కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?

మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించడం కోసం ఢిల్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇంత మొండి పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానీ విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక్కరోజు వచ్చాడు. అంతే. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కావడానికి కృషి చేసిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మరణిస్తే కూడా ఢిల్లీ వెళ్లి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేదు.

అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సంతాప తీర్మానం ఆమోదించి, నివాళి అర్పించినా హాజరు కాలేదు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేసీఆర్ వస్తాడని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన రావాలనే కోరుకున్నాడు.

ఇది కేవలం సంతాపం తెలపడానికి పెట్టిన సమావేశం కాబట్టి ఇందులో విమర్శలకు, వాదోపవాదాలకు అవకాశం లేదు. మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ సన్నిహితుడు కాబట్టి ఆయన వచ్చిఉంటే బాగుండేది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోనూ కేసీఆర్ మంత్రిగా పనిచేశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మనోహన్ సింగ్ కు సానుభూతి ఉంది. ఆ ఉద్యమాన్ని ఆయన సమర్ధించారు. ఆంధ్ర ఎంపీల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా, రాజీనామాలు చేసినా చలించకుండా తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు.

అలాంటి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించడం కోసం ఢిల్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇంత మొండి పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండును గులాబీ పార్టీ సంపూర్ణంగా సమర్ధించింది. ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలిపింది. ఈ విషయంలో కాంగ్రెస్ అండ్ గులాబీ పార్టీ ఒక్కటయ్యాయి.

12 Replies to “కేసీఆర్ కు మరీ ఇంత మొండి పట్టుదలా?”

  1. prajalu kattina taxlu salary gaa teesukutu assembly ki vellani ialanti vedhavalani resign cheyaamanali. ee vishayamlo courtlu emi chestunnai gaadidalu kaastunnaya

Comments are closed.