రానురాను రాజగురువు ప‌త్రిక ….

రానురాను రాజుగారి గుర్రం గాడిదైన సామెత చందంగా రాజ‌గురువు ప‌త్రిక ఈనాడు కూడా ఆ ర‌కంగా త‌యార‌వుతోంది. తాను రాయ‌క‌పోతే, చూప‌కపోతే స‌మాజానికి ఏమీ తెలియ‌ద‌నే అంధ భ్ర‌మ‌లో రామోజీరావు ఉన్న‌ట్టున్నారు. సోష‌ల్ మీడియాతో…

రానురాను రాజుగారి గుర్రం గాడిదైన సామెత చందంగా రాజ‌గురువు ప‌త్రిక ఈనాడు కూడా ఆ ర‌కంగా త‌యార‌వుతోంది. తాను రాయ‌క‌పోతే, చూప‌కపోతే స‌మాజానికి ఏమీ తెలియ‌ద‌నే అంధ భ్ర‌మ‌లో రామోజీరావు ఉన్న‌ట్టున్నారు. సోష‌ల్ మీడియాతో పాటు ఇత‌ర‌త్రా మాధ్య‌మాలున్నాయ‌ని, నాణేనికి రెండో వైపు చూపే వ్య‌వ‌స్థ‌లు బోలెడు పుట్టుకొచ్చాయ‌నే స్పృహ ఈనాడుకు లేక‌పోవ‌డం విచిత్రంగా ఉంది.

సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జి ఎన్వీ ర‌మ‌ణ‌తో పాటు హైకోర్టు జడ్జీల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వివ‌రాల‌ను సీఎం స‌ల‌హాదారు అజేయ క‌ల్లం మీడియా సాక్షిగా బ‌య‌ట‌పెట్టారు. ఈ మీడియా స‌మావేశానికి సంబంధించి ఈనాడు, దాని తోక ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి రాయ‌ని విష‌యం తెలిసిందే. ఈ రెండు ప‌త్రిక‌ల ధోర‌ణుల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి.

కానీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ లేఖ రాయ‌డాన్ని ఖండిస్తూ జాతీయ‌స్థాయిలో న్యాయ‌వాదుల సంఘాలు చేసిన తీర్మానాల‌ను మాత్రం ఎల్లో మీడియా ప‌తాక శీర్షిక‌ల‌తో ప్ర‌చురించ‌డాన్ని చూస్తున్నాం. ఈ నేప‌థ్యంలో  జస్టిస్‌ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే తీవ్రంగా తప్పుపట్టారు. 

సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేకు స్పష్టం చేయ‌డంతో సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్‌లో చీలిక వ‌చ్చిన‌ట్టైంది.

‘వైఎస్‌ జగన్‌ ఆరోపణల్లో యధార్థత గురించి మనకు ఏమీ తెలియదు. ఓసారి విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుంది. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోజాలం. ప్రస్తుతం సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వమే అవుతుంది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుని, వాటి నుంచి అది నిష్కళంకంగా బయటపడలేదు. 

పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించలేదు’ అని దుష్యంత్‌ దవే కుండబద్దలు కొట్టారు.

ఇంకా ఆయన అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ పాండేకు లేఖ రాశారు.  ఇప్పుడీ లేఖ మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపింద‌ని చెప్పొచ్చు. సుప్రీంకోర్టుతో పాటు న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఇలాంటి సంచ‌ల‌న లేఖ‌కు ఈనాడులో స్థానం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నిన్న‌టికి నిన్న ఊరు, పేరు లేని వంద మంది న్యాయ‌శాస్త్ర విద్యార్థులు జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే …క‌ళ్ల‌క‌ద్దుకుని  ఈనాడు ప్ర‌చురించింది.

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్య‌తిరేకించ‌డంతో పాటు త‌న అభిప్రాయాల్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పినా ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం ఏ మాత్రం జ‌ర్న‌లిజం నీతో రామోజీకే తెలియాలి. కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌త్రిక‌ను న‌డుపుకోవాల‌నుకుంటే …అదేదో బ‌హిరంగంగా ప్ర‌క‌టించుకుంటే స‌రిపోతుంది. అప్పుడు స‌మాజం నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు రావు క‌దా!

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే