సుడిగాలి సుధీర్ పై పుకార్లకు కారణం ఇదే!

గతంలో నాగబాబు, జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నప్పుడు చాలా మార్పులు జరిగాయి. నాగబాబుతో పాటు ఓ వర్గం జబర్దస్త్ నుంచి తప్పుకుంది. అప్పట్లో జరిగిన ఆ పరిణామం, జబర్దస్త్ లో పెద్ద కుదుపు. మళ్లీ…

గతంలో నాగబాబు, జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నప్పుడు చాలా మార్పులు జరిగాయి. నాగబాబుతో పాటు ఓ వర్గం జబర్దస్త్ నుంచి తప్పుకుంది. అప్పట్లో జరిగిన ఆ పరిణామం, జబర్దస్త్ లో పెద్ద కుదుపు. మళ్లీ ఇప్పుుడు మరోసారి వార్తల్లోకెక్కింది ఈ కార్యక్రమం. ఈసారి ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

జబర్దస్త్ లో పాల్గొనే పార్టిసిపెంట్లు అందరితో మల్లెమాల సంస్థ అగ్రిమెంట్లు రాయించుకుంటుంది. కొందరితో రెండేళ్లు, మరికొందరితో మూడేళ్లు.. ఇలా రకరకాలుగా అగ్రిమెంట్లు రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటుంది. తాజాగా సుధీర్ కు సంబంధించిన కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో మరో కొత్త అగ్రిమెంట్ తో, సుధీర్ సంతకాల కోసం ప్రయత్నించింది మల్లెమాల సంస్థ. ప్రస్తుతం ఇస్తున్న పారితోషికాన్ని కాస్త పెంచి మరీ కొత్త అగ్రిమెంట్ పేపర్లు తయారుచేయించింది.

అయితే ఈ కాంట్రాక్ట్ పై సంతకం పెట్టడానికి తనకు సమయం కావాలని సుడిగాలి సుధీర్, ప్రొడక్షన్ సంస్థను కోరాడు. సరిగ్గా ఇక్కడే అతడిపై పుకార్లు మొదలయ్యాయి. జబర్దస్త్ లో కొనసాగడానికి సుడిగాలి సుధీర్ ఆసక్తి చూపించడం లేదంటూ కథనాలు మొదలయ్యాయి. అందులో కొంత నిజం కూడా ఉంది.

సుడిగాలి సుధీర్ కు ఇప్పుడు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద సినిమాల్లో కమెడియన్ పాత్రలతో పాటు, సోలో హీరోగా కూడా నటించమంటూ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కూడా హీరో పక్కన కనిపించే మంచి రోల్ పోషించాడు ఈ నటుడు. 

దీంతో ఇటు జబర్దస్త్ కార్యక్రమాలకు, అటు సినిమా ఆఫర్లకు టైమ్ కేటాయించలేకపోతున్నాడు. దీనికితోడు జబర్దస్త్ కాకుండా.. ఇతర టీవీ కార్యక్రమాల్లో కూడా సుడిగాలి సుధీర్ బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జబర్దస్త్ నుంచి తప్పుకోవడమే బెటర్ అని భావిస్తున్నాడట ఈ హాస్యనటుడు.