2 రోజుల కిందటి సంగతి.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపుపై పోలీసులు దాడి చేశారు. వాళ్లకొచ్చిన సమాచారం నిజమే. కిరాణా షాపులో 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు దొరికాయి. వాటిని వెంటనే సీజ్ చేసి, షాపు ఓనర్ మనోజ్ కుమార్ అగర్వాల్ ను అరెస్ట్ చేశారు.
ఇలాంటివి నగరంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన అరెస్ట్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఉంది. జగద్గిరిగుట్టలోని సదరు కిరాణ షాపులో నోరూరించే మిల్క్ షేక్ లు కూడా అమ్ముతున్నాడు మనోజ్. అయితే అందులో గంజాయి కలుపుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ మేటర్.
అవును.. సమ్మర్ లో ఎవరైనా చల్లగా ఏదైనా తాగాలనుకుంటారు. దాన్ని ఈ షాపు ఓనర్ క్యాష్ చేసుకోవాలని భావించాడు. మిల్క్ షేక్ లో గంజాయి కలిపి అమ్మడం మొదలుపెట్టాడు. ఇంకాస్త ఎక్స్ ట్రా టేస్ట్ కోసం హార్లిక్స్, బూస్ట్ కూడా కలుపుతున్నాడు.
ఈ మిల్క్ షేక్ తాగిన వాళ్లు 7 గంటల పాటు మత్తులోకి జారుకుంటున్నారు. మొన్నటివరకు చాక్లెట్ల్ అమ్మిన తను, గడిచిన నెల రోజులుగా ఈ ‘మిల్క్ షేక్’ వ్యాపారం చేస్తున్నట్టు మనోజ్ వెల్లడించడంతో, ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.