలు ప్రభుత్వ ఉద్యోగమే వద్దనుకుని ప్రైవేట్ ఉద్యోగం వైపో, వ్యాపారాల వైపో చూస్తే మంచిది.

అందరు సివిల్ సర్వెంట్స్ కి అవినీతి మరక అంటేస్తుందని కాదు కానీ, అవకాశాలు పుష్కలంగా పెరుగుతున్నాయి. కోరి అవినీతిపరులయ్యే వాళ్ల గురించి చెప్పడానికేం లేదు. కోరుకోకపోయినా అవినీతి కూపంలో ఇరుక్కోవాల్సి వచ్చే వాళ్ల గురించి, హరాస్మెంట్లు, శిక్షలు ఎదుర్కునే వాళ్ల గురించే ఇక్కడ చెప్పేది.

ఇది చాలా బాధతో రాస్తున్నది. రాజకీయం మారాలి. వ్యవస్థ మారాలి. ఆ మార్పు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

– శ్రీనివాసమూర్తి

38 Replies to “రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్”

  1. జీవితం లో విలువలు వా టీ ఆవ శ్య కథ. అన్ని ,2025. లో అర్థం అవుతున్నాయి వింత. అసలు ఆయన మీదకు రాయి విసర్లేదు కొంత మంది అభిమానులు తమ ప్రేమని ఇలా express chesaaru ani. Savnagam anna anandu

  2. Nee. Bondaa raaa. Pichi lanzaa kodakaa

    students. Wanting to be a beurocrat. Is a wrong. Concept

    only country in the world where a clever student. Want to be a beurocrat

    no country respects beurocrats. Except india

    because British created. A legacy of beurocrats looking at the rest of the people as slaves

    stupid Indians

  3. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటే ఇదేనేమో.. మీరు బాధ పడాల్సిన టైమ్ ఇది కాదు, ఈ ఆర్టికల్ రాయాల్సిన టైమ్ ఇది కాదు.. ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లు బలైపోయారో మీకు తెలియని విషయం కాదు.. అప్పట్లో రాసుంటే .. కొంచెం ఉపయోగమన్నా ఉండేది.. ఇప్పుడు రాసి వేస్ట్ .. ఇప్పుడందరూ చట్టం ప్రకారం తమ పని తాము చేసుకుంటున్నారు.

  4. ఒక్కో కలెక్టర్ పని చేసి పది ఏళ్ళు తిరక్క మునుపే మూడు నుంచి నాలుగు వేల కోట్లు విదేశాలకి తరలిస్తున్నారు అలాంటప్పుడు ఇవన్నీ తప్పవు , వాళ్ళేమి సుద్దపూసలు కాదు

  5. మన పుణ్యాన కొంత మంది ఆఫీసర్స్ శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళ్లి వొచ్చారు పాపం .. వాళ్ళ గురించేనా మూర్తి గారు ..

  6. Rule of Governance and Rule of Law follow aite yemi problem vundadu.. kutsita buddhi toh panikimalina vaatiki aasapadatam valla kontamandi ki ee issues vstayi.. Vinasakale vipareeta buddi.. chesukunnodiki chesukunnanta.. karma phalitam anubhavinchalsinde murthy gaaru.. 5% IAS lu IPS lu kooda effect avvatam ledu.. migilina vaaru ela manage chestunnaru mari…answer akkade vundi

  7. Hitec days ఇవి…pressures ni audio video spy cams call records చేసి media leak చేస్తే starting లోనే ias ips లు safe zone లో ఉండచ్చు…వీళ్ళకే ముందు దురాశ భయం…మనసుంటే మార్గం ఉంటుంది..

  8. ABV గారి విషయమె తీసుకొండి. ఈయన అసలు కొనని ఇస్రాయిల్ పరికరాలలొ ఎదొ అవినీతి చెసాడు అంటూ వెదించారు! సుప్రెం కొర్ట్ చెప్పినా వినలెదు! ABV మీద చెసిన దాషికాన్ని మిగతా IAS/IPS లని బెదిరించటానికి వాడుకున్నరు! కొందరు IAS/IPS లు అప్పట్లొ రాజకీయ నాయకులకి లొంగి అక్రమ పనులు చెసారు! ఇప్పుడు ప్రభుత్వం మారటం తొ దరికిపొయి అనుభవిస్తున్నారు!

    .

    5 ఎళ్ళు ఎంతొ కష్టపడినా ABV మీద ఎ చర్యా తీసుకొలెకపొయారు, అయన్ని ఉద్యొగం నుండి తీయలెక పొయారు! అయన నిబద్దతె అయన్ని కాపాడింది! Y.-.C.-.P నాయకులకి లొంగి అక్రమ పనులు చెసినవారు మాత్రం అడ్డంగా దొరికిపొయారు.

  9. ప్యాలస్ పులకేశి విసిరెస్ బిచ్చం ఎరుకోడం కోసం ప్యాలస్ ముందు క్యూ కట్టిన ఐఏఎస్ , ఐపీఎస్ లు ఎంతో మంది.

    అప్పటి CS

    అప్పటి డీజీపీ

    మిగతా ఒకటే కులం తోక అధికారులు

    ప్యాలస్ పులకేశి కి బానిసగా బతకడం కోసం మే ఐఏఎస్ చదివినా శ్రీలక్ష్మి గారి లాంటి వాళ్ళు.

