అన్నకు మంత్రి పదవి వద్దన్న పవన్?

అన్న అయినా, మరెవరు అయినా, తమకు సరిసమానంగా మరెవరు వుండడం రాజకీయాల్లో ఎవరూ అంగీకరించరు.

జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి అన్నది దాదాపు ఆరేడు నెలలుగా వార్తల్లోనే వుంటూ వస్తోంది. ఇప్పుడు దాదాపు టైమ్ వచ్చింది. కానీ వున్నట్లుండి మరో వార్త కూడా వచ్చింది. అన్నకు కార్పొరేషన్ చాలు అని సాక్షాత్తూ నాగబాబు సోదరుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నే అభిప్రాయపడ్డారని, ఆ మేరకు చంద్రబాబుకు సూచించారని వార్తలు వచ్చాయి. ఇది చాలా ఆశ్చర్యకరంగా వుంది.

నిన్నటి వరకు ఈ వార్తలు లేవు. ఈ దఫా మండలికి నాగబాబు వెళ్లేది ఖాయమని, మంత్రి కావడం పక్కా అని వార్తలు అప్పటికే వచ్చేసాయి. బాబు..పవన్ ఇద్దరూ గంటసేపు కసరత్తు చేసారని, అందులో నాగబాబు వ్యవహారం కీలకమని వార్తలు వచ్చాయి. తీరా, మంగళవారం సాయంత్రం ఉరుము లేని పిడుగులా సడెన్ గా నాగబాబుకు ఈ దఫా మండలి చాన్స్ లేదని తెలుగుదేశం మద్దతు కీలక మీడియాలో వార్తలు రావడం మొదలైంది. జనసేన శ్రేణులు అదంతా తప్పు అని కొట్టిపారేసాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

తెల్లవారేసరికి కీలక ప్రధాన పత్రికల్లో కూడా చాలా కన్వీనియెంట్ వార్తలు కనిపించాయి. పవన్ కళ్యాణ్ నే స్వయంగా, తన అన్నకు మంత్రి పదవి వద్దు, కార్పొరేషన్ చాలు అని కోరారని ఆ వార్తల సారాంశం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. మంత్రి పదవి వద్దు..కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలి అని ఎవరైనా అంటారా? పైగా ఇంకా గమ్మత్తైన పదజాలం కూడా వాడారు…’కీలకమైన కార్పొరేషన్ పదవి..రాష్ట్రం అంతా పర్యటిస్తూ..పర్యావరణానికి దోహదం చేసే పదవి’ అంట.

ఎంత కన్వీనియెంట్ గా వండి వార్చినా, ఇలాంటి కార్పొరేషన్ పదవి అలంకార ప్రాయం తప్ప మరెందుకు కాదని రాజకీయాలు పరిశీలించేవారికి అర్థమైపోతుంది.

ఇక్కడ క్లారిటీ వస్తోంది. అన్న అయినా, మరెవరు అయినా, తమకు సరిసమానంగా మరెవరు వుండడం రాజకీయాల్లో ఎవరూ అంగీకరించరు. అంతగా ఇష్టపడరు. అది కొత్తేమీ కాదు. అదే మరోసారి ప్రూవ్ అవుతుంది అనుకోవాలి.

పైగా జనసేన అంటే అన్న, తమ్ముడేనా..మరెవరు లేరా..వాళ్లకు మంత్రి పదవులు వద్దా అన్న విమర్శ రావచ్చు. అందువల్ల ఇది ముందు జాగ్రత్త కూడా కావచ్చు.

అంతా ఓకె.

ఎన్నికల టైమ్ లో ప్రతి దాంట్లో వన్ థర్డ్ మన వాటా.. దాన్ని కచ్చితంగా అడిగి తీసుకుంటాం. అందరికీ పదవులు వస్తాయి అని బహిరంగంగా పవన్ ప్రకటించారు. ఆ మాట పట్టుకుని జనసైనికులు వెయిటింగ్ లో వున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా వన్ థర్డ్ రాలేదు. ఇక ముందు వస్తాయేమో చూడాలి.

7 Replies to “అన్నకు మంత్రి పదవి వద్దన్న పవన్?”

  1. Okka ఇంట్లొ ఇద్దరు మంత్రులు కరెక్ట్ కాలేదు.అలా అందుకే ఇలా .రాజ్య సభ అయితే ఎవడు పట్టించు కోడు

  2. పదవి ఇస్తే.. చూసారా.. వాళ్లలో వాళ్ళే పంచేసుకొంటున్నారు అని ఏడుపు..

    పదవి ఇవ్వకపోతే.. చూసారా.. నాగబాబు ని తోక్కేస్తున్నారు అని మొసలి కన్నీళ్లు..

    ..

    పదవి ఇస్తే.. సామాజిక సూత్రాలు పాటించడం లేదా అనే ప్రశ్న..

    పదవి ఇవ్వకపోతే.. రక్తసంబంధాలకు విలువ లేదా అనే అనుమానం..

    ..

    పదవి ఇస్తే.. పార్టీ లో ఇంకెవరూ లేరా.. అనే దెప్పిపొడుపు..

    పదవి ఇవ్వకపోతే.. పార్టీ కోసం కష్టపడినా విలువ లేదా అనే సొల్లు కబుర్లు..

    ..

    ఫైనల్ గా.. మీరు జనాల దృష్టిలో రిజెక్టెడ్ పీసులు..

    ఏది మంచో.. ఏది ఎప్పుడు చేయాలో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు తెలుసు..

    నీలాంటి జగన్ రెడ్డి సంకలు నాకే కుక్కలకు చెప్పుకోవాల్సిన పని లేదు..

  3. ఎన్నికలకి ముందు జగన్ రెడ్డి కూడా why not 175 అన్నాడు తీరా అందులో 10 శాతం కూడా రాలేదు , ఇప్పుడు అదే బాబు ని ప్రతి పక్ష హోదా ఇవ్వమని అడుక్కుంటున్నాడు

  4. సైబరాబాద్ మొక్క..అవినీతి చెట్టు అయ్యింది అంటా ..! ఆర్టికల్ లేదా ఎంకటి పుష్పం

  5. సైబరాబాద్ మొక్క..అ వి నీ తి చెట్టు అయ్యింది అంటా ..! ఆర్టికల్ లేదా ఎంకటి పుష్పం

Comments are closed.