ఏడు కొండ‌ల‌పై ఏడు ర‌కాల అగ‌ర్‌బ‌త్తీలు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ర‌సాయ‌నాల ర‌హిత‌ అగ‌ర‌బ‌త్తీల అమ్మ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ అగ‌ర‌బ‌త్తీల త‌యారీపై టీటీడీ ఎంతో శ్ర‌ద్ధ పెట్టింది. ఎట్ట‌కేల‌కు విజ‌య‌వంతంగా అమ్మ‌కాల‌ను ప్రారంభించింది. అగ‌ర‌బ‌త్తీల విక్ర‌య కేంద్రాన్ని సోమ‌వారం టీటీడీ…

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ర‌సాయ‌నాల ర‌హిత‌ అగ‌ర‌బ‌త్తీల అమ్మ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ అగ‌ర‌బ‌త్తీల త‌యారీపై టీటీడీ ఎంతో శ్ర‌ద్ధ పెట్టింది. ఎట్ట‌కేల‌కు విజ‌య‌వంతంగా అమ్మ‌కాల‌ను ప్రారంభించింది. అగ‌ర‌బ‌త్తీల విక్ర‌య కేంద్రాన్ని సోమ‌వారం టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆల‌యాల్లో వాడిన పూల‌తో అగ‌ర‌బ‌త్తీల త‌యారీని ప్రారంభించామ‌న్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఓ సంస్థ వీటిని త‌యారు చేస్తోంద‌న్నారు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో వీటిని భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చిన‌ట్టు వైవీ తెలిపారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారన్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించామ‌న్నారు. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇదిలా ఉండ‌గా శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేయ‌డం భ‌క్తుల‌కు ఆక‌ట్టుకుంటోంది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీలను విక్ర‌యించ‌నున్నారు.  ప్రారంభోత్స‌వ‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.