తూచ్‌తూచ్ … ర‌మేశ్‌నాయుడు యూట‌ర్న్‌

ఏపీ బీజేపీ యువ‌నాయ‌కుడు నాగోతు ర‌మేశ్‌నాయుడు నెటిజ‌న్ల దెబ్బ‌కు యూట‌ర్న్ తీసుకోవాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే, అలాగే చంద్ర‌బాబును స‌మ‌ర్థించే బీజేపీ యువ నాయ‌కుడిగా  ర‌మేశ్‌నాయుడిని మీడియా గుర్తించింది. అందుకే ర‌మేశ్‌నాయుడు అన్ని వేళ‌లా…

ఏపీ బీజేపీ యువ‌నాయ‌కుడు నాగోతు ర‌మేశ్‌నాయుడు నెటిజ‌న్ల దెబ్బ‌కు యూట‌ర్న్ తీసుకోవాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే, అలాగే చంద్ర‌బాబును స‌మ‌ర్థించే బీజేపీ యువ నాయ‌కుడిగా  ర‌మేశ్‌నాయుడిని మీడియా గుర్తించింది. అందుకే ర‌మేశ్‌నాయుడు అన్ని వేళ‌లా ఎల్లో మీడియాలోనే క‌నిపిస్తుంటారు.

ఇదిలా ఉండ‌గా ఈ ర‌మేశ్‌నాయుడు జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన నాయ‌కుడు. ఏబీవీపీ నుంచి ఎదుగుతూ బీజేపీ యువ‌మోర్చా నేత‌గా పార్టీలో గుర్తింపు ఉంది. చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌మేశ్ వైసీపీ అంటే ఒంటి కాలిపై లేస్తుంటారు. కాగా ర‌మేశ్‌నాయుడు అత్యుత్సాహానికి పోయి …చివ‌రికి నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి యూట‌ర్న్ తీసుకున్నారు.

నవంబ‌ర్ 15న అంటే నిన్న గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సే వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ర‌మేశ్‌నాయుడు ట్విట‌ర్ అకౌంట్‌లో గాడ్సేకు సంబంధించిన ఓ పోస్టు ప్ర‌త్య‌క్ష‌మైంది. గాడ్సేకు నివాళుల‌ర్పిస్తూ పెట్టిన ఆ పోస్టు ఏంటంటే….

‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ముందెన్నడూ ఇలాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’ అని ర‌మేశ్‌నాయుడు నివాళులర్పించారు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఇదే ర‌మేశ్ గ‌తంలో గాంధీజీ త్యాగాన్ని స్మ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టును నెటిజ‌న్లు తెర‌పైకి తెచ్చారు.

ఈ పోస్టును గాడ్సేను ప్ర‌శంసిస్తూ చేసిన ట్వీట్‌ను పోలుస్తూ నెటిజ‌న్లు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయాల కోసం రెండు నాల్కుల ధోర‌ణితో అవ‌లంబిస్తున్నారంటూ తీవ్ర‌స్థాయిలో ట్రోల్ చేశారు. సోష‌ల్ మీడియాలో త‌న ప‌ట్ల వ్య‌తిరేక‌త‌కు ర‌మేశ్ దిగి రావాల్సి వ‌చ్చింది. గాడ్సేకు నివాళుల‌ర్పిస్తూ చేసిన ట్వీట్‌ను తొల‌గించారు.

అంతటితో ఆగ‌లేదు.  త‌న‌ ట్విటర్‌ను హ్యాండిల్‌ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారని, దానిని, వారి సేవలను తొలగించిన‌ట్టు ర‌మేశ్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా …డ్యామేజీ జ‌రిగిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకుంటే ఏం లాభం?

అద్యక్షులవారి తత్త్వం బోధపడిందా