  10. ఇంకా ఎక్కడి మారుమూల ప్రాంతాలు నాయనా? చాలా వరకు ఉద్యోగాలు స్థానికమైనవే. ఎన్ని ట్రాన్స్ఫర్‌లు అయినా జిల్లా దాటి కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ట్రాన్స్‌ఫర్లకి భయపడి ఎవడూ రాజకీయ నాయకులకి తలొగ్గట్లేదు. 90 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా అవినీతిపరులు. ఇంకా చెప్పాలంటే వీళ్లే రాజకీయనాయకులకి చిట్కాలు కూడా చెప్తుంటారు ఎక్కడెక్కడ ఎలా నొక్కెయ్యచ్చో, ఎలా చేతికి మట్టి అంటకుండా తప్పించుకోవచ్చో..

    అయినా ఎక్కడో బీహార్, అస్సాం నించి పనులకోసం కుటుంబాలని కూడా వదిలి వచ్చి ఆంధ్ర, తమిళనాడు, కేరళ లో కూడా నీతిగా సంపాదించుకుంటున్న వాళ్లు ఉంటే, ఉన్న రాష్ట్రం లో పక్క ప్రాంతానికి వెళ్లలేక పాపం బాధ ని భరిస్తూ లంచాలు తీసుకుంటున్నారా మన సిన్సియర్ అధికారులు.. జోకులు ఇంక ఎక్కడైనా చెప్పు..

  11. ప్రభుత్వ ఉద్యోగుల ఫిలాసఫీ ఒక్కటే.. ఆఫీసుకి వచ్చినందుకు జీతం… పని చేసినందుకు లంచం

  12. అది ప్రభుత్వ వుద్యోగం మాత్రమే . గెలిచిన ప్రభుత్వం చెప్పినట్లు చట్టబధంగా పని చేయటం వారి విధి . వాళ్ళు ఎప్పుడూ గెలిసిన పార్టీ ప్రభుత్వానికి , గెలిసిన నాయకులకి లోబడి ఉండవలసిందే .

  13. మన తుగ్లుక్ ప్రక్కన చేరితే వాళ్ళు ఐఏఎస్ , IPS , లీడర్, హీరో, ఎంత పెద్ద బిజినెస్ మాన్ లు అయినా మట్టి కొట్టుకు పోవాల్సిందే .

  14. కాంతి టా టా, ఆంజనేయులు, విశాల్ గున్ని ..

    వీళ్లి కావాలనే తొక్కించుకున్నారు, రాజకీయ నాయకులు విసిరేసీ బిచ్చం కోసం.

    శ్రీ లక్ష్మి గారు లాంటి ఐఏఎస్ లు మరీ దారుణం.

    టీడీపీ ప్రభుత్వాల్లో ఒక వెలుగు వెలిగారు. ఒక ఐఏఎస్ అంటే ఇలా వుండాలి అనే గౌరవం వుండేది ఆమె నీ చూస్తేనే.

    కానీ ఎప్పుడైతే ఒక ప్యాలస్ పులకేశి గాడి కాళ్ళు చెప్పులు నాకడం మొదలు పెట్టారో , వాడు చెప్పిన అట్లు అలా తల ఆడించి అవినీతికి సై అన్నారో, అప్పుడే తమ గౌరవం కోల్పోయారు. ఆమె బాట లోనే

    రెడ్డి కుల గజ్జి వలన మాత్రమే ప్యాలస్ పులకేశి ప్రభుత్వం లో పెద్ద పదవి లు పొందిన ఐఏఎస్, ఐపీఎస్ లు ఎందరో! వాళ్ళకి జనాల నుండి గౌరవం లేదు.

    1. ముసలోడు అజయ్ రెడ్డి కళ్ళం మరీను.. తమకి పెద్ద పదవికి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం కి వ్యతిరేకంగా కేవలం తనకి వున్న విపరీతమైన రెడ్డి కుల గజ్జి తో , అప్పట్లో తాను విన్న టీడీపీ ప్రభుత్వం లో అధికార రహస్యాలు అన్ని రాత్రి.కి వెళ్లి అప్పట్లో అధికారం లేని ప్యాలస్ పులకేశి కి చెప్పేవాడు. వాడు పడేసే బిచ్చం వేరుకునే వాడు. ఆఖరికి వివేకా మర్డర్ ప్రత్యక్ష సాక్షి అయ్యి వింది కూడా , తనకి చెముడు వలన మాటలు వినపడలేదు అని అబద్దం చెప్పాడు, ఈ ఐఏఎస్ మాటలకే సిగ్గు తెచ్చిన కులగజ్జి బిచ్చగాడు.

    1. అమ్మా లలితగారూ టీడీపీ వల్ల రాజకీయం దరిద్రం అయిందా. సీతారామాంజనేయులు చంద్రబాబు 95 సమయం లో గుంటూరు SP గా పనిచేసారు. ఈ విషయం తెలుసా మీకు. ఆ రోజుల్లో రౌడీలకే కాదు అప్పటి రాజకీయ నాయకులకి కూడా టెర్రర్. అంతెందుకు స్వయానా పంచాయతీ మినిస్టర్ శివప్రసాద్ కూడా అయన బాధితుడే. అయినా CBN SP గారికే సపోర్ట్ చేశారు. మరి 2019-24 లో ఏమైంది అయన ప్రతిభ? ఇంక 2004-14 మధ్యలో డజన్ల కొద్దీ ఐఏఎస్ లు కేసుల్లో ఇరుక్కున్నారు లెవెన్ మోహన్ రెడ్ది పుణ్యమా అని.

  15. Moorthy.. first meeru dabbukosam ilanti articles rayatam manesthe.. adi chalamandiki spoorthy… avutundi..

    Straight ga nilabadandi… pen ni ammukokandi…..

    Neethulu cheppakandi ( including me )… evvaru vinaru

    aacharinchi chupinchandi….. ventapadi vastaru…

Comments are closed.